వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శైలజ హత్య కేసులో ఆశ్చర్యకర విషయాలు: గూగుల్‌లో వెతికిన ఆర్మీ మేజర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సహచర ఆర్మీ మేజర్ సతీమణి శైలజ ద్వివేదిని హత్య చేసిన నిందితుడు నిఖిల్ హండా.. ఆమెను హత్య చేసిన తర్వాత ఆధారాలు నాశనం చేసేందుకు గూగుల్ సెర్చింజన్ ఉపయోగించాడు. నిందితుడిని పోలీసులు నాలుగు రోజుల పాటు తమ కస్టడీకి తీసుకొని విచారించారు. అనంతరం శుక్రవారం అతనిని న్యాయస్థానం 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీకి తరలించింది.

Recommended Video

పెళ్లి చేసుకోలేదని మరో మేజర్ భార్య హత్య, వివాహేతర సంబంధం!

చదవండి: శైలజ-మేజర్ మధ్య ఆర్నెళ్లలో 3500 కాల్స్, అక్కడ్నుంచి వచ్చేసి టచ్‌లో: వీడియో కాల్‌లో పట్టేసిన భర్త

పోలీసుల విచారణలో ఎన్నో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. శైలజను చంపేసిన తర్వాత దానిని ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిఖిల్ హండా గూగుల్ సకారం తీసుకున్నాడు. విచారణలో భాగంగా నిఖిల్ ఫోన్ కాల్ డాటాను, ఇంటర్నెట్ హిస్టరీని పోలీసులు పరిశీలించారు. విచారణలో అతను పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదని తెలుస్తోంది.

చదవండి: ఫేక్ ప్రొఫైల్‌తో వల: శైలజను చంపిన మేజర్‌కు మామూలోడు కాదు, మరో ముగ్గురు మహిళలతోను!

పట్టుబడతానని గ్రహించి ఆన్‌లైన్‌లో సూచనలతో ఆధారాలు నాశనం

పట్టుబడతానని గ్రహించి ఆన్‌లైన్‌లో సూచనలతో ఆధారాలు నాశనం

శైలజను చంపేందుకు ఉపయోగించిన కత్తిని పోలీసులు గురువారమే స్వాధీనం చేసుకున్నారు. మీరట్-ముజఫర్ నగర్ హైవే దారిలో దీనిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, శైలజను హత్య చేసిన తర్వాత ఆధారాలు ఎలా నాశనం చేయాలి, హత్యను ప్రమాదంగా ఎలా మలచాలో గూగుల్‌లో హండా వెతికాడని పోలీసులు తెలిపారు. హండా మొదట హత్యను ప్రమాదంగా మార్చాలని భావించాడని, అయితే ఎలాగైనా తాను పట్టుబడతానని గ్రహించిన అతడు ఆన్‌లైన్‌లోని సూచనలు చదివి ఆధారాలు నాశనం చేశాడన్నారు.

రోడ్డుపై పడేసి వెళ్లిపోయాడు

రోడ్డుపై పడేసి వెళ్లిపోయాడు

శైలజ, హండా కారులోకి ఎక్కిన తర్వాత వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. అప్పుడు హండా తొలుత కారులో శైలజను ఊపిరాడకుండా గొంతునులిమి చంపేశాడు. ఆ తర్వాత కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు గుర్తించారు. హండా ఆమె శవాన్ని కారులో నుంచి రోడ్డుపై పడేసి వెళ్లిపోయాడని, ఆమెపై నుంచి వాహనం పోయినట్లు చిత్రీకరించాలని ప్రయత్నించాడు. ఇందులో భాగంగా శైలజ మృతదేహాన్ని రోడ్డుపై పడేసి ఆమె మీద నుంచి కారును పోనిచ్చాడు.

పోలీసులకు అనుమానం వస్తుందని

పోలీసులకు అనుమానం వస్తుందని

అయితే ఆ తర్వాత పోలీసులకు అనుమానం వస్తుందని తాను ధరించిన ఎరుపు రంగు టీ షర్ట్‌, ప్యాంట్ తగలబెట్టే ప్రయత్నం చేశాడు. శైలజను చంపేందుకు ఉపయోగించిన కత్తిని కూడా లేకుండా చేసే ప్రయత్నం చేశాడు. అయితే హరిద్వార్ నుంచి మీరట్ వెళ్లే దారిలో ఈ పనులు చేయాలని భావించాడు.

టోల్ ప్లాజా వద్ద కారులో వెళ్తున్న దృశ్యాలు

టోల్ ప్లాజా వద్ద కారులో వెళ్తున్న దృశ్యాలు

ఓ టోల్‌ప్లాజా వద్ద హండా కారు వెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ ఫుటేజీ ఆధారంగా అతడిని అరెస్ట్‌ చేశారు. సాక్ష్యాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. కాగా, గత శనివారం ఢిల్లీలోని కంటోన్మెంట్‌ ప్రాంతంలో రోడ్డుపై శైలజ ద్వివేది మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోసి రోడ్డుపై పడేసి ఆమెపై నుంచి వాహనం నడిపించాడు. తనను పెళ్లి చేసుకొమ్మని శైలజను అడగగా ఆమె నిరాకరించినందుకు హండా హత్య చేశాడు. కాగా, నిందితుడు హండా 27 నిమిషాల్లో హత్యకు సంబంధించిన ఆధారాలను అన్నింటిని మాయం చేసాడు.

English summary
The Delhi Police on recovered the knife, allegedly used by Major Nikhil Handa to slit the throat of a fellow army officer's wife, from a spot near the Meerut-Muzaffarnagar highway.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X