వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎట్టకేలకు కేరళ గవర్నర్ షీలా దీక్షిత్ రాజీనామా

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేరళ గవర్నర్ షీలా దీక్షిత్ రాజీనామా చేశారు. రెండు రోజుల క్రితం ఆమె ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను కలిసిన సందర్బంలో రాజీనామా వార్తలను తోసిపుచ్చిన ఆమె.. మంగళవారం రాజీనామా చేశారు.

గతంలో న్యూఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్ ఈ ఏడాది యుపీఎ ప్రభుత్వ హాయాంలో కేరళ గవర్నర్‌గా నియమితులయ్యారు. మూడుసార్లు ఢిల్లీ సిఎంగా పని చేసిన 75 ఏళ్ల షీలా దీక్షిత్ మూడు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఆమె ఓడిపోయారు.

Sheila Dikshit resigns as Kerala Governo

షీలా దీక్షిత్ 1998 నుండి 2013 వరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పని చేశారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మాత్రం కేజ్రీవాల్ చేతిలో ఇరవై వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. షీలా 1984 నుండి 1989 వరకు ఉత్తర ప్రదేశ్‌లోని కన్నౌజ్ నియోజకవర్గం నుండి ఎంపీగా ఉన్నారు.

షీలా దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె అధికార దుర్వినియాగానికి పాల్పడ్డారంటూ ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆమె బంగ్లాలో ఏర్పాటు చేసిన రకరకాల ఎలక్ట్రిక్ పరికరాల్లో 31 ఏసీలు, 25 హీటర్లు ఉన్నాయి. మోలీలాల్ నెహ్రూ మార్గ్‌లోని షీలా నివాసంలో కనీసం 31 ఏసీలు, 15 కూలర్లు, 25 హీటర్లు, 16 ఎయిర్ ప్యూరిఫైయర్లు, 12 గీజర్లు ఉన్నాయని సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ఒక వివరణ ఇచ్చారు.

English summary
Kerala Governor Sheila Dikshit has resigned.In Delhi yesterday, Ms Dikshit had met Home Minister Rajnath Singh and President Pranab Mukherjee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X