• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఐపీఎల్ మెడకూ డ్రగ్స్ ఉచ్చు: బాత్‌రూంలో క్రికెటర్ల భార్యలు: సెక్స్ బాంబ్ షెర్లిన్ హాట్ కామెంట్స్

|

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెత్ కేస్.. మరిన్ని మిస్టరీలను సృష్టిస్తోంది. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ జరుపుతున్న కొద్దీ దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టాప్ హీరోయిన్ల పేర్లు డ్రగ్స్ రాకెట్‌లో ఉన్నట్లు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యురో అధికారులు చెబుతున్నారు. ఒక్కోరోజు ఒక్కో ట్విస్ట్ తీసుకుంటోందీ ఉదంతం. ఏ మాత్రం ఊహకు అందని విధంగా కొత్త కొత్త పేర్లు డ్రగ్స్ రాకెట్‌లో బహిర్గతమౌతున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సన్నిహితురాలు రియా చక్రవర్తిని విచారిస్తోన్న కొద్దీ మరింత లోతుకు వెళ్తోనే ఉందీ వ్యవహారం.

ఐపీఎల్ మెడకూ..

ఐపీఎల్ మెడకూ..

దీపికా పడుకొణె, రకుల్ ప్రీత్‌సింగ్, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ వంటి టాప్ హీరోయిన్ల ప్రమేయం ఉన్నట్లు ఇప్పటికే వెల్లడైంది. తాజాగా- ఈ డ్రగ్స్ రాకెట్ వ్యవహారం క్రమంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెడకూ చుట్టుకునే అవకాశాలు ఏ మాత్రం లేకపోలేదు. డ్రగ్స్ స్వీకరించిన వారిలో కొందరు క్రికెటర్ల భార్యలూ ఉన్నారని, డ్రగ్స్ పాపంలో వారికీ భాగస్వామ్యం ఉందటూ వార్తలు వెలువడుతున్నాయి. ఈ వార్తలు రావడానికి ప్రధాన కారణం- బాలీవుడ్ సెక్స్ బాంబ్ షెర్లిన్ చోప్రా. క్రికెటర్ల భార్యలు కొకైన్ తీసుకున్నారనడానికి తానే ప్రత్యక్ష సాక్షినని బాంబు పేల్చారు. దీనితో ఈ వ్యవహారం మొత్తం మరో కీలక, అనూహ్య మలుపును తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

కోల్‌కత నైట్ రైడర్స్‌పై

కోల్‌కత నైట్ రైడర్స్‌పై

ఓ జాతీయ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రత్యేకించి- కోల్‌కత నైట్ రైడర్స్ టీమ్‌పై ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ తరఫున ఆడుతోన్న కొందరు క్రికెటర్ల భార్యలు కొకైన్ సేవించారని, దీన్ని తాను కళ్లారా చూశానని చెప్పారు. ఆ క్రికెటర్లు ఎవరనే విషయాన్ని వెల్లడించడానికి షెర్లిన్ చోప్రా నిరాకరించారు. దర్యాప్తు చేస్తేనే.. తాను వారి పేర్లను బయటపెడతాననీ అన్నారు. కొంతమంది బాలీవుడ్ నటుల భార్యలు కూడా వారితో కలిశారని తెలిపారు. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, జుహీచావ్లా కోల్‌కత నైట్ రైడర్స్ ఫ్రాంఛైజీలుగా ఉన్న విషయం తెలిసిందే.

బాత్‌రూమ్‌లో కొకైన్..

బాత్‌రూమ్‌లో కొకైన్..

ఐపీఎల్ సీజన్ కొనసాగుతోన్న సమయంలో నిర్వాహకులు ఇచ్చిన ఓ పార్టీకి తాను హాజరు అయ్యానని, ఆ సందర్భంగా కోల్‌కత నైట్ రైడర్స్ టీమ్ క్రికెటర్ల భార్యలు బాత్‌రూమ్‌లో కొకైన్‌ను పీల్చుతూ కనిపించారని షెర్లిన్ తెలిపారు. కోల్‌కత నైట్ రైడర్స్ మ్యాచ్ ముగిసిన అనంతరం ఈ పార్టీని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. కేకేఆర్ మ్యాచ్‌ను చూడటానికి తాను కోల్‌కత వెళ్లానని, మ్యాచ్ ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన పార్టీకి తనను నిర్వాహకులు ఆహ్వానించారని ఆ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

 నన్ను చూసి నవ్వారు..

నన్ను చూసి నవ్వారు..

ఈ పార్టీ కొనసాగుతోన్న సమయంలో తాను వాష్‌రూమ్‌కు వెళ్లగా.. అక్కడ కోల్‌కత నైట్ రైడర్స్ స్టార్ క్రికెటర్ల భార్యలు కొకైన్ పీల్చుతూ కనిపించారని స్పష్టం చేశారు. వాష్‌రూమ్‌కు వెళ్లిన తనను చూసి వారంతా పలకరింపుగా నవ్వారని, తానూ వారికి అదే స్థాయిలో బదులు ఇచ్చి, వెంటనే వెనక్కి వచ్చేశానని అన్నారు. రాంగ్ టైమ్‌లో, రాంగ్ ప్లేస్‌కు వెళ్లినట్లుగా తనకు అనిపించిందని షెర్లిన్ చోప్రా పేర్కొన్నారు. బాలీవుడ్‌లో తరచూ ఇలాంటి పార్టీలు నడుస్తుంటాయని, ఇందులో క్రికెటర్ల భార్యలకు ప్రమేయం ఉందనే విషయం తనను దిగ్భ్రాంతికి గురి చేస్తోందని చెప్పారు.

English summary
Bllywood actress Sherlyn Chopra has stated that she has seen popular star-wives of cricketers and actors snorting cocaine in washroom during one of IPL parties that she attended. Her comments have come as the authorities are probing the drugs angle linked to the Sushant Singh Rajput investigation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X