వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంటు చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదు: విపక్షాలను ఏకిపారేసిన కేంద్రమంత్రులు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పార్లమెంటులో వ్యవసాయ బిల్లుల ఆమోదం సమయంలో ప్రతిపక్ష సభ్యులు వ్యవహరించిన తీరు విచారకరమని, సిగ్గుచేటని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. రాజ్యసభలో ఆదివారం కాంగ్రెస్ సహా విపక్ష సభ్యులు గందరగోళం సృష్టించడంపై రాజ్‌నాథ్ సహా ప్రకాశ్ జవదేకర్, ప్రహ్లాద్ జోషి, పియూష్ గోయల్, థవర్ చంద్ గెహ్లాట్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీలు మీడియాతో మాట్లాడారు.

రైతులకు నాది హామీ..

రైతులకు నాది హామీ..

రైతులను తప్పుదోవ పట్టించేందుకే కాంగ్రెస్ సహ విపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం రైతులను బాధపెడుతుందంటే ఎప్పటికీ నమ్మకూడదని, తాను కూడా ఒక రైతునేనని రాజ్ నాథ్ వ్యాఖ్యానించారు. దేశంలోని రైతులందరికీ హామీ ఇస్తున్నానని చెప్పిన ఆయన.. కనీస మద్దతు ధర, వ్యవసాయ ఉత్పత్తులపై మార్కెట్ కమిటీలకు ముగింపు పలికే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.

ఆమె రాజీనామాకు రాజకీయ కారణాలే..

ఆమె రాజీనామాకు రాజకీయ కారణాలే..

హర్ సిమ్రత్ కౌర్ కేంద్ర మంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేసే విషయంపై తాను స్పందించనని.. ఎందుకంటే, ప్రతి నిర్ణయం వెనుక కొన్ని రాజకీయ కారణాలుంటాయని అన్నారు. ఏదైనా అంశంపై సభలో చర్చలకు అవకాశం ఇవ్వడం అధికార పార్టీ బాధ్యత అని.. దాన్ని ప్రతిపక్షాలు గౌరవించాలి కానీ.. ఆదివారం విపక్ష సభ్యులు వ్యవహరించిన తీరు బాధాకరమని అన్నారు.

పార్లమెంటు చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదు..

పార్లమెంటు చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదు..

రాజ్యసభలో కొందరు సభ్యులు డిప్యూటీ ఛైర్మన్ పట్ల వ్యవహరించిన తీరు చాలా తీవ్రమైనదని అన్నారు. అది పార్లమెంటు గౌరవానికే భంగం కలిగేలా ఉందన్నారు. ఇప్పటి వరకు లోక్‌సభ, రాజ్యసభ చరిత్రలోనే ఇలాంటి ఘటనలు జరగలేదని రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు.

Recommended Video

Rajya Sabha Passes 2 Agriculture Bills వ్యవసాయమంతా కార్పొరేట్ల చేతిలోకి : కాంగ్రెస్ || Oneindia
రాజ్యసభలో గందరగోళం.. అవిశ్వాస తీర్మానంపై ఇలా

రాజ్యసభలో గందరగోళం.. అవిశ్వాస తీర్మానంపై ఇలా

కాగా, ఆదివారం వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా రాజ్యసభలో కాంగ్రెస్ సహా విపక్ష సభ్యులు ఛైర్మన్ పోడియం వద్దకు దూసుకెళ్లి ఆయన మైక్‌ను విరగ్గొట్టే ప్రయత్నం చేశారు. పత్రాలు చించేశారు. గందరగోళం సృష్టించారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్‌పై ప్రతిపక్షాల చేసిన అవిశ్వాస తీర్మానంపైనా కేంద్రమంత్రులు స్పందించారు. ఛైర్మన్‌కు నోటీసులు అందాయని, నిర్ణయం ఆయనే తీసుకుంటారని అన్నారు. ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులు.. ఆదివారం రాజ్యసభలో ఆమోదం పొందాయి. అయితే, విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. పలువురు ఎంపీలను మార్షల్స్ బయటికి పంపించే పరిస్థితి రావడం గమనార్హం.

English summary
Sending a message of strong condemnation against the 'attack' on Rajya Sabha Deputy Chairman Harivansh Narayan Singh in the Upper House, six Union Ministers -Rajnath Singh, Prakash Javadekar, Prahlad Joshi, Piyush Goyal, Thawar Chand Gehlot and Mukhtar Abbas Naqvi addressed a press conference on the issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X