వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

14 రోజుల్లో 106 శాతం పెరిగిన కేసులు, 74 వేల నుంచి లక్ష 45 వేలకు చేరిన సంఖ్య, ఎందుకో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

లాక్‌డౌన్ 4.0 నిబంధనల సడలింపులతో రైళ్లు పట్టాలపైకి ఎక్కాయి. ఆయా రైళ్లలో తగిన జాగ్రత్తల తీసుకుంటోన్న.. ఫలితం లేకుండా పోతోంది. రైళ్లు నడవడంతో పాజిటివ్ కేసులు 106 శాతం పెరిగి డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఇందులో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. యావరేజీ 106 శాతం కాగా.. మహారాష్ట్రలో మాత్రం 125.1 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్నాయి.

చేతిలో పని లేక వలసకూలీలను స్వస్థలాలకు పంపించేందుకు ఈ నెల 12వ తేదీ నుంచి శ్రామిక్ రైళ్లను అధికారులు నడిపిస్తున్నారు. 12వ తేదీ నుంచి 26వ తేదీ వరకు వరకు దేశంలో 68 వేల 89 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటిచింది. మే 12వ తేదీన వైరస్ కేసుల సంఖ్య 74 వేల 624 ఉండగా.. అది మే 25వ తేదీకి లక్ష 45 వేల 380కి చేరింది. మహారాష్ట్ర మాత్రం 125.1 శాతంతో 29 వేల 266 పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

Sharp 106% spike in coronavirus cases since trains began..

గత 15 రోజుల్లో ఢిల్లీలో 6820 కేసులు రికార్డయ్యాయి. మణిపూర్‌ 2 కేసులతో మొత్తం సంఖ్య 39కి చేరింది. కానీ గోవాపై వైరస్ ప్రభావం చూపించింది. ఏఫ్రిల్ నెలాఖరు వరకు కరోనా వైరస్ ఫ్రీ గా ఉన్న రాష్ట్రం.. రైళ్లు ప్రారంభించాక 7 కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 67కి చేరింది. వైరస్ పెరుగుదల రేటు 857.1 శాతంగా ఉంది.

అసోం 709.2, ఉత్తరాఖండ్ 413.2 శాతం కేసులు నమోదయ్యాయి. ఉత్తరాఖండ్‌లో 68 కేసులతో మొత్తం 349కి చేరింది. అసోం 65 కేసులతో మొత్తం 526కి చేరింది. ఛత్తీస్ గఢ్ 393.2 శాతం, బీహర్ 265.2 శాతం, హిమాచల్ ప్రదేశ్ 278 శాతం, కర్ణాటక 153.1 శాతం కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 9080 కేసులు నమోదవడంతో.. 113.5 శాతం పెరిగింది. మొత్తం కేసుల సంఖ్య 17 వేల 82కి చేరింది.

English summary
The number of coronavirus cases in India has witnessed a surge of 106 per cent since Indian Railways partially resumed passenger train operations on May 12.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X