వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పులో కాలేసిన థరూర్... ఇందిరాగాంధీ విషయంలో ఘోర తప్పిదం

|
Google Oneindia TeluguNews

Recommended Video

India Gandhi : Shashi Tharoor Makes Major Blunder || థరూర్ జీ.. ఇండియా గాంధీ ఎవరూ ? || Oneindia

శశిథరూర్.. పరిచయం అక్కర్లేని పేరు. రాజకీయ నేత, మేధావి. అంతకుమించి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పర్సన్. జనరల్‌గా శశిథరూర్ తెలిసి కాదు తెలియక కూడా తప్పుచేయరు. తనదైన వాగ్దాటితో మాట్లాడుతారు. ట్వీట్లు కూడా చేస్తుంటారు. మరి అలాంటి నేత తప్పు చేస్తే .. ఫోటో ఒకటి లోకేషన్ ఒకటి పెడితే .. దీంతోపాటు పేరు సరిగా రాయకుంటే నెటిజన్లకు పండగే పండగ. అలాంటి సిచుయేషన్ దిగ్గజ కాంగ్రెస్ నేతకు తలెత్తింది. దీంతో నెటిజన్లు స్పందిస్తూ .. ఏంటీ థరూర్ అని దుమ్మెత్తిపోస్తున్నారు.

మోడీకి కౌంటర్ ఇద్దామని ట్రై చేసి ..

ఆరు రోజుల పర్యటన కోసం అమెరికా వెళ్లిన ప్రధాని మోడీ బిజీ బిజీగా ఉన్నారు. ఆదివారం హ్యూస్టన్‌లో జరిగిన హౌడీ మోడీకి భారత సంతతికి చెందిన అమెరికన్లు భారీగా హాజరయ్యారు. అగ్రరాజ్యంలోనూ మోడీకి విపరీతంగా క్రేజ్ ఉందని మీడియా కోడై కూసింది. దీంతో విపక్ష కాంగ్రెస్ పార్టీ తమ కౌంటర్ అటాక్ ప్రారంభించింది. ఇందుకోసం తమ ట్రబుల్ షూటర్ శశిథరూర్ రంగంలోకి దిగారు. కానీ ఈసారి థరూర్ తడబడ్డారు. ఫోటో వేరేది పోస్ట్ చేయడం, పేరు తప్పుగా రాయడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ట్వీట్ చేసి .. తప్పులో కాలేసి

ట్వీట్ చేసి .. తప్పులో కాలేసి

హౌడీ మోడీ సభ తర్వాత శశిథరూర్ నిన్న ట్విట్టర్ వేదికగా స్పందించారు. తొలి ప్రధాని నెహ్రూతో కలిసి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఉన్న ఫోటోను ఒకటి పోస్ట్ చేశారు. ర్యాలీలో ఇందిరా-నెహ్రూ వెళ్తున్న ఫోటోలను షేర్ చేశారు. 1954లో నెహ్రూ-ఇందిరాగాంధీ అమెరికాలో పర్యటించారు. అప్పుడు వారికొచ్చిన ప్రజా స్పందనను చూడాలని ట్వీట్లు చేశారు. చాలా ఫోటోలను కూడా అందులో పెట్టారు. దానికి 1954లో అమెరికాలో ‘నెహ్రూ-ఇండియా' అని క్యాప్షన్ పెట్టారు. వారి పర్యటనకు ఏ స్థాయిలో ప్రజలు వచ్చారో చూడాలని కోరారు. ఆ సమయంలో ప్రచారం లేదని .. కానీ ఎన్ఆర్ఐలు మాత్రం ఎగబడి మరీ వచ్చారని గుర్తుచేశారు.

అమెరికా కాదు అది ..

వాస్తవానికి నెహ్రు-ఇందిరా 1954లో అమెరికాలో పర్యటించలేదు. అదీ రష్యాలో దిగిన ఫోటో. అక్కడ వారికి ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టారు. దాంతోపాటు ఇందిరాగాంధీ అనే పేరును ఇండియా గాంధీ అని రాశారు థరూర్. దీనిని తొలుత జర్నలిస్ట్ ఆర్ జగన్నాథం గుర్తించారు. దీనిపై రిప్లై ఇస్తూ.. అదీ 1956లో మాస్కో అని చెప్పారు. థరూర్‌కు జగన్నాథం చెప్పిన లోకేషన్ ఓకే కానీ .. సంవత్సరం మాత్రం తప్పు. ఆ ఫోటో అప్పటి యూఎస్ఎస్ఆర్ లోని మాగ్నిటోగర్క్స్‌లో తీసినది. జగన్నాథం సూచనతో అమెరికా కాదని స్పష్టమైంది. తర్వాత సంవత్సరం కూడా 1955 అని ధ్రువీకరించారు. ఇక అప్పటినుంచి శశిథరూర్‌పై నెటిజన్లు ఒక్కసారిగా దండయాత్ర ప్రారంభించారు.

ఇందిరా అంటే ఇండియానా ..

మాజీ కాంగ్రెస్ అధ్యక్షులు దేవ్‌కాంత్ బరూహ్ చెప్పిన స్లోగన్‌ గుర్తుచేస్తున్నారు. ‘ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా' అనే నానుడిని నిజం చేస్తూ కామెంట్ చేశారా అని ప్రశ్నిస్తున్నారు. మీరు అతిపెద్ద తప్పుచేశారు.. గమనించారా అంటూ ట్వీట్ల మోత మోగించారు. ట్వీట్ల దండయాత్ర జరగడంతో శశిథరూర్ ప్రతిస్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి తనకు తప్పుడు ఫోటో వచ్చిందని ... దానిని అలాగే పోస్ట్ చేసినట్టు వివరించారు. అయితే విదేశాల్లో మాజీ ప్రధానులకు గౌరవం దక్కడం ఇది తొలిసారి కాదని మెలికపెట్టారు. ఇదివరకే నెహ్రూ-ఇందిరాకు ఆ స్థాయిలో గౌరవ, మర్యాదలు లభించాయని పేర్కొన్నారు.

English summary
Shashi Tharoor made a major gaffe on Twitter, when he called Indira Gandhi 'India Gandhi' in a tweet and then gave incorrect information to his followers. So obviously, netizens were quick to troll him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X