• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఔను అతన్ని కూడా నేనే చంపాను: గౌరీ లంకేష్ హత్యకేసు విచారణలో ట్విస్టులు

|

బెంగళూరు: ఆరేళ్ల క్రితం హేతువాది నరేంద్ర దభోల్కర్‌ను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శరద్ కలాస్కర్ అనే వ్యక్తి,... దభోల్కర్‌ను రెండుసార్లు కాల్చివేసినట్లు కర్ణాటక పోలీసులకు చెప్పాడు - వెనుక నుండి తలపై ఒకసారి కాల్చగా ఆయన కిందకు పడిపోయిన తర్వాత కుడి కంటి పై మరోసారి కాల్చినట్లు చెప్పాడు. 14 పేజీలున్న స్టేట్‌మెంట్‌లో పోలీసుల ముందు నిందితుడు ఒప్పుకున్నాడు. మరో హేతువాది గోవింద్ పన్సారే మరియు ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేష్‌ హత్యలతో కలాస్కర్‌క సంబంధం ఉన్నాయన్న ఆరోపణలను కూడా ఎదుర్కొంటున్నాడు.

గౌరీ లంకేష్ హత్య కేసు విచారణలో కొత్త ట్విస్టు

గౌరీ లంకేష్ హత్య కేసు విచారణలో కొత్త ట్విస్టు

గతేడాది అక్టోబర్‌లో శరద్ కలాస్కర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.అయితే గౌరీ లంకేష్ హత్య కేసులో కలాస్కర్‌ను పోలీసులు అరెస్టు చేసి జైలులో పెట్టారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ చేస్తున్న క్రమంలో దబోల్కర్ హత్య విషయం గురించి కూడా తాను చెప్పినట్లు పోలీసులు తమ చార్జిషీట్లో రికార్డు చేశారు. ధబోల్కర్ హత్య కేసులో చాలామందిపై ఆరోపణలు వచ్చాయి. 2013 ఆగష్టులో పూణేలో మార్నింగ్ వాకింగ్‌కు వచ్చిన సమయంలో దభోల్కర్‌ను హత్య చేసినట్లు ఒప్పుకున్న కలాస్కర్.... ఫిబ్రవరి 2015లో గోవింద్ పన్సారేని హత్యచేసి అదే ఏడాది కల్బుర్గిని కూడా అంతమొందించినట్లు శరద్ కలాస్కర్ తెలిపాడు. సెప్టెంబర్ 2017లో గౌరీ లంకేష్‌ను బెంగళూరులోని తన నివాసం వద్ద హత్య చేశారు.

హత్యలకు ఇలా ప్లాన్ చేశాం

హత్యలకు ఇలా ప్లాన్ చేశాం

మహారాష్ట్ర పాల్‌గఢ్ జిల్లాలోని ఓ పిస్తోలు ఉత్పత్తి కేంద్రంలో యాంటీ టెర్రర్ స్క్వాడ్ దాడులు నిర్వహించిన సమయంలో శరద్ కలాస్కర్ వారికి చిక్కారు. అతన్ని విచారణ చేయగా పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో అనుమానం వచ్చి యాంటీ టెర్రర్ స్క్వాడ్ అరెస్టు చేసింది. విచారణ సమయంలో మూడు హత్యలకు శరద్ కలాస్కర్‌కు సంబంధం ఉందని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చి పూర్తిస్థాయిలో విచారణ చేయగా నేరాలను కలాస్కర్ ఒప్పుకున్నాడు. పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో కలాస్కర్ అసలు ఈ హత్యలను ఎలా ప్లాన్ చేశాడో చెప్పాడు. హిందూ అతివాద సంస్థలు తనను కలిశాయని ఆ తర్వాత వారి భావజాలాన్ని వివరించి, మారణాయుధాల తయారీ ,బాంబుల తయారీ నేర్పించినట్లు చెప్పాడు. కొందరిని అంతమొందించాలని వారు కలాస్కర్‌కు చెప్పినట్లు వెల్లడించాడు. ఇవన్నీ చెప్పింది ఈ హత్యల వెనక ఉన్న మాస్టర్ బ్రెయిన్ విరాంద్ర తావ్డే అని చెప్పాడు. ఇప్పటికే విరాంద్రను సీబీఐ అరెస్టు చేసింది.

అప్పుడే ఆమెను హత్య చేయాలని డిసైడ్ అయ్యాం

అప్పుడే ఆమెను హత్య చేయాలని డిసైడ్ అయ్యాం

నరేంద్ర దభోల్కర్‌ను తలపై కాల్చాల్సిందిగా తవ్డే చెప్పాడని ఆయన చెప్పిన ప్రకారమే కాల్చినట్లు కలాస్కర్ చెప్పాడు. నాటు తుపాకీతో దభోల్కర్‌ను కాల్చి చంపినట్లు కలాస్కర్ వివరించాడు. ఆతర్వాత రెండో నిందితుడిగా ఉన్న సచిన్ అందురే కాల్పులు జరిపినట్లు వివరించాడు. గౌరీ లంకేష్‌ హత్యకేసులో అరెస్టు అయిన అమోల్ కాలేను విరేంద్ర తవ్డే తనకు పరిచయం చేసినట్లు కలాస్కర్ వెల్లడించాడు. 2016లో బెల్గాంలో జరిగిన సమావేశంలో హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారు ఎవరినే దానిపై చర్చజరిగిందని ఆ సందర్భంలో గౌరీ లంకేష్ పేరు బయటకు రావడంతో ఆమెను హత్యచేయాలని అక్కడే నిర్ణయం జరిగిందని చెప్పాడు. ఇక ఆగష్టు 2017లో జరిగిన మరో సమావేశంలో గౌరీ లంకేష్ హత్యకు ప్రణాళిక సిద్ధం చేసి బాధ్యతలను అప్పగించారని చెప్పాడు. అనంతరం సెప్టెంబరులో గౌరీ లంకేష్‌ను హత్య చేసినట్లు కలాస్కర్ చెప్పాడు. బాంబే హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బీజీ కోల్సే పాటిల్‌ను కూడా హత్యచేసేందుకు వ్యూహం రచించామని వెల్లడించాడు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The man accused of killing rationalist Narendra Dabholkar six years ago, has told the Karnataka police how he shot the 67-year-old twice once in the head from behind, and when he fell, once above the right eye. In a chilling 14-page confession, a copy of which was accessed by NDTV, Sharad Kalaskar also admitted to being linked to two other murders that of rationalist Govind Pansare and journalist Gauri Lankesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more