వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నితీశ్‌ కుమార్‌కు ఝలక్‌- కాంగ్రెస్‌లోకి శరద్‌ యాదవ్‌ కుమార్తె- వెంటనే అసెంబ్లీ సీటు..

|
Google Oneindia TeluguNews

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. గత ఎన్నికల్లో మహాకూటమి పేరుతో పోటీ చేసి బీజేపీకి చుక్కలు చూపించిన సీఎం నితీశ్‌ కుమార్‌ ఈ ఎన్నికల్లో మాత్రం కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే ఆయన ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తుండగా.. తాజాగా ఆయనకు ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కూడిన మహాకూటమి మరో ఝలక్‌ ఇచ్చింది.

 బీహార్‌ ప్రచారానికి ఆ ఇద్దరినీ దూరం పెట్టిన బీజేపీ- కాషాయదళంలో ఒకటే చర్చ.... బీహార్‌ ప్రచారానికి ఆ ఇద్దరినీ దూరం పెట్టిన బీజేపీ- కాషాయదళంలో ఒకటే చర్చ....

2015లో జరిగిన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి తరఫున గెలిచి సీఎం పీఠాన్ని అందుకున్న నితీశ్‌ కుమార్‌, ఆ తర్వాత ఆర్జేడీ-కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి బీజేపీతో చేతులు కలిపారు. ఆ ఎన్నికలకు ముందు ఎన్డీయేను వీడినట్లు నటించి తిరిగి ఎన్డీయేతో చేరిపోయారు. దీన్ని వ్యతిరేకించిన సీనియర్ నేత శరద్‌యాదవ్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఇప్పుడు నితీశ్‌కు దెబ్బకు దెబ్బ కొట్టాలని భావిస్తున్న మహాకూటమి నేతలు.. శరద్ యాదవ్ కుమార్తెను తెరపైకి తెచ్చారు. శరద్ కుమార్తె సుభాషిణీ యాదవ్‌ ఇవాళ మహాకూటమి భాగస్వామి అయిన కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

Sharad Yadav’s daughter Subhashini joins Congress ahead of Bihar polls

Recommended Video

Bihar Elections 2020 : Key Issues in Nitish Vs Tejashwi Row | NDA alliance VS Mahagathbandhan

తన తండ్రి శరద్ యాదవ్‌ నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన బీహార్‌లోని మాధేపురా ఎంపీ సీటు పరిధిలోకి వచ్చే బీహారీగంజ్ నుంచి సుభాషిణీ యాదవ్ పోటీ చేయబోతున్నారు. తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించడమే తన లక్ష్యమని కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సందర్భంగా సుభాషిణి వ్యాఖ్యానించారు. తన తండ్రి కక్ష తీర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ఆమె స్పష్టం చేశారు. ఎన్నికలంటే కక్షసాధింపు వేదిక కాదని, అభివృద్ధి అజెండాతోనే తాను ముందుకెళ్తానని సుభాషిణి ప్రకటించారు.

English summary
Janata Dal (U) rebel Sharad Yadav’s daughter Subhashini Yadav joined the Congress party on Wednesday. Her father was expelled from Janata Dal (U) for opposing Bihar Chief Minister Nitish Kumar’s move to return to NDA
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X