వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్, బిజెపి కలిసి ప్రభుత్వం: శత్రుఘ్నఆసక్తికర వ్యాఖ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shatrughan Sinha
వాషింగ్టన్: ఎన్నికల అనంతరం కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బిజెపి సీనియర్ నేత శత్రుఘ్న సిన్హా అభిప్రాయపడ్డారు. ఆయన వాషింగ్టన్ పర్యటనలో ఉన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల అనంతరం హంగ్ లోకసభ ఏర్పడితే.. కనీసం ఉమ్మడి కార్యక్రమం ప్రాతిపదికగా కాంగ్రెసు, బిజెపిలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, అప్పుడు ప్రాంతీయ, చిన్న పార్టీల బెదిరింపు రాజకీయాలను కూడా నివారించవచ్చునన్నారు.

బిజెపి - కాంగ్రెసు సంకీర్ణ ప్రభుత్వం ఆలోచన అన్నింటి కన్నా దేశం మిన్న అన్ని బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ విధానానికి అనుగుణంగా ఉంటుందన్నారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని చెప్పారు.

బిజెపి సొంతగా మెజారిటీ సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నదే తన తొలి ఆకాంక్ష అని చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బిజెపి, కాంగ్రెసు నిర్ణయిస్తే కేంద్రంలో బలమైన, స్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుందని, అది తక్షణ అవసరమన్నారు. పలు దేశ ప్రయోజనాలకు సంబంధించిన చాలా విషయాల్లో బిజెపి, కాంగ్రెసుల మధ్య సారూప్యత ఉందన్నారు.

English summary
National interest today demands that Congress and BJP seriously think of forming a coalition government - based on a common minimum programme - after the next general elections, filmstar-turned-politician Shatrughan Sinha has said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X