• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

షారుక్ నా జీవితాన్ని నాశనం చేశాడు..: ఆమె లవ్ స్టోరీ ఇప్పుడో సంచలనం

|
  దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే' లో షారుఖ్ చేసిన మాయ

  న్యూఢిల్లీ: వెండితెరపై 2.30గం. సినిమా చూసొచ్చాక.. అది దమ్మున్న సినిమా గనుక అయితే.. ఆ ప్రభావం కచ్చితంగా కొద్దిసేపు వెంటాడుతుంది. కొన్నిసార్లు కొద్దిరోజులు కూడా వెంటాడవచ్చు. కానీ ఓ యువతిని మాత్రం జీవితాంతం ఆ ఫీలింగ్ వెంటాడుతూ వస్తోందట. సిల్వర్ స్క్రీన్ పై ఓ హీరో చేసిన మాయకు.. ఫుల్లుగా ఫిదా అయిపోయిన ఆమె.. చేసుకుంటే అలాంటి వాన్నే చేసుకుంటానని ఫిక్స్ అయిపోయిందట. అయిపోవడమే కాదు.. అలాంటి క్షణాల కోసం ఎదురుచూసి.. అనుకున్నట్టు జరగకపోవడంతో.. తానే సదరు 'హీరో' స్టైల్లోకి మారిపోయిందట.. ఇంతకీ ఏంటీ వ్యవహారం అనుకుంటున్నారా...

  ఇదీ అసలు కథ

  ఇదీ అసలు కథ

  'దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే'.. బాలీవుడ్ ఎవర్ గ్రీన్ సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఇందులో కాజోల్-షారుఖ్ మధ్య కెమిస్ట్రీని ప్రేక్షకులు అంత ఈజీగా మరిచిపోలేరు. సినిమా చూసి.. మనకూ అలాంటి లవ్ స్టోరీ ఉంటే బాగుండు అని ఫీలైనవాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఆ లిస్టులో పశ్చిమ్‌ బంగాకు చెందిన ఓ యువతి ముందు వరసలో ఉంటారు. ఆ సినిమా చూశాక షారుక్ ఆమె డ్రీమ్ హీరో అయిపోయాడు. దీంతొ చేసుకుంటే అలాంటివాన్నే పెళ్లి చేసుకోవాలని ఆమె ఫిక్స్ అయిపోయింది.

  తానే షారుక్ అవాలనుకుంది..:

  తానే షారుక్ అవాలనుకుంది..:

  అచ్చు 'దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే' సినిమాలో లాగా.. తనకూ ఓ అబ్బాయి అలాగే ప్రపోజ్ చేయాలని ఆమె నిత్యం కలలు కనేది. ఇదే క్రమంలో ఓ అబ్బాయితో పరిచయం ఏర్పడింది. కానీ, అతను షారుక్‌ ఖాన్‌ స్టైల్లో ప్రపోజ్‌ చేయలేదు. దీంతో కొంతకాలం వేచి చూసింది. అయినా లాభం లేకపోయేసరికి.. ఇక తానే షారుక్ ఖాన్ కావాలని నిర్ణయించుకుంది.

  షారుక్.. నా జీవితాన్ని నాశనం చేశాడు..

  షారుక్.. నా జీవితాన్ని నాశనం చేశాడు..

  'షారుక్‌ ఖాన్‌ నా జీవితాన్ని నాశనం చేశాడు. చిన్నప్పటి నుంచి నాకు కాబోయే వాడు పర్‌ఫెక్ట్‌గా షారుక్ లాగే ఉండాలని కలలు గన్నాను. అంటే.. సినిమాలో లాగే అతను నాకు ప్రపోజ్‌ చేయాలి.. ఆ సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో వయోలిన్‌ సంగీతం వినిపిస్తూ.. గాలికి నా కురులు నెమ్మదిగా కదులుతూ.. అతను స్టైల్‌గా నడుచుకుంటూ వచ్చి మోకాలిపై కూర్చుని నా వేలుకి ఉంగరం తొడగాలి.. ఇలా కలలు కనేదాన్ని' అని ఆమె చెప్పుకొచ్చారు.

  ఎట్టకేలకు ఆరోజు..:

  ఎట్టకేలకు ఆరోజు..:

  నా కలలు నావే కానీ.. అతను మాత్రం నేను కోరుకున్నట్టు ప్రపోజ్ చేయలేదు. ఆ క్షణం కోసం ఎదురుచూస్తూ కాలక్షేపం చేయడం వల్ల.. అతనితో పెళ్లికి ఇంట్లో వాళ్లను ఒప్పించడం కూడా కష్టంగా మారింది. అయితే ఎట్టకేలకు మా పెళ్లి మాత్రం ఘనంగా జరిగింది. కానీ నా కోరిక మాత్రం అలాగే మిగిలిపోయి ఉండటంతో.. నా భర్త పుట్టినరోజు ఒక సర్‌ప్రైజ్‌ ప్లాన్ చేశాను.

   ఏంటా సర్‌ప్రైజ్‌

  ఏంటా సర్‌ప్రైజ్‌

  మా ఇద్దరికి పరిచయం ఏర్పడిన తొలినాళ్లలో.. మేం మొదటిసారి కలుసుకున్న రెస్టారెంట్‌కి తనని రమ్మని చెప్పాను. అతను రెస్టారెంట్‌లోకి అడుగుపెట్టకముందే.. అప్పటికే అంతా సిద్దం చేసుకున్నాను. అతను రావడమే ఆలస్యం.. ముందుగా చేసిన వయోలిన్ మ్యూజిక్, డీజే స్టార్ట్ అయ్యాయి. ఆపై అతని ముందు నేను మోకాళ్లపై కూర్చొని.. ఇకనుంచి నా జీవితంలోని సంతోషాల్ని, నవ్వుల్ని, బాధల్ని.. ఇలా ప్రతీ క్షణాన్ని నీతో పంచుకోవాలనుకుంటున్నాను.. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?.. అంటూ దిల్ వాలే సినిమాలో లాగా షారుక్ స్టైల్లో ప్రపోజ్ చేశాను.

  అతనేమన్నాడో తెలుసా..

  అతనేమన్నాడో తెలుసా..

  నా సర్‌ప్రైజ్‌ ప్రపోజల్ ఆయనకు కూడా నచ్చింది. 'మనకు పుట్టబోయే పిల్లలు కూడా ఇంత ఫిల్మీగా ఉండరనుకుంటా..' అని ఆటపట్టించాడు. అయినా ఎప్పుడూ అబ్బాయిలే ఎందుకు ప్రపోజ్‌ చేయాలి? ఇది నవశకం. ఎవరైనా అబ్బాయిని ప్రేమిస్తే.. మీరే కొత్తగా అతనికి ప్రపోజ్ చేయండి' అని ఆమె చెప్పుకొచ్చారు. హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే తమ ఇన్ స్టాగ్రామ్ లో దీన్ని షేర్ చేయడంతో ఇప్పుడిదో హాట్ టాపిక్ మారింది. ఆ లేడీ షారుక్ ఖార్ లవ్ స్టోరీపై చాలామంది నెటిజెన్స్ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.

  English summary
  There is no denying that the Badshah of Bollywood - Shah Rukh Khan - is the ultimate king of romance and his films have influenced our love life greatly. But a Mumbai based girl, whose love story has featured on the 'Humans of Bombay' page, holds the superstar responsible for ruining her life. Wondering how and why?
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X