వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ ఎందుకు క్షమాపణ చెప్పాలి... బీజేపీ డిమాండ్‌పై శశి థరూర్ రివర్స్ ఎటాక్...

|
Google Oneindia TeluguNews

పుల్వామా ఉగ్రదాడి తమ ఘనతే అని స్వయంగా పాకిస్తాన్ మంత్రి ఫవద్ చౌదరి ప్రకటించడంతో పాక్ వక్రబుద్ది మరోసారి బట్టబయలైంది. పాక్ చేసిన ఈ ప్రకటనను బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్‌పై ఎక్కుపెడుతోంది. పుల్వామా దాడి విషయంలో అప్పట్లో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడేం సమాధానం చెప్తుందని ప్రశ్నిస్తోంది. ఈ దాడికి సంబంధించి ప్రధాని మోదీపై ప్రశ్నాస్త్రాలు ఎక్కుపెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందిస్తూ... బీజేపీ డిమాండును తోసిపుచ్చారు.

ట్విట్టర్ ద్వారా స్పందించిన శశి థరూర్... కాంగ్రెస్ ఎందుకు క్షమాపణలు చెప్పాలని ప్రశ్నించారు. 'కాంగ్రెస్‌ను ఎందుకు క్షమాపణలు చెప్పమంటున్నారో తెలుసుకునేందుకు నేనిప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. సైనికుల భద్రతను కోరినందుకే క్షమాపణలు చెప్పమంటున్నారా...? లేక రాజకీయాలను పక్కనపెట్టి దేశం కోసం ఒక్కటైనందుకా...? లేక అమరులైన సైనికుల కుటుంబాలకు సంతాపం ప్రకటించినందుకా...?' అని శశి థరూర్ బీజేపీని ప్రశ్నించారు.పుల్వామా దాడిపై కుట్ర కోణాలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ దేశానికి క్షమాపణలు చెప్పాలంటూ కేంద్రమంత్రి జవదేకర్ చేసిన వ్యాఖ్యలపై శశి థరూర్ ఇలా స్పందించారు.

Shashi Tharoor hits back on BJPs apology demand over pulwama attack

Recommended Video

India Gandhi : Shashi Tharoor Makes Major Blunder || థరూర్ జీ.. ఇండియా గాంధీ ఎవరూ ? || Oneindia

ఇటీవల పాకిస్తాన్ మంత్రి ఫవద్ చౌదరి ఆ దేశ పార్లమెంట్ సాక్షిగా పుల్వామా దాడి తమ ఘనతే అని ప్రకటించడం తెలిసిందే. పుల్వామా మారణహోమం క్రెడిట్ నూటికి నూరు శాతం ఇమ్రాన్ సర్కారుకే దక్కుతుందని వ్యాఖ్యానించారు. సాక్షాత్తు పార్లమెంటులో ఆ దేశ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేకెత్తించాయి. పుల్వామా దాడి తర్వాత భారత్ పాక్‌పై ఆరోపణలు చేయగా... తమకేమీ సంబంధం లేదంటూ ఎన్నోసార్లు పాక్ బుకాయించింది. పైగా అంతర్జాతీయ వేదికలపై సైతం భారత్‌నే బద్నాం చేసే ప్రయత్నం చేసింది. తాజాగా ఆ దేశ మంత్రే పుల్వామా దాడి తమ ఘనత అని చెప్పుకోవడంతో పాకిస్తాన్ వక్రబుద్ది మరోసారి బట్టబయలైంది. ఈ నేపథ్యంలో పుల్వామా దాడిని రాజకీయం చేయాలని చూసిన కాంగ్రెస్ పార్టీ... ఇకనైనా తమ విధానం మార్చుకోవాలని ప్రధాని మోదీ సైతం పరోక్షంగా హెచ్చరించారు.

English summary
Congress MP Shashi Tharoor today dismissed BJP demands for an apology from his party for questions posed to the government after the Pulwama terror attack in February last year. Mr Tharoor said he was "still trying to figure out what the Congress is supposed to apologise for...".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X