వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుష్మా, వెంకయ్య..: మంత్రులుగా బాధ్యతలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ తోపాటు సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన కేంద్రమంత్రుల్లో పలువురు మంగళవారమే బాధ్యతలు తీసుకోగా, మరికొందరు బుధవారం తమ శాఖల బాధ్యతలను స్వీకరించారు. సుష్మా స్వరాజ్, మేనకా సంజయ్ గాంధీ, వెంకయ్య నాయుడు, ఉమా భారతిలతోపాటు పలువురు తమ పదవులను అలంకరించారు.

భారతీయ జనతా పార్టీ సీనియర్ ఎంపి సుష్మా స్వరాజ్ విదేశాంగం, ప్రవాస భారతీయుల వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. వెంకయ్య నాయుడు పట్టణాభివృద్ధి, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయిన శివసేన పార్టీ ఎంపి అనంత్ గీతే భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

జితేందర్ సింగ్

జితేందర్ సింగ్

శాస్త్ర సాంకేతికం, బౌగోళిక శాస్త్రాలు (స్వతంత్ర హోదా), పిఎంఓ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణు ఇంధనం, అంతరిక్ష వ్యవహారాల శాఖ మంత్రిగా జితేందర్ సింగ్ బుధవారం బాధ్యతలు తీసుకున్నారు.

అనంత్ కుమార్

అనంత్ కుమార్

భారతీయ జనతా పార్టీ ఎంపి అనంత కుమార్ రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిగా బుధవారం బాధ్యతలు తీసుకున్నారు.

అనంత్ గీతే

అనంత్ గీతే

ఎన్డీఏ భాగస్వామి శివసేన పార్టీ ఎంపి అనంత్ గీతే భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా బుధవారం బాధ్యతలు తీసుకున్నారు.

మేనకా సంజయ్ గాంధీ

మేనకా సంజయ్ గాంధీ

బిజెసి సీనియర్ ఎంపి మేనకా గాంధీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

కల్‌రాజ్ మిశ్రా

కల్‌రాజ్ మిశ్రా

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రిగా కల్‌రాజ్ మిశ్రా బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

మనోజ్ సిన్హా

మనోజ్ సిన్హా

రైల్వే శాఖ సహాయ మంత్రిగా మనోజ్ సిన్హా బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

పియూష్ గోయల్

పియూష్ గోయల్

విద్యుత్తు, బొగ్గు, నూతన, సంప్రదాయేతర ఇంధనం(స్వతంత్ర హోదా) శాఖ మంత్రిగా పియూష్ గోయల్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

ప్రకాష్ జవదేకర్

ప్రకాష్ జవదేకర్

సమాచార ప్రసారాలు, పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పు (స్వతంత్ర హోదా), పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ప్రకాష్ జవదేకర్ బాధ్యతలు స్వీకరించారు.

రాధామోహన్ సింగ్

రాధామోహన్ సింగ్

వ్యవసాయ శాఖ మంత్రిగా రాధామోహన్ సింగ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

సంజీవ్ కుమార్ బల్యాన్

సంజీవ్ కుమార్ బల్యాన్

వ్యవసాయం, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా సంజీవ్ కుమార్ బల్యాన్ బాధ్యతలు స్వీకరించారు.

సుష్మా స్వరాజ్

సుష్మా స్వరాజ్

భారతీయ జనతా పార్టీ సీనియర్ ఎంపి సుష్మా స్వరాజ్ విదేశాంగం, ప్రవాస భారతీయుల వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

ఉమాభారతి

ఉమాభారతి

ఉమా భారతి కేంద్రమంత్రిగా బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. ఆమెకు జలవనరుల శాఖ, నదుల అభివృద్ధి, గంగా పునరుద్ధరణ కేటాయించారు.

వెంకయ్య నాయుడు

వెంకయ్య నాయుడు

వెంకయ్య నాయుడు పట్టణాభివృద్ధి, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

English summary
Several new ministers in Narendra Modi cabinet assume office, more to join Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X