వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొండి మొగుడు పెంకి పెళ్లాం: పాడు పంచాయితీ, అక్కడ కాపురం, ఇక్కడ విడాకులా, పవార్!

|
Google Oneindia TeluguNews

ముంబై: ప్రజా ప్రభుత్వంలో ప్రజలే ప్రభువులు అంటారు. ఓటు వేసిన ప్రజల యోగక్షేమాలు చూడటానికే ప్రజా ప్రతినిధులు పని చెయ్యాలి. అయితే మహారాష్ట్రలో పరిస్థితి వేరుగా ఉంది. ప్రజలు ఓటు వేసి అధిక మెజారిటీ కట్టబెట్టిన బీజేపీ, శివసేన పార్టీలు సీఎం కుర్చికోసం ప్రజల అభిప్రాయాలను గాలికి వదిలేశారు. మొండి మొగుడు, పెంకి పెళ్లాం ఆటలు, పాడు పంచాయితీలు ఇక చాలు, బడాయి వదిలి మొదట ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలని ప్రతిపక్షానికి చెందిన ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ బీజేపీ, శివసేన పార్టీ నాయకులకు చరకలు అంటించారు.

ఏకాంతంగా లవర్స్, ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్, నిలువు దోపిడీ, సోషల్ మీడియాలో, పరువు!ఏకాంతంగా లవర్స్, ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్, నిలువు దోపిడీ, సోషల్ మీడియాలో, పరువు!

మొగుడు పెళ్లాం పాడు పంచాయితీ

మొగుడు పెళ్లాం పాడు పంచాయితీ

మహారాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే మొగుడు పెళ్లాల పాడు పంచాయితీలు గుర్తుకు వస్తున్నాయి. నా మాటే పైచెయ్యి కావాలంటే లేదు నామాటే పైచెయ్యి కావాలని బీజేపీ, శివసేన పార్టీలు పోట్లాడుకుంటున్నాయి. ప్రజలు బీజేపీ, శివసేన కూటమికి అధిక మెజారిటీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలని ఆదేశించినా ఆ పార్టీ నాయకులు వారి ప్రయోజనాలు, సీఎం కుర్చీ కోసమే పట్టుబడుతున్నారు.

అక్కడ కాపురం, ఇక్కడ విడాకులా?

అక్కడ కాపురం, ఇక్కడ విడాకులా?

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో శివసేన పార్టీ ఉంది. కేంద్రంలో బీజేపీతో కలిసి అధికారం పంచుకుంటున్న శివసేన మహారాష్ట్ర విషయంలో మాత్రం పంతం పడుతోంది. 50-50 ఫార్ములాకు మీరు కట్టుబడి ఉండాలని, రెండున్నరేళ్ల సీఎం కుర్చీ మాకు ఇవ్వాలని శివసేన అంటోంది. కేంద్రంలో బీజేపీతో కలిసి కాపురం చేస్తున్న శివసేన మహారాష్ట్ర విషయంలో ఆ పార్టీతో విడాకులు తీసుకోవడానికి సిద్దం అయ్యింది.

 ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా ? లేదా?

ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా ? లేదా?

మీ పంతాలు పట్టింపులు వదిలి మహారాష్ట్రలో వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలని బీజేపీ, శివసేన నాయకులకు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సూచించారు. శుక్రవారం శరద్ పవార్ మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రలో మీరు ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలని బీజేపీ, శివసేన పార్టీలకు ప్రజలు తీర్పు ఇచ్చారనే విషయం ఆ పార్టీ నేతలు గుర్తు చేసుకోవాలని, ప్రజలకు చక్కటి పాలన అందించడానికి చర్యలు తీసుకోవాలని శరద్ పవార్ అన్నారు.

ఆర్థికంగా దెబ్బ పడుతోంది!

ఆర్థికంగా దెబ్బ పడుతోంది!

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడంలో ఆలస్యం అయితే ఆ దెబ్బ ఆర్థిక వ్యవస్థ మీ పడుతోందని, తరువాత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోందని శరద్ పవార్ గుర్తు చేశారు. ఇప్పటికే వరదలు, ప్రకృతి వైపరీత్యాలతో ప్రజలు ఇబ్బందులు ఎదర్కొంటున్న విషయం మీకు గుర్తుకు రావడం లేదా ?, ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడంలో ఇంకా మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అంటూ బీజేపీ, శివసేన పార్టీల నాయకులను శరద్ పవార్ ప్రశ్నించారు.

 మా మద్దతు సరిపోదు మిత్రమా!

మా మద్దతు సరిపోదు మిత్రమా!

మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి ఎన్సీపీ మద్దతు ఇస్తే సరిపోదని, మెజారిటీ ఎమ్మెల్యేల సంపూర్ణ మద్దతు కావాలని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. మమ్మల్ని ప్రతిపక్షంలో కుర్చోవాలని ప్రజలు తీర్పు ఇచ్చారని, ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామని, మాకు అధికారం ముఖ్యం కాదని, శివసేనకు ఎలాంటి పరిస్థితో మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని శరద్ పవార్ కుండలు బద్దలు కొట్టి చెప్పారు.

ప్రజా తీర్పు అంటే అంత చులకనా?

ప్రజా తీర్పు అంటే అంత చులకనా?

మీరు అధికారంలోకి రావాలని ప్రజలు తీర్పు ఇచ్చారు, ప్రజా తీర్పు అంటే మీకు అంత చులకనా అంటూ బీజేపీ, శివసేన నాయకులను శరద్ పవార్ ప్రశ్నించారు. ఇప్పటికే సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారని, ఇకనైనా శివసేన, బీజేపీ నాయకులు చర్చలు జరిపి వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలని ఆ పార్టీల నాయకులకు తాను మనవి చేస్తున్నానని శరద్ పవార్ అన్నారు.

English summary
Maharastra: Sharad Pawar Suggest To Bjp-Shivasena For Form The Government. CM Devendra Fadnavis Already Submitted The Resign Letter To Governer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X