• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దళితుల్ని మనుషులుగా చూడరు - ఇది సిగ్గుపడాల్సిన వాస్తవం - రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

|

ఎన్‌కౌంటర్లలో చనిపోయిన ఉగ్రవాదులు, ఉరిశిక్ష పడిన ఖైదీల మృతదేహాలను సైతం సొంత కుటుంబీకులకు అప్పగించడం రివాజు. కానీ హాథ్రస్ గ్యాంగ్ రేప్ ఘటనలో మాత్రం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరించడం, కుటుంబీకులు లేకుండానే, బాధిత యువతి మృతదేహాన్ని రాత్రికి రాత్రే కాల్చేసి, మరుసటి రోజు నుంచి 'అసలు రేప్ జరగనేలేదు..' అని కొత్త వాదన తెరపైకి తేవడం వివాదాస్పదమైంది. బాదితురాలు, ఆమె కుటుంబం పట్ల యూపీ సర్కారు ఇంత దారుణంగా వ్యవహరించడానికి గల కారణాలను విశ్లేషిస్తూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు ఆయువుపట్టుపై దాడి - జస్టిస్ ఎన్వీ రమణపై జగన్ సంచలనం -ప్రధాని మోదీని కలిసిన రోజే

రాహుల్ ఆక్రోశం

రాహుల్ ఆక్రోశం

ఉత్తరప్రదేశ్ లోని హాథ్రస్ జిల్లా బుల్ గడీ గ్రామంలో 19 ఏళ్ల దళిత యువతిపై అదే గ్రామానికి చెందిన అగ్రకులాల యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమెపై శాచిక దాడి చేయడం, సరైన చికిత్స అందక ఆమె గత నెల 29న చనిపోవడం, రాత్రికి రాత్రే పోలీసులు మృతదేహాన్ని తగులబెట్టడం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు చెలరేగగా, ఈ దాష్టీకాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. బాధితురాలు స్వయంగా తన పట్ల జరిగిన అకృత్యంపై సాక్ష్యం చెప్పినా, అక్కడేమీ జరగలేదన్నట్లు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి, ఆ రాష్ట్ర పోలీసులు, అధికారులు చెబుతుండటంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆక్రోశం వెళ్లగక్కారు.

ఇదీ వాస్తవం..

ఇదీ వాస్తవం..

మన దేశంలో చాలా మంది.. దళితులు, ఆదివాసీలు, ముస్లింలను అసలు మనుషులుగా పరిగణించడంలేదని, ఇది కచ్చితంగా సిగ్గుపడాల్సిన వాస్తవం అని రాహుల్ గాంధీ అన్నారు. హాథ్రస్ బాధితురాలు దళిత కుటుంబానికి చెందినది కావడం వల్లే ఆమె ఎవరికీ పట్టనిదిగా ఉందన్నారు. ‘‘బాధితురాలే స్వయంగా తనపై అత్యాచారం జరిగిందని చెబితే.. పోలీసులు మాత్రం అత్యాచారం జరగలేదని ఎందుకు చెబుతున్నారు. అత్యాచారానికి గురైంది దళిత యువతి కాబట్టి ఆమెను ఎవరూ లెక్కచేయడంలేదు. మన దేశంలో చాలా మంది.. దళితులు, గిరిజనులు, ముస్లింలను అసలు మనుషులుగా చూడరు'' అని కాంగ్రెస్ నేత ఆవేదన వెలిబుచ్చారు.

అనంతపురం కలెక్టర్‌గా ఇంటర్ విద్యార్థిని - ‘బాలికే భవిష్యత్' అంటోన్న గంధం చంద్రుడు -దేశంలోనే వినూత్నం

  Hathras ఘటన కోసం ఇంత రాద్ధాంతం ఎందుకు : BJP State Mahila Morcha President Geeta Murthy
  నిందితులకు అండదండలు..

  నిందితులకు అండదండలు..

  హాథ్రస్ గ్యాంగ్ రేస్ కేసులో మృతురాలి శవాన్ని తగుల బెట్టిందేకాక, ఐదు రోజులపాటు మీడియాను గ్రామంలోకి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడం, బాధిత కుటుంబాన్ని స్వయంగా జిల్లా కలెక్టర్ బెదిరిస్తున్న వీడియో బయటకి రావడం సంచలనం రేపాయి. ఇది చాలదన్నట్లు, హత్యాచారంతో తమకు సంబంధం లేదంటూ జైలులో ఉన్న నలుగురు నిందితులూ ఓ లేఖ రాయడం, యువతి తల్లి, సోదరులే ఆమెను చంపేశారని రివర్స్ లో ఆరోపణలు చేయడం కీలకంగా మారింది. అధికారుల అండదండలతోనే సదరు లేఖ బహిర్గతమైనట్లు తెలుస్తోంది. నిందితులకు మద్దతుగా బీజేపీ నేతల సమక్షంలో అగ్ర కులాలు పంచాయితీలు నిర్వహించడం, తమ వాళ్లను కాపాడుకుంటామని తీర్మానాలు చేయడం లాంటి పరిణామాల నేపథ్యంలో బాధితురాలి కుటుంబానికి సరైన న్యాయం దక్కుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  English summary
  Congress leader Rahul Gandhi on Sunday attacked the Yogi Adityanath dispensation over the death of a Dalit woman from Uttar Pradesh’s Hathras after being allegedly gang-raped, saying the chief minister and his police say no one was raped because for them and many other Indians, she was ”no one”. In a tweet, Gandhi said the shameful truth is many Indians do not consider Dalits, Muslims and tribals to be human.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X