వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలీవుడ్ డ్రగ్స్: బీజేపీ ఎంపీ కామెంట్లపై జయ బచ్చన్ ఆగ్రహాం, ఇండస్ట్రీని తక్కువ చేసేలా..

|
Google Oneindia TeluguNews

బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంపై రాజ్యసభలో దుమారం చెలరేగింది. నిన్న లోక్‌సభలో బీజేపీ ఎంపీ, భోజ్‌పురి నటుడు రవికిషన్ చేసిన కామెంట్లను సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయ బచ్చన్ తప్పుపట్టారు. ఆయన పేరు ప్రస్తావించకుండా కామెంట్ చేశారు. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని తక్కువచేసేలా కామెంట్ చేయడం సరికాదని మంగళవారం రాజ్యసభలో జయ బచ్చన్ తెలిపారు.

వినోద రంగానికి చెందిన వ్యక్తులను విమర్శిస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారని జయ బచ్చన్ తెలిపారు. అయితే వారి వాదనతో తను ఏకీభవించబోను అని ఆమె తెలిపారు. అలాంటి భాష వాడి సినిమా ఇండస్ట్రీకి చెందినవారిని తక్కువ చేయొద్దని సూచించారు. కానీ మీరు మొత్తం పరిశ్రమ పేరు/ ప్రఖ్యాతలను దెబ్బతీయలేరు అని పేర్కొన్నారు. కానీ ఇండస్ట్రీకి చెందిన ఒకరు లోక్ సభలో కామెంట్ చేయడం మాత్రం సరికాదని జయ అభిప్రాయపడ్డారు.

Shame that an MP, part of Bollywood, spoke against it: Jaya Bachchan

సినీ పరిశ్రమకు సంబంధించి అంశంపై చర్చిచేందుకు జీరో అవర్‌లో జయ బచ్చన్ నోటీసు ఇచ్చారు. ఆ మేరకు కామెంట్ చేశారు. డ్రగ్స్ గురించి సోమవారం బీజేపీ ఎంపీ రవికిషన్ ప్రస్తావించారు. బాలీవుడ్ మొత్తాన్ని మాదకద్రవ్యాలు ప్రభావితం చేసిందని తెలిపారు. డ్రగ్స్ అక్రమ రవాణా చేసేవారిపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. జీరో అవర్ సందర్భంగా సమస్యను ప్రస్తావించారు.

Recommended Video

India-China Stand Off : China విషయమై Parliament సమావేశాల్లో కీలక ప్రకటన చేయనున్న రక్షణ మంత్రి!!

చైనా, పాకిస్తాన్ నుంచి దేశంలోకి డ్రగ్స్ వస్తున్నాయని తెలిపారు. ఇక్కడి యువతను చెడగొట్టేందుకు పొరుగుదేశాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో బాగా పనిచేస్తుందని తెలిపారు. దీనిపై జయా బచ్చన్ పేరు ప్రస్తావించకుండా మండిపడ్డారు.

English summary
Samajwadi Party MP Jaya Bachchan raised concerns over ‘conspiracy to defame the film industry’ in Rajya Sabha on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X