• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రధాని మోడీ సోషల్ మీడియా అకౌంట్‌పై తమ జీవితగాథలను పంచుకున్న మహిళలు

|

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ గత సోమవారం చెప్పినట్లుగానే మహిళా దినోత్సవం సందర్భంగా తాను ట్విటర్‌తో పాటు ఇతర సోషల్ మీడియా అకౌంట్స్‌ నుంచి సైన్ ఆఫ్ అయ్యారు.తన సోషల్ మీడియా అకౌంట్స్‌ను మహిళలు హ్యాండిల్ చేస్తారని ప్రధాని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఏడుగురు మహిళలు తమ విజయగాథలను ప్రధాని సోషల్ మీడియా అకౌంట్స్‌పై పంచుకున్నారు.

  3 Minutes 10 Headlines | Holi 2020 | COVID-19| Yes Bank| Northern California Earthquake

  ప్రధాని ట్విటర్‌పై తన కథను పంచుకున్న స్నేహా మోహన్ దాస్

  ప్రధాని మోడీ సోషల్ మీడియా అకౌంట్స్ అయిన ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్స్‌టాగ్రామ్, యూట్యూబ్‌ల నుంచి సైన్ అవుట్ అయ్యాక ఏడుగురు మహిళలు తమ జీవిత ప్రయాణం గురించి ప్రధాని మోడీ సోషల్ మీడియా అకౌంట్స్‌పై షేర్ చేసుకున్నారు. ముందుగా స్నేహా మోహన్‌దాస్ అనే మహిళ తన ప్రయాణంను పంచుకున్నారు. తాను ఫుడ్ బ్యాంక్ వ్యవస్థాపకురాలినని చెప్పుకున్నారు. తాను పేదలకు ఆకలి తీర్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసమే ఫుడ్‌బ్యాంక్ అనే సంస్థను ప్రారంభించినట్లు వెల్లడించారు. తన తల్లి ఇచ్చిన స్ఫూర్తితో దీన్ని ప్రారంభించి అనాథలకు అభాగ్యులకు రోజు ఆహారం పెడతానని చెప్పుకొచ్చారు. భారత్‌లోనే కాకుండా బయట దేశాల్లో కూడా వాలంటీర్ల సహకారంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. మాస్ కుక్కింగ్, కుక్కింగ్ మారథాన్స్, తల్లిపాలపై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించినట్లు చెప్పారు. ఇదే పోస్టులు ప్రధాని ఫేస్‌బుక్ అకౌంట్, ఇన్స్‌టాగ్రామ్ మరియు యూట్యూబ్‌లలో కూడా కనిపించాయి.

   ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించామన్నదే ముఖ్యం

  ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించామన్నదే ముఖ్యం

  ఇక ప్రధాని అకౌంట్‌పై మాళవికా అయ్యర్ అనే మరో మహిళ తన కథను పంచుకున్నారు. జీవితంలో ఓటమి అనేది అంగీకరించకూడదని ఆమె చెప్పారు. 13 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు ఓ బాంబు పేలుడులో తన రెండు చేతులను మాళవికా అయ్యార్ కోల్పోగా... తన రెండు కాళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. జీవితం మన నియంత్రణలో ఉండకపోవచ్చని చెప్పిన మాళవికా... జీవితంలో మనం ఎలా ఉంటామనేది మన నియంత్రణలోనే ఉంటుందని చెప్పారు. చివరకు మనకు ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించామనేదే ముఖ్యమని చెప్పారు. ఇక మరో పారిశ్రామికవేత్త అయిన ఆరిఫా అనే మహిళ కూడా తన గురించి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొచ్చిన ఈ వినూత్న కార్యక్రమం తమలాంటి వారికి ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని చెప్పారు. మహిళలు స్వశక్తితో ఎదగాలని ఆమె పిలుపునిచ్చారు. తను కశ్మీర్‌లో చాలా పాపులర్ అయిన నమ్దా క్రాఫ్ట్స్ తయారు చేస్తున్నట్లు చెప్పారు.

  నీటివనరులను కాపాడుకుందాం

  ఇక ప్రధాని నరేంద్ర మోడీ ట్విటర్ అకౌంట్ నుంచి తాను ట్వీట్ చేస్తానని కలలో కూడా భావించలేదని చెప్పారు వాటర్ వారియర్ కల్పనా రమేష్. అయితే ఏదైనా లక్ష్యం నిర్దేశించుకుని గట్టిగా ప్రయత్నిస్తే విజయం సొంతం అవుతుందన్నారు. నీటివనరుల నిర్వహణను సరిగ్గా చేయగలిగితే సమాజంలో తప్పక మార్పును తీసుకురాగలమన్నారు కల్పనా రమేష్. నీటి వనరులు జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇలాంటి నీటిని వృథా చేయకూడదని చెప్పారు. ఇప్పుడు నీటివనరులను కాపాడుకోకపోతే భవిష్యత్తు తరాలు క్షమించరని చెప్పారు. నీటి వినియోగంను బాధ్యతగా తీసుకుందామని పిలుపునిచ్చారు.

  అంతరించిపోతున్న బంజారా కళలకు ప్రధాని ఊపిరిపోశారు

  మహారాష్ట్రలోని బంజారా సామాజికవర్గంకు చెందిన విజయా పవార్ ఐదవ మహిళగా నిలిచారు. గోర్మతి ఆర్ట్‌ను ప్రమోట్ చేసేందుకు కృషి చేస్తున్న ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు విజయ పవార్. గోర్మతి ఆర్ట్‌‌పై తాను గత రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్నట్లు చెప్పారు. గోర్మతి ఆర్ట్‌ను ప్రోత్సహించడమే కాదు... ఆర్థికంగా కూడా ఆర్ట్‌ను ప్రమోట్ చేసేందుకు ప్రధాని మోడీ నిధులు కూడా విడుదల చేశారని విజయ పవార్ చెప్పారు. అంతరించి పోతున్న ఈ గోర్మతి కళను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు విజయా పవార్ తెలిపారు. మహిళా దినోత్సవరం రోజున ప్రధాని మోడీ ట్విటర్ నుంచి ట్వీట్ చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు.

  English summary
  Seven women from across the country talked about their work and called for a change in the country as they engaged with people from Prime Minister Narendra Modi’s social media accounts on International Women’s Day on Sunday.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X