వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్ లో అడుగుపెట్టిన జపాన్ ప్రధాని.. సాదర స్వాగతం పలికిన మోడీ

జ‌పాన్ ప్ర‌ధాని షింజో అబె రెండు రోజుల గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న కోసం అహ్మ‌దాబాద్ చేరుకున్నారు. ప్ర‌త్యేక విమానంలో స‌తీమ‌ణితో క‌లిసి వ‌చ్చిన అబెకు ప్ర‌ధాని మోడీ స్వ‌యంగా స్వాగ‌తం ప‌లికారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌: జ‌పాన్ ప్ర‌ధాని షింజో అబె రెండు రోజుల గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న కోసం అహ్మ‌దాబాద్ చేరుకున్నారు. ప్ర‌త్యేక విమానంలో స‌తీమ‌ణితో క‌లిసి వ‌చ్చిన అబెకు ప్ర‌ధాని మోడీ స్వ‌యంగా స్వాగ‌తం ప‌లికారు.

విమానం దిగ‌గానే అబెను ఆత్మీయంగా ఆలింగ‌నం చేసుకున్నారు మోడీ. ఇద్ద‌రు నేత‌లు అక్క‌డి నుంచి నేరుగా రోడ్ షో నిర్వ‌హించి మహాత్మాగాంధీ స‌బ‌ర్మతి ఆశ్ర‌మానికి వెళ్లారు . జపాన్ ప్రధాని షింజో అబెకు 9 కిలోమీట‌ర్ల మేర రోడ్డుకు ఇరువైపులా వేలాది మంది స్వాగ‌తం ప‌లికారు.

డ‌ప్పులు, నృత్యాల‌తో సాంప్ర‌దాయ రీతిలో ఇరు దేశాల ప్ర‌ధానుల‌ను గ్రీట్ చేశారు. స‌బ‌ర్మ‌తి ఆశ్ర‌మంలో ఉన్న గాంధీ విగ్ర‌హానికి నివాళుల‌ర్పించారు. ఆ త‌ర్వాత ఆశ్ర‌మ విశేషాల‌ను మోడీ.. అబెకు వివ‌రించారు.

విమానం దిగే స‌మ‌యంలో సూట్ వేసుకొని క‌నిపించిన అబె.. ఓపెన్ టాప్ జీపులో మాత్రం భార‌త సాంప్ర‌దాయ కుర్తాలో క‌నిపించ‌డం విశేషం. అబె ఇండియాకు రావ‌డం ఇది నాలుగోసారి. మోడీ ఇవాళ రాత్రి అబెకు ప్ర‌త్యేక విందు ఏర్పాటుచేశారు.

త‌న ఫేవ‌రెట్ వంట‌కాల‌తో జ‌పాన్ ప్ర‌ధానికి విందు ఇవ్వ‌నున్నారు. రేపు షింజో అబె ఇండియా తొలి బుల్లెట్ రైలుకు శంకుస్థాప‌న చేయ‌నున్నారు. జ‌పాన్ సాయంతో రానున్న‌ ఈ బుల్లెట్ రైలు ముంబై, అహ్మ‌దాబాద్ మ‌ధ్య ప‌రుగులు తీయ‌నుంది.

English summary
Japanese Prime Minister Shinzo Abe today arrived in Ahmedabad on a two-day visit to India. He was received at the airport by Prime Minister Narendra Modi with his characteristic hug. Tomorrow, Abe and Modi will lay the foundation stone for India's first bullet train project between Ahmedabad and Mumbai. The 12th Indo-Japan annual Summit meeting at Gandhinagar is also lined up for tomorrow. Shinzo Abe, who is accompanied by his wife Akie Abe, has a hectic schedule for the next two days in Modi's home state, including laying of the foundation stone for India's first bullet train, to be run between Ahmedabad and Mumbai, and to attend the 12th Indo-Japan Summit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X