వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శౌర్యచక్ర అవార్డు గ్రహీత బల్వీందర్ సింగ్ దారుణ హత్య... దుండగుల కాల్పులు...

|
Google Oneindia TeluguNews

శౌర్యచక్ర అవార్డు గ్రహీత బల్వీందర్ సింగ్‌(62)ను శుక్రవారం(అక్టోబర్ 16) ఉదయం గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. బల్వీందర్ తన ఇంటిని ఆనుకుని ఉన్న తన కార్యాలయంలో ఉన్న సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం అదే ద్విచక్రవాహనంపై అక్కడినుంచి పరారయ్యారు. పంజాబ్‌లోని తర్న్ తరన్ జిల్లాలోని భికివింద్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

సైన్యంలో పనిచేసినన్నీ రోజులు బల్వీందర్ సింగ్ ఎన్నో ఏళ్ల పాటు ఉగ్రవాదానికి ఎదురొడ్డి పోరాడారు.చాలా సందర్భాల్లో ఉగ్రవాదుల దాడుల నుంచి తప్పించుకున్నారు. బల్వీందర్ సేవలకు గుర్తింపుగా 1993లో రక్షణ శాఖ ఆయనకు శౌర్యచక్ర అవార్డును ప్రధానం చేసింది.

Shaurya Chakra Awardee Balwinder Singh Shot Dead in Punjab

ఆయన ధైర్య సాహసాలపై ఇప్పటివరకు చాలానే డాక్యుమెంటరీలు కూడా రూపొందాయి. బల్వీందర్ మరణంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

Recommended Video

India-China Stand Off: చైనా.. మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు! - విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

గతేడాది నుంచే ఆయనకు సెక్యూరిటీ నుంచి తొలగించినట్లు బల్వీందర్ బంధువు ఒకరు తెలిపారు. స్థానిక పోలీసుల సిఫారసు మేరకే ప్రభుత్వం ఆయనకు భద్రతను తొలగించిందన్నారు.

English summary
Shaurya Chakra awardee Balwinder Singh was shot dead by unidentified assailants in Punjab’s Tarn Taran district on Friday, police said.The motorcycle-borne miscreants attacked Singh when he was at his office, adjoining his home, in the district’s Bhikhiwind village,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X