వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రేజీ న్యూస్!, ఛాలెంజ్ చేస్తున్నా: కేసుపై ట్విట్టర్లో స్పందించిన శిల్పాశెట్టి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

కోల్‌కత్తా: తమ నుంచి రూ. 9 కోట్లు తీసుకుని తిరిగి చెల్లించలేదంటూ ఎంకే మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధ ఫిర్యాదు చేయడం, కోల్‌కత్తా పోలీసులు కేసు నమోదు చేయడపై బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ట్విట్టర్‌లో స్పందించింది.

"క్రేజీ న్యూస్! మనోజ్ జైన్ (ఎంకే మీడియా బోర్డ్ డైరెక్టర్) చేస్తున్న వ్యాఖ్యలపై నేను ఛాలెంజ్ చేస్తున్నా. తను (జైన్) చేసిన వ్యాఖ్యలు నేను కష్టపడి సంపాదించుకున్న పాపూలారిటీని నిర్వీర్యం చేయాలని చూస్తున్నట్లుగా ఉంది. కేసుకు సంబంధించి న్యాయసలహా కోరుతున్నాం. అతనో డిఫాల్టర్, మెసగాడిని క్లియర్‌గా తెలుస్తోంది. ఇలాంటి వాటి పట్ల చాలా అసహ్యాంగా ఉంది" అని శిల్పాశెట్టి ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

ఇక ఆమె భర్త రాజ్ కుంద్రా కూడా ఎంకే మీడియా చేసిన ఆరోపణలపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. ఇక ఆదివారం కోల్‌కత్తా పోలీసులు శిల్పాశెట్టి, భర్త రాజ్ కుంద్రాపై కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. శిల్పా అండ్ రిపు సుదన్ కుంద్రా ఆఫ్ ఎస్సెన్షీయల్ స్టోర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని శిల్పా నడుపుతోంది. ఈ సంస్ధలో తాము పెట్టుబడులు పెట్టి మోసపోయామని ఎంకే మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధ అదనపు డైరెక్టర్ దేబసిస్ గుహ కేసు పెట్టారు.

 Shilpa Shetty, Accused of Fraud, 'Dares' Kolkata Man to Prove Allegation

దీంతో పోలీసులు శిల్పా, ఆమె సంస్ధపై నమ్మక ద్రోహం, మోసం, ఉద్దేశపూర్వక కుట్రతదితరమైనవి పేర్కొంటూ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. శిల్పాశెట్టి నడుపుతున్న కంపెనీలో రూ. 9 కోట్లు పెట్టుబడులు పెట్టామని, తిరిగి వాటిని చెల్లించకుండా ఆమె మోసం చేసిందని బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

అంతే కాకుండా, రెండేళ్లలో పదింతలు తిరిగిస్తామని పెట్టుబడులు పెట్టించి అనంతరం పట్టించుకోవడం మానేశారని, మోసం చేశారని సదరు సంస్ధ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రూ. 9 కోట్ల పెట్టుబడుల్లో భాగంగా శిల్పాశెట్టి కంపెనీ కేటాయించిన రూ. 30 లక్షల ఈక్వీటీ షేర్లు బోగస్ అని తేలినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

English summary
Bollywood actress Shilpa Shetty has dismissed accusations of "fraudulently inducing" a company in Kolkata to invest a sum of Rs 9 crores in a company run by her. In a furious outburst on Twitter, the actress accused Manoj Jain, chairman of the Kolkata-based company, of seeking fame at the cost of her reputation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X