'సెక్స్ సీడీలు పంపిణీ చేసిన మంత్రి సెక్రటరీ అరెస్టు'
ఢిల్లీ : ఆప్ మంత్రి సందీప్ కుమార్ సెక్స్ స్కాండల్ విషయం దేశమంతటా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. వీడియో సీడీలు కేజ్రీవాల్ కు అందిన వెంటనే ఆయనపై వేటు పడగా.. తొలుత తనను సమర్థించుకునే ప్రయత్నం చేశారు సందీప్ కుమార్. ఆపై.. బాధిత మహిళే నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. సందీప్ కుమార్ పోలీసుల ఎదుట లొంగిపోక తప్పలేదు.
రేషన్ కార్డు కోసం వెళ్లిన తనకు మత్తుమందు ఇచ్చి.. స్పృహ కోల్పోయాక సందీప్ కుమార్ తనపై అత్యాచారం చేశాడంటూ బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అటు పార్టీ నుంచి ఇటు ఢిల్లీ జనం నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సందీప్ కుమార్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
ఇదిలా ఉంటే.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సందీప్ కుమార్ పర్సనల్ సెక్రటరీని పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి గారి రాసలీలల సెక్స్ వీడియోలను పంపిణీ చేసిన అభియోగం మేరకు సోమవారం నాడు ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.