నాకు పెళ్ళి కాలేదు, నేనేం నపుంసకుడిని కాను: హర్ధిక్ పటేల్ సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

గాంధీనగర్: తన రాసలీలలకు సంబంధించినదంటూ మీడియాలో ప్రసారమైన వీడియోలపై పటేళ్ళ ఉద్యమ కారుడు హర్ధిక్ పటేల్ తీవ్రంగా స్పందించారు. బిజెపి డర్టీ పాలిటిక్స్‌కు పాల్పడుతోందన్నారు. అంతేకాదు తనకు ఇంకా పెళ్ళికాలేదన్నారు. అదే సమయంలో తాను నపుంసకుడిని కాదంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయాన్ని పురస్కరించుకొని పటేల్ ఉద్యమకారుడు హర్ధిక్ పటేల్‌ను పోలిన వ్యక్తి ఓ యువతితో ఉన్న దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి.

ఈ వీడియోలపై న్యాయ పోరాటం చేస్తానని హర్దిక్ పటేల్ ప్రకటించారు. బిజెపి నీచ రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపణలు చేశారు. విదేశాల నుండి ఈ వీడియోని అప్ లోడ్ చేశారని ఆయన ఆరోపించారు.

నేను నపుంసడకుడిన కా

నేను నపుంసడకుడిన కా


మీడియాలో వచ్చిన దృశ్యాలపై హర్ధిక్ పటేల్ సమాధానమిచ్చారు. నాకు ఇంకా పెళ్లి కాలేదు. నేను నపుంసకుడిని కాదంటూ హర్ధిక్ పటేల్ దుయ్యబట్టారు. . తన పేరు చెడగొట్టడానికి బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.

 ఆ వీడియోలో ఉంది నేను కాదు

ఆ వీడియోలో ఉంది నేను కాదు

ఆ వీడియోలో ఉన్నది తాను కాదని హర్ధిక్ పటేల్ ప్రకటించారు. ఈ వీడియోను ఇతర దేశాల నుంచి అప్‌లోడ్‌ చేశారని, అదొక ఫేక్‌ వీడియో అంటూ వివరణ ఇచ్చారు. రాజకీయంగా దెబ్బతీసేందుకు బీజేపీ ఇలాంటి చీప్‌ ట్రిక్స్‌ ప్లే చేస్తుందని ఫైర్‌ అ‍య్యారు.

 మార్పింగ్ చేశారన్న హర్ధిక్ పటేల్

మార్పింగ్ చేశారన్న హర్ధిక్ పటేల్

పటేల్


మార్ఫింగ్‌తో తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని హర్ధిక్ పటేల్ ఆరోపించారు.ఇలాంటి కుట్ర తనపై జరుగుతుందని గతంలోనే తెలిపానని గుర్తు చేశారు. ఈ వీడియోపై న్యాయపరంగా పోరాటం చేస్తానన్నారు. గుజరాత్ ఎన్నికల్లో హర్ధిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారు.

 మే లో రికార్డైన దృశ్యాలు

మే లో రికార్డైన దృశ్యాలు

2017 మే 16న హార్ధిక్ పటేల్‌ను పోలిన వ్యక్తి రాసలీలలు జరిపినట్లు ఓ హోటల్‌ సీసీ కెమెరాల్లో రికార్డైంది.నాలుగు నిమిషాల వ్యవధి గల వీడియో మీడియోలో ప్రసారమైంది. అయితే ఈ ఆరోపణలను హర్ధిక్ పటేల్ తీవ్రంగా ఖండించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Campaigning in the upcoming Gujarat Legislative Assembly election is at its peak. Amid intensifying allegations and counter-allegations between political parties, a sex CD featuring Patidar leader Hardik Patel was leaked on Monday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి