హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Girl: కిడ్నాప్, రేప్ చేసి ఆంటీకి అమ్మేశారు, 24 ఏళ్లు జైలు శిక్ష, సినీ నటుడు సేఫ్, హైదరాబాద్ లో !

|
Google Oneindia TeluguNews

కొచ్చి/ హైదరాబాద్: బాలికను కిడ్నాప్ చేసి తరువాత పదేపదే ఆమెపై అత్యాచారం చేసి వైశ్యవాటిక కేంద్రంలో ఆంటీకి అమ్మేసిన కిరాతకుడికి కోర్టు 24 ఏళ్లు జైలు శిక్ష విధించింది. 1996లో చేసిన పాపానికి నిందితుడికి జైలు శిక్షతో పాటు రూ. 1, 09, 000 అపరాద రుసుం విధించింది. నిందితుడిపై ఇప్పటికే 24 కేసులు నమోదైనాయి. ఇదే కేసులో సినీ నటుడికి కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో అతను సేఫ్ అయ్యాడు. బెయిల్ మీద బయటకు వచ్చి తప్పించుకుని హైదరాబాద్ లో తలదాచుకున్న కిరాతకుడు ఎట్టకేలకు చిక్కి జైలుపాలైనాడు.

Illegal affair: పక్కింటి ఆంటీతో ఎంజాయ్, బ్లాక్ మెయిల్, భర్తకు లవ్ స్టోరీ చెప్పింది, ప్లాన్ !Illegal affair: పక్కింటి ఆంటీతో ఎంజాయ్, బ్లాక్ మెయిల్, భర్తకు లవ్ స్టోరీ చెప్పింది, ప్లాన్ !

 1995లో ఉద్యోగం కోసం !

1995లో ఉద్యోగం కోసం !

కేరళలోని కోల్లాం జిల్లా కందక్కల్ ప్రాంతానికి చెందిన సురేష్ అలియాస్ షాజహాన్ (51) అనే కామాంధుడిని 1995లో కేరళలోని వితూర ప్రాంతానికి చెందిన మైనర్ అమ్మాయి ఉద్యోగం కావాలని కలిసింది. అమ్మాయి మీద కన్ను వేసిన సురేష్ ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఈ రోజు రేపు అంటూ కొంతకాలం గడిపేశాడు.

 కిడ్నాప్, రేప్ చేసి అమ్మేశాడు

కిడ్నాప్, రేప్ చేసి అమ్మేశాడు

1995లో బాలికను కిడ్నాప్ చేసిన సురేష్ ఆమెను నిర్బంధించి పలు ప్రాంతాల్లో పదేపదే అత్యాచారం చేశాడు. బాలిక మీద కోరిక పూర్తిగా తగ్గిపోయిన తరువాత ఆమె మీద ఏమాత్రం కనికరం చూపించకుండా వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్న అజితా బేగం అనే కిలాడీ ఆంటీకి అమ్మేసి చేతులు దులుపుకున్నాడు.

 వితూర రేప్ కేసు కలకలం

వితూర రేప్ కేసు కలకలం

అజిత బేగం అనేక మంది విటులను రప్పించి బాలిక మీద అత్యాచారం చేయించి ఆమె జీవితం నాశనం చేసింది. 1996 జూన్ లో వితూర బాలిక రేప్ కేసు విషయం బయటకు రావడంతో కేరళతో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. బాలిక కిడ్నాప్, రేప్, వేశ్యవాటిక కేంద్రంలో విక్రయించారని నమోదైన కేసులో సురేష్ ప్రధాన నిందితుడు.

 సినీ ప్రముఖులు, పొలిటీషియన్స్ ఫ్రెండ్స్

సినీ ప్రముఖులు, పొలిటీషియన్స్ ఫ్రెండ్స్

నిందితుడు సురేష్ కు అనేక మంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు పరిచయం ఉండటంతో ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే పోలీసులు చివరికి సురేష్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. సురేష్ మీద 24 కేసులు నమోదు కావడంతో 14 నెలలు జైల్లో ఉన్నాడు.

 హైదరాబాద్ లో మకాం

హైదరాబాద్ లో మకాం

14 నెలలు జైలు జీవితం గడిపిన సురేష్ తరువాత బెయిల్ మీద బయటకు వచ్చి మాయం అయిపోయాడు. అప్పటి నుంచి వితూర రేప్ కేసు విచారణకు హాజరుకాకుండా సుమారు 19 ఏళ్ల పాటు సురేష్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరిగాడు. హైదరాబాద్ లో మకాం వేసిన సురేష్ ఆచూకి తెలుసుకున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 2019 జూన్ లో అతన్ని పట్టుకున్నారు.

 24 ఏళ్లు జైలు శిక్ష... సినీ నటుడు సేఫ్

24 ఏళ్లు జైలు శిక్ష... సినీ నటుడు సేఫ్

వితూర రేప్ కేసులో ప్రధాన నిందితుడైన సురేష్ అలియాస్ షాజహాన్ నేరం చేశాడని రుజువు కావడంతో శుక్రవారం కేరళలోని కోట్టాయం అడిషినల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జాన్సన్ జాన్ నిందితుడికి 24 ఏళ్లు కఠిన జైలు శిక్ష, రూ. 1.09 లక్షల జరిమానా విధించారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ మలయాళం సినీ నటుడు జగతి శ్రీకుమార్ తదితరులు కేసు నుంచి విముక్తి పొంది సేఫ్ అయ్యారు. వితూర కిడ్నాప్, రేప్ కేసులో ప్రధాన నిందితుడు సురేష్ కు సరైన శిక్ష పడిందని బాధితురాలి కుటుంబ సభ్యులు అంటున్నారు.

English summary
Sex racket case: Vitura rape case Prime accused awarded 24 years of rigorous imprisonment in Kerala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X