వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షిగోలా వైరస్ కలకలం.. కేరళలో 11 ఏళ్ల బాలిక మృతి.. మరో ఆరుగురికి సోకిన రక్కసి..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ పేరు చెబితేనే ప్రపంచం వణికిపోతోంది. తర్వాత ఇతర వైరస్ కూడా వ్యాపిస్తున్నాయి. కేరళలో షిగోలా వైరస్ బయటకొచ్చింది. రక్కిసి ఒక చిన్నారిని కబలించింది. మరో ఆరుగురికి షిగోలా సోకిందని కేరళ ప్రభుత్వం స్పష్టంచేసింది. మిగతా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏ చిన్న అనుమానం వచ్చిన వైద్యులను సంప్రదించాలని కోరింది.

ఉత్తర కేరళలో షిగోలా వైరస్ వ్యాప్తిచెందుతోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేరళ ఆరోగ్యమంత్రి కే కే శైలజ సూచించారు. కాలీకట్ జిల్లాలో 11 ఏళ్ల బాలిక షిగోలా వైరస్ వల్ల మృతి చెందిందని తెలిపారు. షిగోలా వైరస్ వ్యాప్తి చెందుతుంటుందని.. ప్రజలు మరింత అలర్ట్‌గా ఉండాలని కోరారు. వైరస్ సోకినపుడు డయేరియా లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు.

Shigella outbreak in Kerala claims life of 11-year-old..

రాష్ట్రంలో షిగోలా వైరస్ రిపోర్టు తొలిసారిగా వచ్చిందని శైలజ తెలిపారు. వైరస్ కలుషిత నీటి కారణంగా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. అందుకే ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలన్నారు. అలాగే అందరూ పరిశుభ్రత పాటించాలని కోరారు.

జిల్లాలో 56 డయేరియా కేసులు నమోదయ్యాయని, వాటిలో ఆరు షిగోలా వైరస్ కేసులను గుర్తించామని కోజికోడ్ జిల్లా మెడికల్ అధికారి తెలిపారు. వీరిని కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారని, వీరిలో కొందరు కోలుకోగా డిశ్చార్జ్ చేశామన్నారు. మిగిలిన బాధితులలో ఎవరికీ తీవ్ర అస్వస్థత లేదని చెప్పారు.

English summary
death of an 11-year-old in the state's Calicut district, Kerala Health Minister KK Shailaja has appealed to the general public to maintain caution about Shigella.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X