వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షిర్డీ సాయిబాబా దేవుడు కాడు: ధర్మసంసద్ ప్రకటన

By Pratap
|
Google Oneindia TeluguNews

రాయ్‌పూర్ : షిరిడీ సాయి బాబా దేవుడు కాదని చత్తీస్‌గఢ్‌లోని కబీర్‌ధామ్‌ జిల్లాలో ముగిసిన ధర్మ సంసద్‌ తీర్మానించింది. సనాతన ధర్మాన్ని పాటించే వారెవరూ ఆయన్ని దేవుడిగా ఆరాధించ వద్దని కోరింది. కాశీ విద్వత్‌ పరిషత్‌ కూడా సాయి బాబా దేవుడూ కాదు, గురువూ కాదని తీర్మానించిన విషయాన్ని గుర్తు చేసింది.

మాంసాహారం తిన్న సాయిబాబా సన్యాసి కూడా కాదని, హిందువులెవరూ ఆయన్ని ఆరాధించ వద్దని ద్వారకా శంకరాచార్య ఇంతకు ముందే ప్రకటించారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో చత్తీస్‌గఢ్‌లో ఈ ధర్మ సంసద్‌ జరిగింది. హిందూమతానికి చెందిన 13 అఖారాల ప్రతినిధులు, అనేక మంది మత ప్రముఖులు రెండు రోజుల పాటు జరిగిన ఈ రహస్య చర్చా సదస్సుకు హాజరయ్యారు.

Shirdi Sai Baba should not be worshipped as deity, says Dharma Sansad

మహారాష్ట్రలోని షిరిడీ సాయి సంస్థాన్‌కు కూడా ఆహ్వానం పంపినా ఎవరూ రాలేదు. అయితే ఢిల్లీ, అహ్మదాబాద్‌ నుంచి వచ్చిన కొంత మంది సాయి భక్తులు తమ వాదన వినిపిస్తుండగా ఒక సాధువు వారిని అడ్డుకుని బయటికి వెళ్లాలని కోరారు.

దీంతో ఇద్దరి మధ్య వాదనలు చోటు చేసుకోవడంతో వేదికపై ఉన్న వారు కల్పించుకుని సర్ది చెప్పడంతో వివాదం ముగిసింది. అయోధ్యలో రామమందిర నిర్మాణంతో పాటు గో సంరక్షణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ధర్మ సంసద్‌ తీర్మానించింది.

English summary
A two-day-long Dharma Sansad (religious conclave) convened by the Shankaracharya Swami Swaroopanand Saraswati of Dwarka Peeth on Monday passed a resolution that Sai Baba, the 19th century saint of Shirdi, should not be worshipped as a deity by the followers of “Sanatan Dharma”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X