వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హస్తినలో నీరు, కరెంట్ కష్టాలు .. సమస్య తీర్చాలని కేజ్రీతో షీలా డిమాండ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : భానుడి భగ భగలు ఇంకా తగ్గలేదు. దీంతో కొన్నిప్రాంతాల్లో నీటి కొరత మరింత ఎక్కువైంది. ఇక రాజధాని నగరం ఢిల్లీలో నీటితోపాటు కరెంట్ కష్టాలు కూడా ఉన్నాయి. విద్యుత్ సరఫరా చేస్తున్నారు .. కానీ ... చార్జీలు పెంచడంతో హస్తనగరి వామ్మో అంటున్నాడు. ఈ నేపథ్యంలో చార్జీల పెంపుపై పునరాలోచించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దృష్టికి తీసుకొచ్చారు మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్.

నీటి కట కట
ఢిల్లీలో మంచినీటి కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. నీటి కటకట కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆరాతీశారు షీలా దీక్షిత్. ఇవాళ ఢిల్లీలో కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజధాని నగర ప్రజలను కరెంట్, మంచినీటి కష్టాలు ఎక్కువయ్యాయని వివరించారు. అంతేకాదు కరెంట్ బిల్లుపై ఫిక్స్‌డ్ చార్జీ వెనక్కి తీసుకోవాలని షీలా దీక్షిత్ డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై అరవింద్ కేజ్రీవాల్ కూడా సానుకూలంగా స్పందించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో కన్నా చార్జీలు తగ్గిస్తానని షీలా దీక్షిత్‌కు హామీనిచ్చినట్టు సమాచారం.

Sheila Dikshit meets Arvind Kejriwal over power, water woes in Delhi

మారిన స్వరం ..
సమావేశం ముగిసాక ఆప్ ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో సమస్యలను సీఎం కేజ్రీవాల్ దృష్టికి షీలాదీక్షిత్ తీసుకొచ్చారని పేర్కొన్నారు. వారు అడిగిన ప్రశ్నలకు సీఎం కేజ్రీవాల్ సమాధానం ఇచ్చారని తెలిపారు. ఈ సమావేశంలో చార్జీల తగ్గింపు, యాథాతథ స్థితి గురించి స్పస్టమైన హామీని కేజ్రీవాల్ ఇవ్వలేదని చెప్పారు.

దీంతో గంటల వ్యవధిలోనే కాంగ్రెస్, ఆప్ నేతల మాటల్లో తేడా కనిపిస్తోంది. అయితే ప్రజలు పడుతున్న ఇబ్బందులపై కేజ్రీవాల్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. మంచినీరు ప్రజలకు కేటాయించాల్సి ఉంది. అలాగే విద్యుత్ చార్జీ ఫిక్స్‌డ్ చార్జీ వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి షీలా దీక్షిత్ ప్రతిపాదన కూడా జనం బాగుకోరి చేశారని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

English summary
Delhi Congress chief Sheila Dikshit Wednesday met Chief Minister Arvind Kejriwal over the power and water woes being faced by the people in the city. A Delhi Congress delegation, led by the former Delhi chief minister, met Kejriwal at his Flagstaff Road residence here. “Dikshit raised the power and water crisis faced by people during the meeting with the chief minister and demanded withdrawal of fixed charge hike in electricity bills,” Delhi Congress working president Haroon Yusuf said after the meeting. The chief minister assured that the fixed charges will be brought to the previous lower rates, he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X