వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లి పేరుతో సెక్స్ -ప్రతిసారి నేరం కాబోదు -హైకోర్టు సంచలన తీర్పు - రేప్ కేసులో వ్యక్తి నిర్దోషి

|
Google Oneindia TeluguNews

భార్యాభర్తల లైంగిక హక్కులు, సహజీవనాలు, వివాహేతర సంబంధాలపై పలు సందర్బాల్లో కీలక తీర్పులు చెప్పిన న్యాయస్థానాలు.. తాజాగా పెళ్లి పేరుతో అమ్మాయిలు, అబ్బాయిలు కొనసాగించే సెక్స్ సంబంధాలు, వాటిపై తలెత్తే వివాదాల గురించి సంచలన ఉత్తర్వులు ఇచ్చింది. డేటింగ్, లివ్-ఇన్ కల్చర్ బాగా పేరిగిపోతోన్న ప్రస్తుత సందర్భంలో.. పెళ్లికి ముందే సెక్స్ లేదా పెళ్లి పేరుతో సెక్స్ వ్యవహారాలను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుందని చెప్పింది. వివరాల్లోకి వెళితే..

వైసీపీ ఇన్నాళ్లూ బాధపడింది చాలు -రెట్టింపు ఉత్సాహంతో వస్తున్నా -ముంబై ఆస్పత్రి నుంచి ఎంపీ రఘురామ డిశ్చార్జ్వైసీపీ ఇన్నాళ్లూ బాధపడింది చాలు -రెట్టింపు ఉత్సాహంతో వస్తున్నా -ముంబై ఆస్పత్రి నుంచి ఎంపీ రఘురామ డిశ్చార్జ్

ఢిల్లీ హైకోర్టు సంచలనం..

ఢిల్లీ హైకోర్టు సంచలనం..

దేశరాజధాని ఢిల్లీలో నమోదైన ఓ రేప్ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు గురువారం తుది తీర్పు వెల్లడించింది. పెళ్లి పేరుతో సెక్స్ చేయడం అన్నిసార్లూ అత్యాచారంగానే పరిగణించడానికి వీల్లేదని జస్టిస్ విభు భక్రు నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. పురుషునితో స్త్రీ చాలా కాలం అన్యోన్యంగా కలిసి ఉండిన సందర్భంలో ‘పెళ్లి పేరుతో సెక్స్'ను అత్యాచారంగా అభివర్ణించడం సరికాదని పేర్కొంది. తీర్పు సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

 సెక్స్ కోసమే పెళ్లి హామీ అనలేం..

సెక్స్ కోసమే పెళ్లి హామీ అనలేం..

కొన్ని కేసుల్లో పెళ్ళి చేసుకుంటాననే వాగ్దానం చేసిన తర్వాత సెక్స్‌‌కు అంగీకరిస్తారని గుర్తు చేసిన ధర్మాసనం.. ఓ వ్యక్తితో మహిళ చాలాకాలం శారీరక సంబంధం కొనసాగిస్తే.. పెళ్లి చేసుకుంటాననే హామీతోనే ఆ మహిళ సదరు వ్యక్తితో శృంగారంలో పాల్గొంటే దాన్ని అత్యాచారం అనలేమని, చాలాకాలం పాటు స్త్రీ, పురుషుల మధ్య శృంగార జీవితం కొనసాగిన సందర్భంలో పెళ్లి చేసుకుంటాననే హామీని సెక్స్ వైపు ఆకర్షించేందుకు ప్రోత్సహించడంగా చెప్పలేమని జడ్జి విభు అన్నారు.

 అది రేప్ కిందికే వస్తుంది, కానీ..

అది రేప్ కిందికే వస్తుంది, కానీ..

