వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధిక్కార స్వర ఫలితం : శత్రుఘ్నసిన్హాకు దక్కని టికెట్, పాట్నాసాహిబ్ నుంచి రవిశంకర్ ప్రసాద

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుపట్టిన బీజేపీ నేత శత్రుఘ్నసిన్హా ఆ పార్టీ మొండిచూయి చూపించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ కేటాయించలేదు. 2014లో బీహార్‌లోని పాట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగారు. ఈసారి శత్రుఘ్న సిన్హా స్థానంలో బీజేపీ .. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు టికెట్ కేటాయించింది.

మూడో విడత జాబితాలో మొండిచేయి
బీజేపీ మూడోవిడత జాబితాను ఇవాళ విడుదల చేసింది. ఇందులో బీహార్‌కు 39 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. కానీ అందులో శత్రుఘ్న సిన్హా పేరును లేదు. ఇక్కడినుంచే శత్రుఘ్న సిన్హా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది.

దేశం మిమ్మల్ని క్షమించదు... శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై మోడీ ఆగ్రహందేశం మిమ్మల్ని క్షమించదు... శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై మోడీ ఆగ్రహం

క్యాబినెట్ నుంచి తప్పించడంతో విమర్శలు
2014లో మోదీ సర్కార్ కొలువుదీరాక .. శత్రుఘ్న సిన్హాకు పోర్టు పోలియా దక్కింది. ఆ తర్వాత చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో ఆయన పదవీ ఊడింది. దీంతో ఆయన ప్రధాని మోదీపై బహిరంగంగానే విమర్శలు చేశారు. కానీ ఆయనపై బీజేపీ అధిష్టానం ఎలాంటి క్రమశిక్షణ చర్యలు చేపట్టలేదు. కానీ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం టికెట్ ఇవ్వక, తన వైఖరిని బయటపెట్టినట్లైంది.

Shatrughan Sinha Snubbed, BJP Fields Ravi Shankar Prasad From Patna Sahib

ధిక్కార స్వరం
ఇటీవల పశ్చిమబెంగాల్ లో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నిర్వహించిన విపక్షాల ర్యాలీలో పాల్గొన్నారు శత్రుఘ్న సిన్హా. అక్కడ ఆశేష జనవాహిని ఉద్దేశించి ప్రసంగించారు. వాజ్ పేయి హయాంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లిందని, మోదీ హయాం నియంతకు పరాకాష్ట అని విమర్శలు గుప్పించారు.
English summary
Union Minister Ravi Shankar Prasad will be the BJP's Lok Sabha candidate from Bihar's Patna Sahib, the party announced today, setting the stage for the most high profile clash in the April-May general election, as sitting lawmaker Shatrughan Sinha is likely to contest on a Congress ticket. Mr Sinha, whose criticism of Prime Minister Narendra Modi has grown progressively sharper, didn't figure on the BJP's list of candidates, announced today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X