వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధికార లాంఛనాలతో షీలా దీక్షిత్ అంత్యక్రియలు.. తుది వీడ్కోలు పలికిన సోనియా, షా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో ముగిశాయి. హితులు, సన్నిహితులు, కోలిగ్స్ తమ నేతకు తుది వీడ్కోలు పలికారు. నిన్న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ షీలా దీక్షిత్ చనిపోయిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె .. గుండెపోటుతో మృతిచెందారు. దీక్షిత్ మృతిపై పార్టీలకతీతంగా నేతలు సంతాపం తెలిపారు. అంతిమయాత్రలో కూడా పాల్గొన్నారు.

తుది వీడ్కోలు ..
ఆస్పత్రిలో చనిపోయాక ఢిల్లీలోని తూర్పు నిజాముద్దీన్‌లో గల నివాసానికి ఆమె భౌతిక కాయాన్ని తరలించారు. ఇవాళ ఉదయం ఇంటివద్ద షీలా దీక్షిత్ పార్ధీద దేహం వద్ద నేతలు నివాళులర్పించారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా, బీజేపీ నేతలు సుష్మ స్వరాజ్, ఎల్కే అద్వానీ, సీపీఐ నేత డీ రాజా అంజలి ఘటించారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి భౌతిక కాయాన్ని తరలించారు. అక్కడ నేతలు షీలా .. భౌతికకాయానికి నివాళులర్పించారు.

Sheila Dikshit cremated with full state honours

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి నిజామ్‌బోధ్ ఘాట్ వద్దకు షీలా దీక్షిత్ అంతిమ యాత్ర కొసాగింది. షీలా పార్థీదదేహం ఉంచిన వ్యానున తెల్లని మల్లెపూలతో అలంకరించారు. నేతలు, అభిమానులు వెంట రాగా షీలా దీక్షిత్ అంతిమ యాత్ర జరిగింది. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంతక్రియల్లో యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ, ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ భాఘాల్, మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్, ఢిల్లీ సీఎం అరంవిద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇతర నేతలు పాల్గొన్నారు. 1998 నుంచి 2013 వరకు వరుసగా మూడుసార్లు ఢిల్లీ సీఎంగా పనిచేశారు షీలా దీక్షిత్. ఆమె హయాంలోనే ఢిల్లీ గణనీయమైన అభివృద్ధి చెందింది. మౌలిక వసతుల కల్పన, రహదారులు నిర్మాణం, ఫ్లై ఓవర్లు నిర్మించి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించారు.

English summary
Former Delhi chief minister Sheila Dikshit was on Sunday cremated with full state honours at the national capital's oldest cremation ground, Nigambodh Ghat. As per her wish, the Congress leader was laid to rest using the CNG method. Hundreds joined in for the Congress stalwart's last journey from the party headquarters to Nigambodh Ghat. With her smiling photograph in front, a truck decorated with white flowers carried her mortal remains as supporters bid a tearful adieu to their leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X