వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లైంగిక వేధింపులు: అదృశ్యమైన లా విద్యార్థిని ఆచూకీ రాజస్థాన్‌లో లభ్యం, కిడ్నాప్ కాలేదు!

|
Google Oneindia TeluguNews

లక్నో: బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి స్వామి చిన్మయానందపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి వారం రోజులుగా అదృశ్యమైన యువతి ఆచూకీ లభ్యమైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్‌పూర్‌లో కనిపించకుండా పోయిన ఈ లా విద్యార్థినిని రాజస్థాన్‌లో గుర్తించామని యూపీ డీజీపీ ఓపీ సింగ్ తెలిపారు.

ఫేక్ న్యూస్ నమ్మొద్దంటూ ఐటీ శాఖ: ఐటీ రిటర్న్స్ దాఖలుకు రేపే ఆఖరు తేదీ ఫేక్ న్యూస్ నమ్మొద్దంటూ ఐటీ శాఖ: ఐటీ రిటర్న్స్ దాఖలుకు రేపే ఆఖరు తేదీ

ఆ యువతితోపాటు ఆమె స్నేహితురాలు కూడా ఉందని, ఆమె ఇష్టం ప్రకారం ఇంటి నుంచి నుంచి వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని చెప్పారు. ఇది ఇలా ఉండగా, ఆ యువతిని తమ ముందు ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టు పోలీసులను ఆదేశించింది.

Shes Safe, Wasnt Kidnapped: UP Police On Woman Found After 6 Days

యువతి ఆచూకీ దొరికిందని, ఆమె ఇప్పుడు క్షేమంగానే ఉందని పోలీసులు తెలిపారు.
షాజహాన్‌పూర్‌కు చెందిన ఈ లా విద్యార్థిని స్వామి చిన్మయానందపై లైంగిక వేధింపులు చేశారు. ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోయారు. దీంతో ఆమెను చిన్మయానందే కిడ్నాప్ చేయించారని ప్రచారం జరిగింది.

కాగా, సంత్ సమాజ్‌కు చెందిన ఓ పెద్దాయన చాలా మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడని, తనను కూడా హత్య చేయడానికి ప్రయత్నించారని ఆరోపించింది. అంతేగాక, తనను కాపాడాలంటూ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోడీని ఆ వీడియోలో కోరింది. ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోవడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో చిన్మయానందపై కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆయన ఆశ్రమంలో సోదాలు నిర్వహించారు. అక్కడ ఆ యువతి లభించకపోవడంతో ఆమె కోసం గాలింపు చేపట్టారు. చివరకు ఆమెను రాజస్థాన్ రాష్ట్రంలో గుర్తించారు. యువతి క్షేమంగా ఉందని పోలీసులు చెప్పడంతో ఆమెను తమ ముందు హాజరు పర్చాలంటూ సుప్రీంకోర్టు పోలీసులను ఆదేశించింది.

రాజస్థాన్ నుంచి పోలీసులు ఆ యువతిని షాజహాన్‌పూర్ తీసుకొచ్చిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇది ఇలావుంటే, ఆ యువతి తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని చిన్మయానంద ఆరోపించారు. రూ. 5కోట్లు డిమాండ్ చేస్తోందని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ యువతిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

English summary
A 23-year-old woman, missing for nearly a week from Uttar Pradesh's Shahjahanpur, has been found in Rajasthan, the police said today, on a day the Supreme Court took up her case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X