పెళ్లి చేసుకుంటాననే తప్పుడు హామీలతో శారీరక సంబంధాలు పెట్టుకోవడం, అవతలివాళ్ల పరిస్థితిని అవకాశంగా తీసుకుని మోసానికి పాల్పడం కచ్చితంగా నేరమే అవుందని, అప్పుడు భారత శిక్షా స్మృతిలో అత్యాచారం నేరం పరిగణలోకి వస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఆయా కేసుల్లో అమ్మాయి అబ్బాయి ఎంతకాలంగా కలిసుంటూ, సెక్స్ సంబంధం కొనసాగుతోందనే అంశం ఇక్కడ చాలా ప్రధానమైనదని జడ్జి అన్నారు. సాధారణం కన్నా ఎక్కువ కాలంపాటు అన్యోన్యంగా ఉన్న సందర్భంలో దీనిని అత్యాచారంగా పరిగణించడం సాధ్యం కాదని హైకోర్టు పేర్కొంది.

 కేసు తీవ్రతను బట్టే..

కేసు తీవ్రతను బట్టే..

కొన్ని కేసుల్లో, అమ్మాయి లేదా అబ్బాయి సెక్సువల్ రిలేషన్స్‌కు సమ్మతించాలని అనుకోకపోయినప్పటికీ, ఎదుటివాళ్లు పెళ్లి చేసుకుంటాననే వాగ్దానం మేరకు సెక్సువల్ రిలేషన్స్ పెట్టుకునేందుకు అంగీకరించే విధంగా ప్రలోభపెట్టే అవకాశం ఉందని, సంబంధిత పార్టీ(అమ్మాయి లేదా అబ్బాయి) తనకు సెక్స్ వద్దని చెప్పాలనుకున్నప్పటికీ, అటువంటి పెళ్లి పేరుతో ప్రలోభాలు నిర్దిష్ట క్షణంలో ఆమె లేదా అతని సమ్మతిని రాబట్టే అవకాశం ఉంటుందని, అలాంటప్పుడు మాత్రమే పెళ్లి పేరుతో సెక్స్ నేరం అవుతుందే తప్ప, సుదీర్ఘకాలంగా కలిసుంటూ విభేదాలొచ్చి విడిపోయిన తర్వాత అత్యాచార ఆరోపణలు చెల్లుబాటు కాబోవని కోర్టు పేర్కొంది. చివరిగా..

 రేప్ కేసు నుంచి విముక్తి..

రేప్ కేసు నుంచి విముక్తి..

ఢిల్లీకి చెందిన ఓ యువతి.. తననో వ్యక్తి అత్యాచారం చేశాడంటూ కేసు పెట్టడం, దానిపై దాఖలైన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు గురువారం తుది తీర్పు చెప్పింది. నిందితునితో తనకు 2008లో శారీరక సంబంధం ఏర్పడిందని, ఆ వ్యక్తి తనను పెళ్ళి చేసుకుంటానని హామీ ఇచ్చాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. మూడు నెలల తర్వాత పెళ్లి చేసుకుందామన్న హామీ ఇవ్వడంతో అతనితో కలిసిఉన్నానని చెప్పింది. ఇప్పుడతను పెళ్లికి నో చెబుతుండటాన్ని బట్టి, కేవలం శారీరక సంబంధం కోసమే నాటకమాడినట్లుగా నిర్ధారణ అయిందని, సదరు నిందితుడు తనపై అత్యాచారం చేశాడని బాధిత మహిళ ఆరోపించారు. అయితే, పెళ్లికి ముందు సుదీర్ఘకాలంపాటు సెక్స్ సంబంధాలు కొనసాగిస్తున్నట్లయితే దానిని రేప్ గా పరిగణించలేమంటూ హైకోర్టు.. ఆ వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించింది.

జగన్‌కు బీజేపీ అనూహ్య సవాల్ -చర్చిల నుంచి వసూళ్లు -సోము వీర్రాజు సంచలనం -పవన్ ఫ్యాక్టర్జగన్‌కు బీజేపీ అనూహ్య సవాల్ -చర్చిల నుంచి వసూళ్లు -సోము వీర్రాజు సంచలనం -పవన్ ఫ్యాక్టర్

English summary
In a significant observation on gender-related crimes, the Delhi High Court, while hearing a rape case on Thursday, observed that sex with the promise of marriage does not conform to the definitions of rape if the woman continues to be physically intimate with the man over a significantly long period of time
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X