వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పదప్రయోగాలతో మరో సారి స్ట్రైక్ చేసిన ఎంపీ శశిథరూర్

|
Google Oneindia TeluguNews

శశి థరూర్... కాంగ్రెస్ సీనియర్ నేత. అంతకంటే ముందు గొప్ప రచయిత. కేరళకు చెందిన ఈ కాంగ్రెస్ నేత ఏది చేసినా మాట్లాడినా అందులో కాస్త లోతైన అంశం దాగి ఉంటుంది. ఆయన రాజకీయాలపై మాట్లాడినా.. లేదా పుస్తకాల్లో తన అభిప్రాయం వ్యక్తం చేసినా అందులో లోతైన అర్థం దాగి ఉంటుంది. ప్రస్తుతం శశిథరూర్ ఓ పుస్తకం రాశారు. ఇది ప్రధాని నరేంద్ర మోడీపై శశిథరూర్ రాసిన పుస్తకం. దీనిపేరు "ది పారడాక్సికల్ ప్రైమ్ మినిస్టర్". ఇందులో ప్రధాని మోడీని విమర్శిస్తూ ఓ పదం వాడారు. "floccinaucinihilipilification" ఇంగ్లీషులో ఉన్న ఈ పదం చదివేందుకే చాలా కష్టతరమవుతోంది. కానీ దీని అర్థం చాలా సింపుల్‌గా వివరించారు శశిథరూర్. విలువ లేనిదిగా అంచనా వేసే చర్య లేదా అలవాటు అని వివరించారు. ఇది కూడా ట్విటర్ వేదికగా వివరించారు.

ఇక శశిథరూర్ ఇక్కడితో ఆగలేదు. తను ముందురోజు ట్వీట్ చేసినది ఎవరికైనా అర్థం కాకపోతే అదిఒక "hippopotomonstrosesquipedaliophobia"అంటూ మళ్లీ ట్వీట్ చేశారు. ఇక దీనికోసం అర్థం వెతుకుతున్నారా వెతుకొద్దంటూ పేర్కొన్నారు. "పొడవైన పదాలు చూసి భయపడటం" అనేది దీని అర్థం అని తెలిపారు. ఇక ఈ పదాలను చూసే భయపడొద్దంటూ చెబుతూనే ఇంకా కొన్ని పదాలు పలికేందుకు సులభంగా ఉంటాయని చెబుతూ మరో పదం కూడా ట్వీట్ చేశారు. "Sesquipedalian" సెస్కీపెడాలియన్‌ దీనికర్థం "పొడవైన పదాల కలయిక" అంతేకాదు లాటిన్‌లో ఈ పదానికి అర్థం అడుగునర్ర పొడవు అని అర్థమట.

Shashi Tharoor strikes once again with his vocabulary,netizens go crazy

మొత్తానికి శశి థరూర్ ఇలాంటి పదప్రయోగాలు చేయడంవల్ల ఆయన ఎంతటి మేధావో తెలియజేస్తుంది. అంతేకాదు తన భావాలు ఇతరులకు అర్థమయ్యేలా ఉండేలా తన పదప్రయోగం ఉంటుందే తప్ప... అదేదో గొప్పతనాన్ని చాటుకునేందుకు కాదని శశి థరూర్ తెలిపారు. మొత్తానికి శశిథరూర్ ట్వీట్‌కు నెటిజెన్లు కూడా చాలా క్లిష్టంగానే కామెంట్ చేస్తున్నారు. క్లారిఫికేషన్ ఇచ్చేందుకు వాడిన పదానికి క్లారిఫికేషన్ కావాలంటూ వారు ట్వీట్ చేశారు.

English summary
Mere news of a forthcoming Shashi Tharoor book is often enough to whet readers' appetites, but perhaps the MP doesn't see it that way.This week, when he unleashed his intimidating vocabulary during a promotional tweet-spree on "The Paradoxical Prime Minister", it became a story by itself. He said the book was more than an exercise in "floccinaucinihilipilification" -- or "the action or habit of estimating something as worthless".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X