వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్స్‌లో ఉత్తరాదే టాప్, 19 ఏళ్ళలోపునే యువతులకు ఆ అనుభవం: సర్వే

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దక్షిణ భారత దేశంతో పోలిస్తే ఉత్తరభారతదేశానికి చెందిన యువత లైంగిక జీవితంలో చరుగ్గా ఉంటున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తేటతెల్లం చేసింది. 15 నుండి 19 ఏళ్ళ మధ్య ఉన్న యువతులు పురుషుల కంటే ముందుగానే తొలిసారిగా లైంగిక అనుభవాన్ని పొందుతున్నారని ఈ సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి.

దేశంలోని పలు రాష్ట్రాల్లో స్త్రీ, పురుషుల్లో లైంగిక సంబంధాలపై ప్రభావం, ఏ వయస్సు వారు తొలిసారిగా లైంగిక అనుభవాన్ని పొందుతున్నారనే విషయంపై కూడ ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

ఉత్తర భారతదేశానికి చెందిన వారు ఎక్కువగా లైంగిక జీవితంలో చురుగ్గా ఉంటున్నారు. అబ్బాయిల కంటే అమ్మాయిలే తొలిసారి అనుభవాన్ని 19 ఏళ్ళలోపునే రుచిచూస్తున్నారని ఈ సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి.

సెక్స్ అనుభవం 19 ఏళ్ళలోపుగానే అమ్మాయిల్లో

సెక్స్ అనుభవం 19 ఏళ్ళలోపుగానే అమ్మాయిల్లో

2015-16లో దేశవ్యాప్తంగా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేను దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిర్వహించింది. ఈ సర్వే ప్రకారంగా పురుషుల కంటే స్త్రీలే తొలుత సెక్స్ అనుభవాన్ని పొందుతున్నారని ఈ సర్వే వెల్లడించింది. కేవలం 15 నుండి 19 ఏళ్ళ వయస్సులోపుగానే అమ్మాయిలు తొలిసారి సెక్స్ అనుభవాన్ని పొందుతున్నారని తేలింది. అయితే పురుషులు మాత్రం ఆలస్యంగా సెక్స్ లో తొలి అనుభవాన్ని ఆలస్యంగా పొందుతున్నారని ఈ సర్వే తేటతెల్లం చేసింది. అయితే యుక్తవయస్సు రాగానే అమ్మాయిలకు వివాహాలు చేయడం కూడ ఇందుకు ఒక కారణంగా చెబుతున్నారు.

పెళ్లికి ముందుకు సెక్స్‌లో పాల్గొన్నవారు ఎక్కువ

పెళ్లికి ముందుకు సెక్స్‌లో పాల్గొన్నవారు ఎక్కువ

దేశంలోని పలు ప్రాంతాల్లో పెళ్లికి ముందు సెక్స్‌ పై సర్వే నిర్వహించారు. ఈ సర్వే ప్రకారంగా 15-24 ఏళ్ల మధ్య నున్న 11% మంది ఒంటరి పురుషులు, 2% మంది ఒంటరి మహిళలు తాము సెక్స్‌లో పాల్గొన్నట్లు చెప్పారు. ఈ వయసున్న గ్రూపులో పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొన్న పురుషుల్లో అత్యధికంగా ఛత్తీస్‌గఢ్‌లో 21.1% మంది, మధ్యప్రదేశ్‌లో 20.7% మంది ఉన్నారని ఈ సర్వే రిపోర్ట్ తేల్చింది.

ఉత్తరభారతీయులు సెక్స్‌లో ఇలా.

ఉత్తరభారతీయులు సెక్స్‌లో ఇలా.

దక్షిణ భారతీయులతో పోలిస్తే ఉత్తరభారతదేశానికి చెందినవారు సెక్స్ జీవితంలో చురుగ్గా ఉంటున్నారని ఈ సర్వే తేల్చింది. హర్యానా, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో సర్వేలో పాల్గొన్న దాదాపు 55 శాతం మంది చాన్నాళ్ల ముందు నుంచే తాము సెక్స్‌లో పాల్గొంటున్నట్లు చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, మహారాష్ట్ర రాష్ట్రాలు ఆ తర్వాతి స్థానంలో నిలిచాయి. నాలుగు వారాలకు ముందు నుంచి సెక్స్‌లో పాల్గొంటున్నామని చెప్పిన వారిలో జాతీయ స్థాయిలో 47% మంది ఉన్నారు. ఇందులో పురుషుల్లో 48% మంది ఉన్నారు.

బాయ్, గర్ల్‌ఫ్రెండ్స్‌తో సెక్స్

బాయ్, గర్ల్‌ఫ్రెండ్స్‌తో సెక్స్

బాయ్, గర్ల్‌ఫ్రెండ్స్‌తో సెక్స్ లో పాల్గొనేవారు ఎక్కువగా ఉన్నారని ఈ సర్వే నివేదిక తేటతెల్లం చేసింది.పెళ్ళికాకుండానే బాయ్ ప్రెండ్స్‌ సుమారు 60 శాతానికిపైగా సెక్స్‌లో పాల్గొంటున్నారు. అయితే గర్ల్స్ మాత్రం బాయ్స్ తో ఇంచుమించుగా ఇదే రకమైన సమాధానం ఇచ్చారు. ఈ సంఖ్య కూడ 60 శాతం దాటింది.సహజీవనం చేస్తున్న వారు సెక్స్‌లో పాల్గొంటున్న శాతం సుమారు 20 శాతానికి దగ్గర్లో ఉంది. అనుకోకుండా కలిసిన వ్యక్తులతో సెక్స్ లో పాల్గొన్నవారిలో పురుషులు ఎక్కువగా ఉన్నారు. సుమారు 20 శాతానికి పైగా ఈ సంఖ్య ఉంది. సెక్స్ వర్కర్ తో లైంగిక సుఖం పొందుతున్నవారిలో ఎక్కువగా పురుషులున్నారు. అయితే స్త్రీలు కూడ ఈ కోవలో ఉన్నా కానీ, ఈ సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్టు సర్వే తేటతెల్లం చేసింది.ఇతరులతో సెక్స్ లో పాల్గొన్న వారిలో మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఈ సంఖ్య 20 శాతానికిపైగా ఉంది. అయితే ఆశ్చర్యకరంగా పురుషుల సంఖ్య కేవలం పది శాతం లోపుగానే ఉందని ఈ సర్వే వివరాలు వెల్లడిస్తున్నాయి.

ఒంటరి మహిళల్లో సెక్స్ జీవితంపై రిపోర్ట్

ఒంటరి మహిళల్లో సెక్స్ జీవితంపై రిపోర్ట్

హర్యానా, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లలోని ఒంటరి పురుషుల్లో కనీసం 5 శాతం మంది తాము శృంగారంలో పాల్గొన్నట్లు చెప్పారు. ఒంటరి మహిళల్లో కర్ణాటకలో 2 శాతం మంది, గుజరాత్‌లో 1.9% మంది ఈ రకమైన సమాధానాలు చెప్పారని ఈ సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయని చెప్పారు.

English summary
North Indians have a more active sex life compared to South Indians, according to data from the National Family Health Survey.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X