చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హిందూ మహాసభ శ్రీపై లైంగిక వేధింపుల కేసు, మహిళకు పదవులు ఇచ్చి ఢిల్లీలో బెదిరించి, చంపేస్తారని !

|
Google Oneindia TeluguNews

చెన్నై: సంస్థలో చురుకుగా పని చేసిన మాజీ మహిళా నిర్వహకురాలిని (ప్రధాన కార్యదర్శి) బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆల్ ఇండియా హిందూ మహాసభ అధ్యక్షుడు శ్రీకంఠన్ పై చెన్నై సిటీ పోలీసులు ఐదు విభాగాల్లో కేసులు నమోదు చేశారు. మహిళా జాతీయ నాయకురాలికి పదవులు ఇచ్చి ఆమెను ఢిల్లీలో బెదిరించి తరువాత లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కేసు నమోదు కావడంతో మహాసభ సంఘం నాయకుడు శ్రీకంఠన్ పరారైనాడని పోలీసులు తెలిపారు.

నీ భార్య నాకు, నా భార్య నీకు, రాత్రి ఎంజాయ్ చేద్దాం రా, వ్యాపారవేత్తల కొత్త డీల్, బ్లాక్ మెయిల్!నీ భార్య నాకు, నా భార్య నీకు, రాత్రి ఎంజాయ్ చేద్దాం రా, వ్యాపారవేత్తల కొత్త డీల్, బ్లాక్ మెయిల్!

చెన్నై సిటి లేడీ లీడర్

చెన్నై సిటి లేడీ లీడర్

చెన్నైలోని వలసరవాక్కం శ్రీదేవి కుప్పానికి చెందిన రంజని (40) కీలప్పాక్కం మహిళా పోలీస్ స్టేషన్ లో ఆల్ ఇండియా మహాసభ సంఘం అధ్యక్షుడు శ్రీకంఠన్ మీద ఫిర్యాదు చేశారు. ఆల్ ఇండియా మహాసభ సంఘంలో తాను 2016లో చేరానని రంజని చెన్నై సిటీ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

నన్ను నమ్ము.....నిన్ను ఎక్కడికో తీసుకుపోతా !

నన్ను నమ్ము.....నిన్ను ఎక్కడికో తీసుకుపోతా !

ఆల్ ఇండియా మహాసభ సంఘంలో తాను ఎంతో చురుకుగా పని చేశానని, ఆ సమయంలో సంఘం నాయకులు, కార్యకర్తలు తన ప్రతిభను గుర్తించారని రంజని అంటున్నారు. తన ప్రతిభ గుర్తించిన ఆల్ ఇండియా మహాసభ సంఘం పధాదికారులు
2019లో తనను జాతీయ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించారని రంజని గుర్తు చేశారు. ఆ సమయంలో నన్ను నమ్మితే నిన్ను ఎక్కడికో తీసుకుపోతానని శ్రీకంఠన్ తనకు హామీ ఇచ్చాడని రంజని చెబుతోంది.

బాష సమస్యతో ఢిల్లీలో !

బాష సమస్యతో ఢిల్లీలో !

ఆల్ ఇండియా మహాసభ సంఘం అధ్యక్షుడు శ్రీకంఠన్ కు బాష సమస్య ఉండటంతో తాను ఆయన వెంట అనేక సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చానని రంజని అంటున్నారు. ఆ సమయంలో తనతో శ్రీకంఠన్ ఎక్కువ చనువు పెంచుకోవడానికి ప్రయత్నాలు చేశారని, అయితే తాను ఆయన్ను దూరం పెట్టడానికి ప్రయత్నించానని అన్నారు.

బెదిరించి లైంగిక దాడి !

బెదిరించి లైంగిక దాడి !

జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి రావడంతో తాను ఎంతో సంతోషంగా ఉన్నానని రంజని అన్నారు. అయితే కాలక్రమేనా తనకు మంచి పదవి ఇచ్చానని, తన లైంగిక కోరికలు తీర్చాలని మా సంఘం అధ్యక్షుడు శ్రీకంఠన్ వేధింపులకు గురి చేశాడని రంజనీ ఆరోపించారు.

చంపేస్తారని భయం !

చంపేస్తారని భయం !

లైంగిక వేధింపులకు గురైన సమయంలో ఎదురుతిరిగిన తనను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడని రంజని ఆరోపిస్తోందని, తనకు ఆల్ ఇండియా మహాసభ సంఘం అధ్యక్షుడు శ్రీకంఠన్ నుంచి రక్షణ కల్పించాలని, తనను చంపేస్తారని భయంగా ఉందని, మీరే కాపాడాలని రంజని చెన్నై సిటీ పోలీసు కమిషనర్ ఆశ్రయించింది. కేసు నమోదు చేసి విచారణ చేసిన పోలీసులు కొన్ని సాక్షాల ఆధారంగా ఐదు విభాగాల్లో శ్రీకంఠన్ మీద కేసు నమోదు చేశారు. కేసు నమోదు కావడంతో శ్రీకంఠన్ పరారైనాడని, ఆయన కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Sexual torture: Hindu Maha Saba general secretary complaint against kodambakkam Sri in Chennai Police Commissioner office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X