వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత మరణంపై సిబిఐ విచారణ జరిపించాలి,సంచలన ఆరోపణలు చేసిన శశికళ

జయలలిత మరణంపై సిబిఐ విచారణ జరిపించాలని రాజ్యసభసభ్యురాలు శశికళ పుష్ప డిమాండ్ చేశారు. ఈ విషయమై రాష్ట్రపతికి, ప్రధానమంత్రి, కేంద్రహోంశాఖ మంత్రిని కలువనున్నట్టు చెప్పారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై: జయలలిత మరణంపై సిబిఐ విచారణ జరిపించాలని రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప డిమాండ్ చేశారు. జయ మరణంపై తనకు అనుమానాలున్నాయని చెప్పారు. ఈ విషయమై తాను రాష్ట్రపతి, ప్రధానమంత్రి , కేంద్ర హోంశాఖ మంత్రిని కలువనున్నట్టు చెప్పారు.

జయలలిత మరణంపై అనుమానాలున్నాయని ఆమె మరోసారి తన అనుమానాలను వ్యక్తం చేశారు. ఆమె ఎన్టీవి చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. జయ మరణం తర్వాత తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొందని ఆమె అన్నారు. జయలలిత స్థానాన్ని ఎవరూ కూడ భర్తీ చేయలేరని ఆమె అభిప్రాయపడ్డారు.

జయలలిత నెచ్చెల్లి శశికళ కుటుంబంపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఆమె చెప్పారు.అన్నాడిఎంకె పార్టీ జనరల్ సెక్రటరీ పదవికి ప్రజా స్వామ్యబద్దంగా జరగాలని ఆమె అభిప్రాయపడ్డారు.కొందరు అప్రజాస్వామికంగా సంతకాలను సేకరించారని ఆమె ఆరోపించారు.

తాను ఇంకా అన్నాడిఎంకె పార్టీ సభ్యురాలినే అని చెప్పారు. తాను పార్టీలో సామాస్య కార్యకర్తనే అని ఆమె చెప్పుకొన్నారు. అయితే జయలలిత ఆసుపత్రిలో ఉన్న కాలంలోనే శశికళ పుష్ప పరోక్షంగా శశికళ నటరాజన్ పై విమర్శలు గుప్పించారు. ఆమె లక్ష్యంగానే విమర్శలు చేశారు.

English summary
shashikala pushpa demanded enquiry with cbi about jayalalita death .she will be meet presiednt, primeminister, central homemister very soon,. she interviewed ntv telugu channel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X