• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దేశ భవిష్యత్తు మార్చండి.. యువ ఓటర్లకు మోడీ పిలుపు.. ఓటేసిన పలువురు ప్రముఖులు

|
  Lok Sabha Election 2019 : దేశ భవిష్యత్తు మార్చండి.. యువ ఓటర్లకు మోడీ పిలుపు || Oneindia Telugu

  సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత తప్పక ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు. 'ఈ రోజు లోక్‌సభ ఎన్నికల తుదిదశ పోలింగ్. ఈ ఎన్నికల్లో అందరూ తమ ఓటుహక్కు వినియోగించుకుని రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదుచేయాలి. మీ ఓటు భవిష్యత్ భారతావని తలరాతను మార్చేయాలి. తొలిసారి ఓటేసే వాళ్లందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారనుకుంటున్నా'నని మోడీ ట్వీట్ చేశారు.

  సజావుగా సాగుతున్న చివరి విడత పోలింగ్

  అభివృద్ధికి పట్టం కట్టండి

  అభివృద్ధిని కోరుకునేవాళ్లంతా ఓటింగ్‌లో పాల్గొనాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ పిలుపునిచ్చారు. "సరికొత్త భారత్‌ను కోరుకుంటున్న వాళ్లు అభివృద్ధికి ఓటేస్తారు. అభివృద్ధి, సంక్షేమం గురించి భరోసా మంచి నాయకుడు మాత్రే ఇవ్వగలడు. పేదలకు ఇళ్లు, విద్యుత్, నీరు, గ్యాస్, మరుగుదొడ్ల వంటి మౌలిక సదుపాయాలు అందించింది ప్రజా సంక్షేమం కోసమే. మీ ఓటుతో మంచి నాయకుడిని ఎన్నుకోండి" అని ట్వీట్ చేశారు.

  మోడీ వైపు ఉన్న ఓటర్లు

  ఆఖరి విడుత ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌లోని 246వ నెంబర్ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ఓటేయడానికి ప్రజలు చూపిస్తున్న ఉత్సాహం చూస్తుంటే ఆనందంగా ఉందన్న ఆయన.. ఓటర్లంతా మోడీవైపే ఉన్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. కేంద్రమంత్రి, బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ తమ కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పాట్నా ఉమెన్స్ కాలేజీలో ఓటేశారు.

  ఎన్నికల వ్యవధిపై నితీశ్ అసంతృప్తి

  ఎన్నికల వ్యవధిపై నితీశ్ అసంతృప్తి

  బీహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ ఓటు వేశారు. పాట్నాలోని రాజ్‌భవన్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో నితీశ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పాట్నాలోని 46వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో సుశీల్ మోడీ ఓటేశారు. 'ఈసారి లోక్‌సభ ఎన్నికలు చాలా రోజులు జరిగాయి. ఒక్కో దశ పోలింగ్‌కు ఎంతో వ్యవధి ఏర్పడింది. ఎన్నికలు ఇలా జరగకూడదు. ఈ విషయంపై అన్ని పార్టీల నేతలకు లేఖ రాస్తాన'ని నితీశ్ స్పష్టం చేశారు.

  క్యూలో నిలబడి ఓటేసిన ప్రముఖులు

  హిమాచల్ సీఎం జైరామ్ ఠాకూర్ మండిలో ఓటు వేయగా.. బీజేపీ నేత ప్రేమ్ కుమార్ ధుమాల్, ఎంపీ అనురాగ్ ఠాకూర్ హమీర్‌పూర్‌లోని పోలింగ్ బూత్‌లో క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యప్రదేశ్ ఇండోర్‌లో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ ఓటేశారు. టీమిండియా క్రికెటర్ హర్బజన్ సింగ్ పంజాబ్‌ జలంధర్‌లోని గార్హి గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయమే పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన తన వంతు కోసం చాలాసేపు క్యూలో నిల్చుని ఓటేశారు.

  English summary
  Prime Minister Narendra Modi tweeted this morning and urged voters in 59 parliamentary constituencies in seven states and a union territory polling in the last phase phase of national elections to step out and vote in record numbers. UP cm Yogi adityanath, Bihar cm nitish, Deputy cm susheel modi among the prominent leader who cast their vote
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more