• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చైనా ఆక్రమణ.. తప్పుచేశామన్న అమిత్ షా.. ప్రతిపక్షాలపై నిప్పులు.. ఆ 60 కి.మీ భారత్ వదులుకుందా?

|

భారత్-చైనా మధ్య వాస్తవి నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వద్ద నెలకొన్న ఉద్రిక్తత, దేశంలో కరోనా విలయం, రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. తదితర అంశాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైరస్ కట్టడిలో, వలస కూలీల విషయంలో కేంద్రం తప్పు చేసిందని అంగీకరించారు. అదేసమయంలో సరిహద్దు వ్యవహారం చిన్నపిల్లల ఆటకాదంటూ చైనాపై రుసరుసలాడారు. అదే సమయంలో విపక్షాలు సైతం 'చైనా సరిహద్దు' అంశంపై షాను ఏకిపారేశాయి..

భారత్ - చైనా యుద్ధంపై ఫుల్ క్లారిటీ.. చర్చలపై తొలి అధికారిక ప్రకటన.. జరగబోయేది ఇదేనంటూ..

వర్చువల్ షా..

వర్చువల్ షా..

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10వేల కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 2.7లక్షలకు, మరణాలు 7500కు పెరిగాయి. సోమవారం నుంచే అన్ లాక్ 1.0 అమల్లోకి వచ్చినా.. వైరస్ వ్యాప్తి తగ్గకపోవడంతో కేంద్ర మంత్రి అమిత్ షా వర్చువల్ వీడియోల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ శ్రేణుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. పనిలో పనిగా వెస్ట్ బెంగాల్, బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్ని సైతం పూరించారాయన. ఇప్పటికే బెంగాల్, ఒడిశాలో కమలనాథులకు నిర్దేశం చేసిన ఆయన.. మంగళవారం వెస్ట్ బెంగాల్ కార్యకర్తలతో మాట్లాడారు.

3 సార్లు సీఎం..అడుక్కునే స్థితిలో కుటుంబం.. భోలా శాస్త్రి ఫ్యామిలీ దీనగాథ.. లాక్ డౌన్ లో తిండి లేక..

అవును.. తప్పులు చేశాం..

అవును.. తప్పులు చేశాం..

‘‘దేశంలో కరోనా వైరస్ సంక్షోభాన్ని డీల్ చేయడంలో కేంద్ర ప్రభుత్వం తప్పులు చేసి ఉండొచ్చు. వలస కార్మికుల విషయంలో విషయంలోనూ చాలా పొరపాట్లు జరిగాయి. అంతమాత్రన మా నిబద్ధతను ఎవరూ శంకించలేరు. లాక్ డౌన్ తొలినాళ్లలోనే పేదల రూ.1,70, 000 కోట్ల ప్యాకేజీ, ఆ తర్వాత రూ.20 లక్షల కోట్ల ప్రత్యేక సాయం ప్రకటించాం. సాధ్యమైనంత మేరలో మేం ప్రజల్లో ధైర్యం నంపుతుంటే.. ప్రతిపక్ష పార్టీలు మాత్రం అన్నింటినీ వక్ర దృష్టితో చూస్తున్నాయి. మా వైపు నుంచి జరిగిన చిన్నచిన్న తప్పుల్ని పెద్దవిగా చేసి చూపిస్తూ.. ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకాయనైతే(రాహుల్ గాంధీ) కరోనాపై నిపుణులతో చర్చ పేరుతో ఇంగ్లీషులో ఏవేవో మాట్లాడుతున్నాడు.. అందులో ప్రజలకు పనికొచ్చే అంశం ఒక్కటీ ఉండదు''అని అమిత్ షా చెప్పుకొచ్చారు. ఒడిశా శ్రేణులతో కాన్ఫరెన్స్ సందర్భంగా ఆయనీ కామెంట్లు చేశారు.

కరోనా ఎక్స్ ప్రెస్ కలకలం..

కరోనా ఎక్స్ ప్రెస్ కలకలం..

