వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుండె ధైర్యం చూపారు, ‘నీడ కూడా దెయ్యమే’: చిదంబరంకు శశిథరూర్ సపోర్ట్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి చిదంబరంకు ఆ పార్టీ నేతల నుంచి గట్టి మద్దతు లభిస్తోంది. చిదంబరం బుధవారం రాత్రి సీబీఐ అధికారుల ముందు లొంగిపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇప్పటికే కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ.. చిదంబరంకు మద్దతుగా తమ గళం వినిపించగా.. ఇప్పుడు మరో సీనియర్ నేత శశిథరూర్ అదేబాటలో నడిచారు. సీబీఐ ముందు హాజరై చిదంబరం తన గుండె ధైర్యాన్ని ప్రదర్శించారని చెప్పుకొచ్చారు. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందని వ్యాఖ్యానించారు.

సీబీఐ ముందు విచారణకు హాజరైన చిదంబరంలో ఆయన ఆత్మవిశ్వాసం, ధైర్యం కనిపిస్తోందని శశిథరూర్ అన్నారు. చివరకు న్యాయమే గెలుస్తుందనే నమ్మకం తమకు ఉందని ఆయన అన్నారు.

భయంతో నడుస్తున్న వ్యక్తికి.. ప్రతి నీడ దెయ్యంలానే కనిపిస్తుందని చిదంబరం చేసిన వ్యాఖ్యలను శశిథరూర్ గుర్తు చేశారు. వాస్తవాలు బయటపడేంత వరకు ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, అప్పటి వరకు కొందరు ఇబ్బందులు పెట్టి సంతోషిస్తారని వ్యాఖ్యానించారు.

ఇది ఇలా ఉండగా, మోడీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ, కొన్ని మీడియా సంస్థల ద్వారా చిదంబరం వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ అధికార దుర్వినియోగాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. చిదంబరం విషయంలో కేంద్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా వ్యవహరించిందని ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Shashi Tharoor Backs Persecuted Chidambaram With A Tweet And A Big Word

కాగా, ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో చిదంబరంకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సుప్రీంకోర్టులో కూడా ఈ మాజీ కేంద్రమంత్రికి ఊరట లభించలేదు. దీంతో బుధవారం రాత్రి ఆయన సీబీఐ ముందు ఆయన నివాసంలోనే లొంగిపోయారు. వెంటనే సీబీఐ అధికారులు ఆయనను తమ అదుపులోకి తీసుకున్నారు.

English summary
A day after probe agencies summoned Union Minister P Chidambaram in an alleged money laundering case involving INX Media, Congress leader Shashi Tharoor came out in his support with a tweet claiming that justice will prevail in the end.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X