వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదుగురు పిల్లల తల్లిపై 17 మంది గ్యాంగ్ రేప్.. భర్తను నిర్బంధించి వివాహితపై అఘాయిత్యం...

|
Google Oneindia TeluguNews

జార్ఖండ్‌లో ఓ గ్యాంగ్ రేప్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఐదుగురు పిల్లల తల్లి అయిన ఓ వివాహితపై 17 మంది గ్యాంగ్ రేప్‌కి పాల్పడినట్లు బుధవారం(డిసెంబర్ 9) పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే విచారణలో బాధితురాలు మాట మార్చినట్లుగా పోలీసులు చెప్తున్నారు. మొదట 17 మంది అని చెప్పిన ఆ వివాహిత ఆ తర్వాత ఐదుగురు తనపై రేప్‌కి పాల్పడినట్లు చెప్పిందన్నారు. ఇటీవలి కాలంలో జార్ఖండ్‌లో అత్యాచార ఘటనలు పెరిగిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

సంత నుంచి తిరిగొస్తుండగా..

సంత నుంచి తిరిగొస్తుండగా..

పోలీసుల కథనం ప్రకారం.. జార్ఖండ్‌లోని దుంకా జిల్లాలో నివసించే ఆ మహిళ మంగళవారం(డిసెంబర్ 8) సాయంత్రం తన భర్తతో కలిసి వారాంతపు సంతకు వెళ్లింది. సంత నుంచి తిరిగి వస్తున్న క్రమంలో మార్గమధ్యలో 17 మంది గ్యాంగ్ వారిని అడ్డగించారు. ఆపై ఆమె భర్తను బంధించి అంతా కలిసి ఆమె సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మరుసటిరోజు బాధితురాలు ముఫాసిల్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

17 మందిపై ఎఫ్ఐఆర్...

17 మందిపై ఎఫ్ఐఆర్...

నిందితుల్లో ఒకరిని మాత్రమే గుర్తించగలనని బాధితురాలు పోలీసులతో చెప్పింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై స్థానిక ఎస్పీ మాట్లాడుతూ బాధితురాలి వాదనలో స్థిరత్వం లేదన్నారు. మొదట 17 మంది తనపై రేప్ చేశారని చెప్పిన ఆమె... విచారణలో మాత్రం ఐదుగురు అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పిందన్నారు. అయితే ఎఫ్ఐఆర్ మాత్రం 17 మందిపై నమోదు చేసినట్లు తెలిపారు. ఆమె మెడికల్ రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉందన్నారు.

Recommended Video

2nd Western Country After UK Canada Approves Pfizer Covid-19 Vaccine
జార్ఖండ్‌లో పెరిగిపోయిన అత్యాచారాలు...

జార్ఖండ్‌లో పెరిగిపోయిన అత్యాచారాలు...

ఈ ఏడాది జార్ఖండ్‌లో మహిళలపై అత్యాచార ఘటనలు పెరిగిపోయాయి. ఈ నెల 2న ఖుంతీ జిల్లాలోని కర్రా పోలీస్ స్టేషన్ పరిధిలో 15 ఏళ్ల మైనర్ బాలికపై గుర్తు తెలియని వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు.స్నేహితులతో కలిసి ఓ ఉత్సవానికి వెళ్లి తిరిగొస్తున్న క్రమంలో ఆమెపై ఈ అఘాయిత్యం జరిగింది. జార్ఖండ్ క్రైమ్ గణాంకాల ప్రకారం ఈ ఏడాది జులై వరకు రాష్ట్రంలో 1033 అత్యాచార కేసులు నమోదయ్యాయి. 2019లో మొత్తం 1,416 అత్యాచార కేసులు నమోదవగా... ఈ ఏడాది 7 నెలల కాలంలోనే వెయ్యికి పైగా అత్యాచార కేసులు నమోదవడం గమనార్హం. ప్రభుత్వ వైఫల్యం వల్లే మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ప్రతిపక్ష బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది.

English summary
In a horrific incident of sexual assault reported from Dumka district of Jharkhand, a 35-year-old woman was allegedly gang-raped by 17 men as her husband was held hostage Tuesday night. One of the suspects was detained on Wednesday, following a complaint by the woman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X