వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియాంకకు పెరుగుతున్న మద్దతు.. కాంగ్రెస్ పగ్గాలు ఆమెకే ఇవ్వాలంటున్న శతృఘ్నసిన్హా

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : రాహుల్ రాజీనామాతో ఖాళీ అయిన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎవరిని ఎంపిక చేస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. కాంగ్రెస్ ప్రెసిడెంటట్ పదవికి ప్రియాంక నియామకానికి మద్దతు రోజురోజుకూ పెరుగుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత నట్వర్ సింగ్ ఆమెకు పార్టీ పగ్గాలు అప్పగించాలన్న అభిప్రాయం వ్యక్తం చేయగా.. ఆ లిస్టులో మరో పేరు చేరింది. తాజాగా కాంగ్రెస్ నేత శతృఘ్న సిన్హా ప్రియాంకను ప్రశంసలతో ముంచెత్తారు.

పార్టీ అత్యున్నత పదవిలో ప్రియాంకగాంధీ ఒదిగిపోతారని శతృఘ్న సిన్హా అభిప్రాయపడ్డారు. సోన్‌భద్ర బాధితులను పరామర్శించే విషయంలో ప్రియాంక చూపిన తెగువ ప్రశంసనీయమని అన్నారు. సమస్యలపై పోరాటంలో ఆమెను మాజీ ప్రధాని ఇందిరా గాంధీతో పోల్చిన ఆయన.. ప్రజల కోసం ప్రియాంక అరెస్టులను సైతం ఆనందంగా స్వాగతించారన్నారు. ఈ ఘటనతో పార్టీని ముందుకు నడపగల సమర్థత ఆమెలో ఉందన్న విషయం స్పష్టమైందని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

Shatrughan Sinha Says Priyanka Gandhi Apt As Party President

కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ సైతం పార్టీ ప్రెసిడెంట్‌గా ప్రియాంక సమర్థురాలని అభిప్రాయపడ్డారు గాంధీయేతర సభ్యులు కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపడితే 24గంటల్లోనే పార్టీ చీలిపోతుందని అన్నారు. అంతకు ముందు లాల్ బహదూర్ శాస్త్రి తనయుడు అనిల్ శాస్త్రి సైతం ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు. పార్టీ ప్రెసిడెంట్ పదవికి ప్రియాంక గాంధీయే సరైన వ్యక్తి అన్న ఆయన.. ఇతరులెవరు ఆ స్థానంలోకి వచ్చినా పార్టీ ముక్కలవుతుందని చెప్పారు.

లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవానికి నైతిక బాధ్యతవహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలన్న అంశంపై సీడబ్ల్యూసీ ఏ నిర్ణయం తీసుకోలేకపోతోంది. గాంధీయేతరులు సైతం కాంగ్రెస్ పగ్గాలు చేపట్టవచ్చన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో పలువురు పార్టీ సీనియర్లు తాము రేసులో ఉన్నట్లు పరోక్షంగా వెల్లడించారు. ఈ క్రమంలో ప్రియాంక అధ్యక్ష పదవికి అర్హురాలంటూ సీనియర్లు ఆమెకు మద్దతుపలకడం విశేషం.

English summary
Congress general secretary Priyanka Gandhi has received lavish praise from party colleague Shatrughan Sinha, who has compared her with former prime minister Indira Gandhi. Mr Sinha also found in her the solution to the Congress's leadership problem as he said Ms Gandhi would be apt as its next chief.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X