వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేతలు కాదు కామాంధులు: ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అత్యాచారం చేసిన బీజేపీ నేత

|
Google Oneindia TeluguNews

గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం ఇరుకున పడింది. ఇందుకు కారణం ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జయంతి భనుషాలీపై వచ్చిన అత్యాచారం ఆరోపణలే. ఇక విషయంలోకి వెళితే గుజరాత్‌లో ఏ ఛానెల్ చూసినా... ఏ సోషల్ మీడియాలో చూసినా ఇద్దరు ప్రజాప్రతినిధులు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న అత్యాచారాల ఆరోపణలే దర్శనమిస్తున్నాయి. జయంతి బనుశాళి తనను అత్యాచారం చేశాడంటూ ఓ 21 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక దీనిపై మరో ఇద్దరు ప్రజాప్రతినిధులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు.

విషయం బయటకు రావడంతో రాష్ట్ర బీజేపీ దిద్దుబాటు చర్యలకు దిగింది. గుజరాత్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న భనుషాలి పదవికి రాజీనామా చేశారని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే భనుశాలి బాధితురాలు మీడియా ముందుకొచ్చింది. తను ఫిర్యాదు చేసినప్పటికి కూడా పోలీసులు ఇప్పటి వరకు భనుశాలిని అరెస్టు చేయలేదని తెలిపింది. తనకు ఓ ప్రైవేట్ కాలేజీలో అడ్మిషన్ ఆ తర్వాత ఉద్యోగం కూడా ఇప్పిస్తానని భనుశాలి నమ్మబలికినట్లు యువతి తెలిపింది. మాయమాటలు చెప్పి తనను లొంగదీసుకున్నట్లు యువతి ఆరోపించింది.

Shame on our netas:21 year Woman alleges that she was raped by the BJP leader

యువతి మీడియా ముందుకు వచ్చి భనుశాలిపై బాహాటంగా చెప్పడంతో అలర్ట్ అయిన సూరత్ పోలీసులు ఫిర్యాదు నమోదు చేసి పోలీసుల ఎదుట లొంగిపోవాలని భనుశాలికి నోటీసులు పంపారు. ఇదిలా ఉంటే ఫిర్యాదు చేసిన యువతి మాజీ భర్త మరో ట్విస్ట్ ఇచ్చారు. ఈ యువతి డబ్బుకోసం గతంలో కూడా ఇలానే చేసిందని చెప్పాడు. యువతి అనేక మంది పురుషులతో లైంగిక సంబంధాలు పెట్టుకుని వాటిని వీడియో తీసి డబ్బుకోసం బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటుందని మాజీ భర్త చెప్పాడు. పెళ్లయిన రెండు నెలలకే ఆమెకు విడాకులు ఇచ్చినట్లు చెప్పిన భర్త ఆమె చాలా మంది మగవారితో అక్రమసంబంధాలు నెరిపిందని ఆరోపించారు. ఈ ఫిర్యాదును కూడా సీరియస్‌గా తీసుకోవాల్సిన పనిలేదని చెప్పాడు.

బీజేపీలో చేరిన మాజీ కాంగ్రెస్ నేత చబ్బిల్ పటేల్ యువతికి విడాకులు ఇవ్వాల్సిందిగా పలుమార్లు తనను బెదిరించారని గుర్తు చేశాడు. ఇదిలా ఉంటే భనుశాలి, చబ్బిల్ పటేల్ కచ్ ప్రాంతంలో బలమైన నేతలుగా ఉన్నారు. కచ్ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు ఇద్దరూ విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. తన పేరును అనవసరంగా తీసుకొస్తున్నారని.. ఈ ఘటనతో తనకు సంబంధం లేదని చబ్బిల్ పటేల్ స్పష్టం చేశారు.

భనుశాలి గురించి కచ్ ప్రాంతంలో అందరికీ తెలిసిందేనని మరో సీనియర్ నేత చెప్పారు. కచ్ ప్రాంతంలో భూకబ్జాలకు పాల్పడుతూ బడా బాబులకు తన ఫార్మ్ హౌజ్‌లో అమ్మాయిలను సప్లై చేస్తుంటాడని ఆ సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఇక్కడితో ఆగదని భనుశాలి కామానికి బలైన మరెందరో మహిళలు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తారని ఆనేత వివరించారు.

గుజరాత్‌లో బీజేపీ నేతలపై అత్యాచార ఆరోపణలు రావడం ఇది తొలిసారి కాదు... గతేడాది ముంబైకి చెందిన యువతి తనపై అత్యాచారం చేశారని 10 మంది బీజేపీ నేతలపై కచ్‌లోని నాలియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో బీజేపీ నేతలను మరో స్థానిక మున్సిపాలిటి మెంబరును అరెస్టు చేశారు.

English summary
A rape case by a 21 year old woman from Surat against former BJP lawmaker Jayanti Bhanushali is escalating as a major sex scandal involving two former lawmakers trading charges and allegations against each other.The whole episode and it’s 24/7 coverage on local media and social media platforms have become a major cause of embarrassment for the ruling party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X