బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జైల్లో శశికళ లగ్జరీ లైఫ్: సోషల్ మీడియాలో, జైల్లో వంట మనిషి కాబోయే తమిళనాడు సీఎం!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళకు రాచమర్యాదలు జరుగుతున్నాయని కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ డి. రూప సంచలన ఆరోపణలు చెయ్యడంతో సోషల్ మీడియాలో ఈ విషయంపై జోరుగానే చర్చ జరుగుతోంది.

<strong>జైల్లో శశికళ రాచమర్యాదలు: సీఎం సీరియస్; విచారణకు ఆదేశం, చిన్నమ్మ కథ కంచికే!</strong>జైల్లో శశికళ రాచమర్యాదలు: సీఎం సీరియస్; విచారణకు ఆదేశం, చిన్నమ్మ కథ కంచికే!

తమిళనాడుకు చెందిన చిన్నమ్మ శశికళకు బెంగళూరు శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో వీవీఐపీ ఖైదీలా చూడటం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. కొందరు అయితే ఆమె చెన్నైలోని పోయెస్ గార్డెన్ లో ఉన్నారా ? పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్నారా అని ప్రశ్నిస్తున్నారు.

డీఐజీ రూప రాసిన లేఖలో

డీఐజీ రూప రాసిన లేఖలో

కర్ణాటక జైళ్ల శాఖ ఐజీ, డీజీ సత్యనారాయణరావుతో సహ ప్రభుత్వానికి 9 విషయాలపై డీజీపీ రూప లేఖ రాశారు. అందులో రాసిన 9 ఆరోపణలలో 8 ఆరోపణలకు నా దగ్గర సాక్షాలు ఉన్నాయని గురువారం చెప్పారు. మరో ఆరోపణకు సాక్షం లేదని, విచారణ జరిపిస్తే ఆ సాక్షం కూడా బయటపడుతుందని రూప అంటున్నారు.

పన్నీర్ వంటల కోసం వంట గది

పన్నీర్ వంటల కోసం వంట గది

పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళ కోసం ప్రత్యేక వంట గది ఏర్పాటు చేశారని తెలిసింది. ఇది నిజమైతే శశికళ మూడు పూటలు పన్నీర్ తో చేసిన వంటకాలు ఆరగిస్తున్నారని తెలుస్తోంది. నిజంగా శశికళ చిప్పకూడు తింటున్నారా ? పన్నీర్ వంటకాలు తింటున్నారా అంటూ రమేష్ శ్రీవత్సవ అనే ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

శశికళ గంజాయి సేవిస్తారా ?

శశికళ గంజాయి సేవిస్తారా ?

పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న 25 మంది ఖైదీలను వైద్య పరీక్షలు చేయిస్తే 18 మంది గంజాయి సేవించారని వెలుగు చూసిందని డీఐజీ రూప అంటున్నారు. అయితే శశికళ కూడా గంజాయి సేవిస్తున్నారా ? అనే అనుమానం వస్తోందని హరి ప్రభాకర్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు.

శశికళ ఖరీదైన మహిళ

శశికళ ఖరీదైన మహిళ

వీవీఐపీ సౌకర్యాలు కల్పించాలని శశికళ రూ. 2 కోట్లు లంచం ఇచ్చారని వెలుగు చూడటంతో ఆమె ఇప్పుడు కూడా సాదారణ మహిళగా (ఖైదీ) కనపడటం లేదని, ఖరీదైన మహిళ అని వెలుగు చూసిందని కీర్తి అనే యువతి సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

వంట మనిషి తమిళనాడు సీఎం

వంట మనిషి తమిళనాడు సీఎం

శశికళకు జైల్లో వంటలు చేసి పెడుతూ అన్ని సౌకర్యాలు చూసుకుంటున్న వంట మనిషికి చిన్నమ్మ చాల ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని, ఆ వంట మనిషి కచ్చితంగా తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి అంటూ రాజేష్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు. మొత్తం మీద శశికళ జైలు జీవితం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగానే చర్చ జరుగుతోంది.

English summary
Karnataka IPS officer Roopa D's letter, which has alleged that Sasikala Natarajan, currently lodged in the Bengaluru central prison, is being given special treatment. No the issue creating a bid debate in social media
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X