వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్‌కు మరో దారిలేదు: షిండే, టి బిల్లుపై కేజ్రీవాల్ ఇలా

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు పార్టీకి, ముఖ్యమంత్రి పదవికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేయడంపై కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే బుధవారం స్పందించారు. కిరణ్ మొదటి నుండి రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారని, రాజీనామా చేయడం మినహా ఆయనకు మరో దారి లేదన్నారు.

తెలంగాణ బిల్లుపై అరవింద్ కేజ్రీవాల్

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు)కు లోకసభ ఆమోదం తెలిపిన తీరుపై ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వేరుగా స్పందించారు.

Shinde on Kiran's resignation

తెలంగాణ బిల్లు ఆమోదం విషయంలో అధికార కాంగ్రెసు, ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీలు కుమ్మక్కు అయ్యాయన్నార. లోకసభ ప్రత్యక్ష ప్రసారాలను ఆపి బిల్లు ఆమోదానికి పరస్పరం బిజెపి, కాంగ్రెసు సహకరించుకున్నాయని ఆరోపించారు.

కాంగ్రెసు ఉచ్చులో చిక్కుకునే బిజెపి తెలంగాణ ముసాయిదా బిల్లుకు మద్దతు తెలిపిందన్నారు. అపవిత్ర అవగాహనతో కాంగ్రెసు, బిజెపిలు పారదర్శకతకు పాతరేసేందుకే ప్రజలు ఓట్లేసి గెలిపించారా అని ప్రశ్నించారు.

లగడపాటి రాజీనామా ఆమోదం

విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ రాజీనామాను లోకసభ స్పీకర్ మీరా కుమార్ ఆమోదించారు. ఈ విషయంలో సభలో ఈ రోజు స్పీకర్ చదవి వినిపించారు.

English summary
Union Minister Sushil Kumar Shinde on Wednesday responded on Chief Minister Kiran Kumar Reddy's resignation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X