వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లి పేరుతో నమ్మించి సెక్స్ చేసే రేప్ కిందే లెక్క : సుప్రీంకోర్టు

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : పెళ్లి పేరుతో వంచించే మృగాళ్లకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. నమ్మించి మోసం చేసి సెక్స్‌లో పాల్గొనడం నేరమని స్పష్టం చేసింది. పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి యువతులు, మహిళలతో సెక్స్ చేస్తే అది రేప్‌తో సమానమని తేల్చి చెప్పింది. ఈ మేరకు జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. వంచించి మోసం చేసిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.

పెళ్లి చేసుకుంటానని మోసం

పెళ్లి చేసుకుంటానని మోసం

ఛత్తీస్‌గడ్ బిలాస్‌పూర్‌కు చెందిన ఓ యువతికి డాక్టర్ అనురాగ్ సోనితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వారిద్దరూ 2009 నుంచి సహజీవనం చేస్తున్నారు. అనురాగ్ పెళ్లిచేసుకుంటానని మాట ఇవ్వడంతో నమ్మిన సదరు యువతిని అతనితో లైంగిక సంబంధానికి ఒప్పుకుంది. అలా తన మాయమాటలతో అనురాగ్ పలుమార్లు ఆమెతో సెక్స్‌లో పాల్గొన్నాడు. చివరకు ఆ యువతి పెళ్లి ప్రస్తావన తేవడంతో ముఖం చాటేశాడు.

మాయమాటలు చెప్పి సెక్స్‌ చేస్తే రేప్ కిందే లెక్క

మాయమాటలు చెప్పి సెక్స్‌ చేస్తే రేప్ కిందే లెక్క

డాక్టర్ అనురాగ్ తప్పించుకు తిరుగుతుండటంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన ట్రయల్ కోర్టు నిందితునికి పదేళ్ల జైలు శిక్ష విధించగా... హైకోర్టు దాన్ని సమర్థించింది. హైకోర్టు తీర్పుపై నిందితుడు సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లాడు. విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అమ్మాయితో లైంగిక సంబంధం పెట్టుకోవడం నేరంగా పరిగణించింది. యువతి అంగీకారం తెలిపినా అది అత్యాచారం కిందకే వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

నిందితుడికి ఏడేళ్ల జైలు

నిందితుడికి ఏడేళ్ల జైలు

పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన డాక్టర్ అనురాగ్‌ను సుప్రీంకోర్టు దోషిగా తేల్చింది. ఐపీసీ సెక్షన్ 376కింద ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యాచార ఘటనలు బాధితురాలికి భౌతికంగానే కాక మానసిక క్షోభకు గురిచేస్తాయని, హత్య కన్నా రేప్ అత్యంత దారుణమైన నేరమని అభిప్రాయపడింది. ఈ మధ్యకాలంలో పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేసే నేరాలు పెరిగిపోయానని, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని న్యాయమూర్తులు హెచ్చరించారు.

English summary
In a significant verdict the Supreme Court has held that a person having sex with a woman on the promise of marrying her will amount to rape and her consent will be of no consequence as it is obtained by fraud.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X