వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొశ్చన్స్ నో, డిబేట్స్ నో, బిల్స్ నో : ఎంపీ ల్యాడ్స్ నిధులకు ఓకే, ఇది శత్రుఘ్న సిన్హా రికార్డు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు : 16వ లోక్‌సభలో ఫైర్‌బ్రాండ్ శత్రుఘ్నసిన్హా అధికార ఎన్డీఏలో విపక్షంలా వ్యవహరించారు. ఆయన కేంద్రమంత్రి పోర్టుపోలియో పోవడంతో .. ధిక్కార స్వరానికి పదునుపెట్టారు. మరికొద్దిరోజుల్లో 16వ లోక్‌సభ ముగిసి .. 17వ దిగువసభ కొలువుదీరనుంది. అయితే ఈ సందర్భంగా శత్రుఘ్నసిన్హాకు సంబంధించి ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.

<strong>దరిద్రో నారాయణ, గరిబీ హఠావో నినాదాలు ఇంకెన్నాళ్లు : మహబూబాబాద్ సభలో కేసీఆర్ విసుర్లు </strong>దరిద్రో నారాయణ, గరిబీ హఠావో నినాదాలు ఇంకెన్నాళ్లు : మహబూబాబాద్ సభలో కేసీఆర్ విసుర్లు

సభలో నోరు తెరవని సిన్హా

సభలో నోరు తెరవని సిన్హా

గత ఐదేళ్లలో శత్రుఘ్నసిన్హా పార్లమెంటరియన్‌గా మెరుగైన ప్రతిభ చూపలేదు. తన ఫోర్టుపోలియో పోయాక .. మోదీ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టేందుకు సమయం కేటాయించారు ట్రబుల్ షూటర్. ఐదేళ్లలో సభలో ఒక అంశంపై చిన్న ప్రశ్నను కూడా సంధించలేదు. అంతేకాదు ప్రజా ప్రయోజనార్థం చేపట్టిన చర్చలో కూడా పాలుపంచుకోలేదు. ఇక ప్రైవేట్ మెంబర్‌షిప్ బిల్లును ప్రవేశపెట్టలేదు.

హాజరుశాతం తక్కువే .. నిధులు మాత్రం వాడారు

హాజరుశాతం తక్కువే .. నిధులు మాత్రం వాడారు

అంతేకాదు సభ హాజరుశాతం కూడా అంతంతమాత్రంగానే హాజరయ్యారు శత్రుఘ్నసిన్హా. మొత్తం ఐదేళ్లలో కేవలం 67 శాతం రోజులు మాత్రమే సభకు హాజరయ్యారు. ఎంపీలు సాధారణంగా 81 శాతం సభకు హాజరుకావాలి. కానీ సిన్హా 67 శాతం హాజరుకావడం గగనమైపోయింది. కానీ తన ఎంపీ ల్యాడ్స్ నిధులను మాత్రం మిగతా సభ్యుల కంటే ఎక్కువగా వాడి రికార్డు సృష్టించారు.

రాజకీయాలు కొత్తేం కాదు కదా ..?

రాజకీయాలు కొత్తేం కాదు కదా ..?

చాన్నాళ్ల క్రితమే శత్రుఘ్న సిన్హా రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పటికే మూడుసార్లు ఎంపీగా కూడా పనిచేశారు. 1996 నుంచి 2008 వరకు రెండుసార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. బీహర్ లోని పాట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి కూడా రెండుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. నాలుగుసార్ల పార్లమెంటరీయన్ గా ఎన్నికైన సిన్హా .. 16వ లోక్ సభలో ప్రశ్నలు సంధించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2002-03లో వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, 2003-04 షిప్పింగ్ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు.

వీరు పార్లమెంటరీయన్స్

వీరు పార్లమెంటరీయన్స్

16వ లోక్ సభకు సంబంధించి ఎన్సీపీ ఎంపీ సుప్రియ సులే 1181 ప్రశ్నలను సభలో అడిగారు. బీజేపీకి చెందిన హీనా విజయ్ 1096 ప్రశ్నలు అడిగి రెండోస్థానంలో నిలిచారు. సమాజ్ వాదీ పార్టీకి చెందిన ధర్మేంద్ర యాదవ్ 1025 ప్రశ్నలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజీవ్ శంకర్ రావు 1015 తన నియోజకవర్గానికి సంబంధించి ప్రశ్నలను అడిగారు.

English summary
Actor-turned-politician Shatrughan Sinha, who is set to quit BJP and join Congress, may have earned many distinctions in his long public life but one feat that he could probably do without is his performance inside the Lok Sabha in the past five years. Records of the Lok Sabha show that between 2014 and 2019, Shatrughan Sinha did not ask a single question, did not participate in any debate, and his score for introducing a private member's bill was also zero. Besides his performance on these fronts, Shatrughan Sinha also fared poorly on attendance. Lok Sabha records show that he was present on only 67 per cent of the days the Lok Sabha was in session.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X