వచ్చే ఏడాది వెస్ట్ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజేపీ మాజీ చీఫ్ అమిత్ షా ముందస్తుగానే ప్రచారం ప్రారంభించారు. మంగళవారం బెంగాల్ కార్యకర్తలతో మాట్లాడిన ఆయన.. సీఎం మమతా బెనర్జీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శ్రామిక్ రైళ్లలో సౌకర్యాల లేమిని, అందులో ప్రయాణిస్తూ నరకం చూసిన కూలీలను ప్రస్తావిస్తూ.. ‘‘అవి శ్రామిక్ రైళ్లా.. కరోనా ఎక్స్ ప్రెస్ రైళ్లా?'అని మమత వ్యాఖ్యానించడాన్ని షా తప్పు పట్టారు. ‘‘దీదీ ‘కరోనా ఎక్స్ ప్రెస్ వ్యాఖ్యలే ఆమె పాలిట శాపంగా మారబోతున్నాయి. అంతేకాదు, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను వ్యతిరేకించిన మమత.. బెంగాల్ లోనే శరణార్థిగా మారబోతున్నారు''అంటూ షా హెచ్చరించారు.

చైనా ఆక్రమణపై సవాళ్లు..

చైనా ఆక్రమణపై సవాళ్లు..

రాష్ట్రాలవారీగా వర్చువల్ సమావేశాలు నిర్వహిస్తోన్న అమిత్ షాకు అక్కడి ప్రతిపక్ష పార్టీల నుంచి గట్టి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇప్పటికే కరోనా విషయంలో ఘోరంగా ఫెయిలైన మోదీ సర్కారు.. ఇప్పుడు లదాక్ సరిహద్దును కూడా పోగొట్టుకునే పరిస్థితి నెలకొందని, ఇంత ముఖ్యమైన విషయాలను గాలికొదిలేసి.. అమిత్ షా రాజకీయాలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని తృణమూల్ కాంగ్రెస్ విమర్శించింది. ‘‘అమిత్ షాజీ.. మీ బోరింగ్ ప్రసంగాన్ని బెంగాలీలెవరూ పట్టించుకోలేదు, దయచేసి లదాక్ సరిహద్దులో ఏం జరుగుతుందో క్లారిటీ ఇవ్వగలరా?''అంటూ మమత మేనల్లుడు అభిజిత్ బెనర్జీ సవాలు విసిరారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం ఇదే అంశంలో కేంద్రంపై అనుమానాలు వ్యక్తం చేశారు.

60 కిలోమీటర్లు అంతేనా?

60 కిలోమీటర్లు అంతేనా?

భారత్-చైనా సరిహద్దులోని తూర్పు లదాక్ ప్రాంతంలో గడిచిన 35 రోజులుగా ఉద్రిక్తతలు నెలకొనడం, రెండు దేశాలూ సైన్యాలు, ఆయుధ సామాగ్రిని భారీగా తరలించిన నేపథ్యంలో లెఫ్టినెంట్ జనరల్స్ స్థాయిలో చర్చలు జరగడం, యుద్ధానికి వెళ్లకుండా శాంతి యుతంగానే సమస్యను పరిష్కరించుకోవాలని ఆ చర్చల్లో రెండు దేశాలు నిర్ణయించుకోవడం తెలిసిందే. అయితే, దీనిపై ఆది, సోమవారాల్లో జాతీయ మీడియాలో విచిత్రమైన వార్తలు వచ్చాయి. మే నెల రెండో వారం నాటికే చైనా ఆక్రమణలోకి వెళ్లిపోయిన 60 కిలోమీటర్ల భూభాగాన్ని వదులుకునేందుకు భారత్ సిద్ధపడిందంటూ ప్రఖ్యాత ‘రెడిఫ్' వార్త సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిపై మోదీ సర్కారు ఎంతకూ స్పందించకపోవడాన్ని ప్రతిపక్ష నేతలు నిలదీస్తున్నారు.

జోలికొస్తే అంతే..

జోలికొస్తే అంతే..

భారత సరిహద్దులో కవ్వింపు చర్యలకు దిగే పొరుగుదేశాలకు మోదీ సర్కారు ఏవిధంగా బుద్ధి చెబుతుందో ప్రపంచ దేశాలకు ఇప్పటికే అర్థమైందని హోం మంత్రి అమిత్ షా అన్నారు. సరిహద్దు వ్యవహారాలు చిన్నపిల్లల ఆటలు కాబోవని, ఈ విషయంలో మోదీ సర్కారు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని, పాకిస్తాన్ గడ్డపైకి దూసుకెళ్లిమరీ ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించడమే అందుకు ఉదాహరణ అని షా వివరించారు. వర్చువల్ మీటింగ్స్ లో పలు మార్లు పాక్ పై నిప్పులు చెరిగిన ఆయన.. చైనా పేరును మాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం.

English summary
Mamata Didi, Corona Express Remark Will Be Your Exit Route says union home minister Amit Shah in virtual election rally on tuesday. he also admitted that On Corona, center may have fallen short. and asked what did Opposition do.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more