• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రేపట్నుంచి షిరిడీ ఆలయం మూసివేత..!! సాయి జన్మభూమిపై రాజకీయ వివాదం: సీఎం ప్రకటనకు నిరసనగా..!

|

మహారాష్ట్ర రాజకీయలు ఇప్పుడు షిర్డీని తాకాయి. తాజాగా అక్కడ రాజకీయంగా సాయి జన్మభూమి వివాదం మొదలైంది. సాయిబాబా జన్మస్థలం పర్భణీ జిల్లాకు చెందిన 'పాథ్రీ' అని స్థానికులు భావిస్తూ 1999లో శ్రీ సాయి జన్మస్థాన్‌ మందిరాన్ని నిర్మించారు. వేల సంఖ్యలో భక్తులు అక్కడికి వస్తుండడంతో ఆ పట్టణం అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేయనున్నట్టు ఇటీవల ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటించారు. దీనిపైన బీజేపీ విభేదిస్తోంది. జన్మభూమి కంటే కర్మభూమి గొప్పదని వాదిస్తోంది. ఇదే సమయంలో సీఎం ప్రకటనకు నిరసనగా జనవరి 19వ తేదీ ఆదివారం నుంచి షిరిడీలోని సాయిబాబా ఆలయాన్ని నిరవధికంగా మూసి వేయనున్నట్లు సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ ప్రకటించింది. ఈ మేరకు ట్రస్ట్‌ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తదుపరి కార్యాచరణపై చర్చించడానికి శనివారం సాయంత్రం షిరిడీ గ్రామస్థులంతా సమావేశం కానున్నట్లు స్పష్టం చేసింది.

 వివాదం ఏంటి...

వివాదం ఏంటి...

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉద్ధవ్‌ ఠాక్రే ఇటీవల పర్భణీ జిల్లాలో అభివృద్ధి పనులపై చర్చించారు. జిల్లాలోని ‘పత్రి'ని సాయిబాబా జన్మస్థలంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందుకు రూ.100 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. దీని పైన షిర్డీలోని సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్రిని అభివృద్ధి చేస్తే షిర్డీ ప్రాముఖ్యం తగ్గిపోతుందని ఆందోళన వెలిబుచ్చింది.సాయిబాబా జన్మించిన స్థలం పాథ్రీ అని నిరూపించడానికి తగినన్ని ఆధారాలు ఉన్నాయని ఆ పట్టణవాసి అయిన ఎన్‌సీపీ ఎమ్మెల్యే దుర్రానీ అబ్దుల్లా ఖాన్‌ చెప్పారు. పాథ్రీయే సాయినాథుని జన్మస్థానమన్న అభిప్రాయాన్ని గతంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా సమ్మతించారన్నారు. అహ్మద్‌నగర్‌ జిల్లాలోని శిరిడీ.. సాయిబాబా ‘కర్మ భూమి' అయితే పాథ్రీ ఆయన ‘జన్మభూమి' అని అన్నారు. పాథ్రీకి ప్రాధాన్యం లభిస్తే తమ క్షేత్ర ప్రాధాన్యం తగ్గుతుందని శిరిడీ వాసులు భయపడుతున్నారని చెప్పారు. పాథ్రీకి చాలా మంది భక్తులు వస్తున్నా పట్టణంలో కనీస సౌకర్యాలు లేవని అందుకే ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేశారని చెప్పారు.

వ్యతిరేకిస్తున్న బీజేపీ..సాయి ట్రస్ట్..

వ్యతిరేకిస్తున్న బీజేపీ..సాయి ట్రస్ట్..

ప్రభుత్వం చేస్తున్న వాదనపైన బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. హ్మద్‌నగర్‌ ఎంపీ సుజయ్‌ విఖే పాటిల్‌ స్పందించారు. శివసేన-ఎన్‌పీసీ-కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఈ వ్యవహారం ఆకస్మికంగా తెరపైకి వచ్చిందని విమర్శించారు. సాయిబాబా జన్మస్థలంపై ఇంతవరకు వివాదం లేదన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత పాథ్రీయే సాయి జన్మభూమి అనడానికి ఆధారాలు ఉన్నాయన్న వాదన వచ్చిందని చెప్పుకొచ్చారు. సాయిబాబా జన్మభూమిని ఏ రాజకీయ నాయకుడూ నిర్ధరించలేరని... ఇలాంటి రాజకీయ జోక్యం కొనసాగితే శిరిడీ వాసులు న్యాయ పోరాటం చేస్తారని ప్రకటించారు. తమ దృష్టిలో జన్మభూమి కన్నా కర్మభూమే గొప్పదన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్‌ నాయకుడు, రాష్ట్ర ప్రజాపనుల శాఖ మంత్రి అశోక్‌ చవాన్‌ సమర్థించుకున్నారు. సాయి జన్మస్థాన్‌ మందిరానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడానికే నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. జన్మభూమిపై వివాదం సృష్టించి భక్తులకు సౌకర్యాలు అందకుండా చేయడం తగదని పేర్కొన్నారు.

నిరసనగా ఆలయం మూసివేత..!!

నిరసనగా ఆలయం మూసివేత..!!

షిర్డీని కాదని పర్భణీకి సాయి మందిరాన్ని తరలించాలన్నది రాష్ట్ర సర్కార్‌ కుయత్నమని ట్రస్ట్‌ ఆరోపించింది. తొలిసారిగా ఆదివారంనాడు బంద్‌కు పిలుపిచ్చింది. సీఎం నిర్ణయానికి వ్యతిరేకంగా ఆలయం మూసివేత నిర్ణయం తీసుకుంది. ఆ రోజునుంచే సాయి ఆలయంలో అన్ని కార్యక్రమాలూ నిలిపేస్తున్నట్లు ప్రకటించడంతో అనూహ్యమైన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. నిజానికి, మరాఠ్వాడా ప్రాంతంలో షిరిడీకి 275 కిలోమీటర్ల దూరంలో పర్భణీ జిల్లాలోని పత్రి అనే ఊరు సాయిబాబా జన్మస్థలమన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది. 1854లో 16 ఏళ్ల వయసులో సాయి షిరిడీకి వచ్చారని, ఇక్కడే తొలుత ఓ వేపచెట్టు కింద సాయిబాబా కనిపించారని భక్తులు చెబుతూ ఉంటారు. షిర్డీలో సాయిబాబా ఆలయాన్ని ఆదివారం నుంచి నిరవధికంగా మూసివేస్తున్న విషయం వాస్తవమేనని ట్రస్టు సభ్యుడు భావుసాహెబ్‌ ధ్రువీకరించారు. సాయి బాబా జన్మస్థలం పత్రి అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

English summary
Shirdi have announced a bandh from January 19. As per sources, the Saibaba Sansthan Trust has slammed Maharashtra Chief Minister Uddhav Thackeray for confusing the devotees.CM announced that Pathri, considered as the birthplace of Saibaba would be developed as a site for religious tourism. There has been a longstanding dispute over his birthplace.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X