వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముస్లింలందరూ ఆప్‌‌కే ఓటేయాలి: బుఖారీ, మద్దతుని తిరస్కరించిన ఆప్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఈసారి మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేయాలంటూ ఢిల్లీలోని జామా మసీదు ఇమామ్ 'సయ్యద్ అహ్మాద్ బుఖారీ' ముస్లింలకు శుక్రవారం పిలుపునిచ్చారు. మతతత్వ పార్టీ బీజేపీని ఓడించి, సెక్యులరిజాన్ని కాపాడాలంటే.... ప్రస్తుత పరిస్ధితుల్లో అరవింద్ కేజ్రీవాల్‌ పార్టీ ఆప్‌కు ఓటేయాలని సూచించారు.

భారతదేశంలోనే అతి పెద్ద మసీదుల్లో ఒకటైన జామా మసీదు ఇమామ్‌గా కొనసాగుతున్న బుఖారీ ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేయకుంటే పెద్ద తప్పు చేసినవాళ్లమవుతామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్ధితిలో లేదని, అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా వృథా అవుతందని బుఖారీ స్పష్టం చేశారు.

 ఢిల్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం

ఢిల్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం


ఢిల్లీలీ మొత్తం 70 శాసనసభ స్ధానాలున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 1,33,09,089 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో మగవారు 73,89,089 ఉండగా, ఆడవారు 59,19,127 ఉన్నారు.

ఢిల్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం

ఢిల్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం


మొత్తం 12,177 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.

ఢిల్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం

ఢిల్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం


వీటిల్లో 714 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామని అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల్లో మొత్తం 95 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారు.

 ఢిల్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం

ఢిల్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం


ఢిల్లీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 55వేల మంది పోలీసులు రంగంలోకి దిగారు. 3900 సీసీ కెమెరాల సహాయంతో ఎన్నికలను పర్యవేక్షించనున్నట్లు ఢిల్లీ కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు.

ఇది ఇలా ఉంటే సయ్యద్ అహ్మాద్ బుఖారీ మద్దతుని ఆమ్ ఆద్మీ పార్టీ తిరస్కరించింది. ఫిబ్రవరి 7న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్యనే పొటా పోటీ ఉంది.

ఢిల్లీలీ మొత్తం 70 శాసనసభ స్ధానాలున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 1,33,09,089 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో మగవారు 73,89,089 ఉండగా, ఆడవారు 59,19,127 ఉన్నారు.

మొత్తం 12,177 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. వీటిల్లో 714 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామని అధికారులు తెలిపారు.

ఈ ఎన్నికల్లో మొత్తం 95 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారు. ఢిల్లీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 55వేల మంది పోలీసులు రంగంలోకి దిగారు. 3900 సీసీ కెమెరాల సహాయంతో ఎన్నికలను పర్యవేక్షించనున్నట్లు ఢిల్లీ కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు.

English summary
Jama Masjid's Shahi Imam Syed Ahmed Bukhari on Friday appealed to Muslims to vote for the Aam Aadmi Party (AAP) in Delhi Assembly Elections, which are scheduled to be held on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X