వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గెలిచాం: మీసా, శరద్ సంబరాలు, మళ్లీ సీఎంగా నితీష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము మంచి ఫలితాలు సాధిస్తున్నామని, 150కి పైగా స్థానాలలో తప్పకుండా గెలుస్తున్నామని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు మీసా భారతి ఆదివారం అన్నారు. బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్-జెడీయు-ఆర్జేడీతో కూడిన మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముంది.

మాదే అధికారం: శరద్ పవార్

బీహార్ ప్రజలకు జనతా దళ్ (యునైటెడ్) అధ్యక్షుడు శరద్ యాదవ్ ఆదివారం నాడు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఆధిక్యత చూస్తుంటే తాము 150 స్థానాలు సులభంగా గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ఇది కీలక గెలుపు అన్నారు.

Sharad Yadav and Misa Bharti claim victory for Grand Alliance

పట్నాలో మహాకూటమి శ్రేణుల సంబరాలు

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మహాకూటమి ఆధిక్యంలో కొనసాగుతుండటంతో ఆ కూటమి శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. పట్నాలో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ కార్యకర్తలు పార్టీ జెండాలు చేతబూని నినాదాలు చేస్తున్నారు. రంగులు చల్లుకుంటూ, మిఠాయిలు తినిపించుకుంటూ ఆనందోత్సాహాలతో నృత్యాలు చేస్తున్నారు.

బీహార్‌ ఓట్ల లెక్కింపు ఫలితాల్లో మహాకూటమి ఆధిక్యంలో రావడంతో రాజధాని పట్నాలో ఆర్డేడీ కార్యాలయంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నారు. మహాకూటమి గెలుస్తుందని కార్యకర్తలు ఉత్సాహంగా నృత్యాలు చేస్తున్నారు.

మహాకూటమి అధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బిహార్‌లో ఎన్నికల్లో బిజెపి ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమికి, జేడీయూ, ఆర్డేడీ, కాంగ్రెస్‌లు కలిసి ఏర్పాటైన మహాకూటమికి మధ్య పోటీ నెలకొన్న విషయం తెలిసిందే.

English summary
Sharad Yadav and Misa Bharti claim victory for Grand Alliance
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X