తెరచుకున్న షిరిడీ సాయి ఆలయం .. కఠిన ఆంక్షలతో మహారాష్ట్రలోనూ .. గైడ్ లైన్స్ ఇవే !!
దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో దర్శనాలపై ఆంక్షలు విధించారు .కరోనా వైరస్ కారణంగా దేశమంతా కుదేలైంది. ఇంకా కరోనా నుండి బయటపడడం కోసం దేశం ప్రయత్నం చేస్తూనే ఉంది. ఈ క్రమంలో కరోనా ప్రోటోకాల్ కారణంగా ఎనిమిది నెలలపాటు మూసివేయబడిన ఆలయాలు ఒక్కొక్కటిగా తెరుచుకున్నాయి. నిబంధనలు పాటిస్తూ శబరిమల ఆలయం ఆదివారం సాయంత్రం తిరిగి తెరుచుకుంది. ఇదే సమయంలో దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన మహారాష్ట్రలో కూడా ఆలయాలు తెరుచుకుంటున్నాయి.
శబరిమల యాత్ర నవంబర్ 16 నుండి.. వర్చువల్ క్యూ విధానం.. కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి

తెరుచుకున్న షిర్డీలోని సాయి బాబా ఆలయం.. కోవిడ్ నిబంధనలు కరోనా నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరి
కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఏడు నెలల మూసివేత తరువాత, షిర్డీలోని సాయి బాబా ఆలయం సోమవారం భక్తుల కోసం తెరుచుకుంది . ఒక నిర్దిష్ట సమయ స్లాట్ కోసం ఆన్లైన్లో బుకింగ్ చేసిన తర్వాత మాత్రమే సందర్శకులను అనుమతిస్తామని ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు . చాలా నెలల తరువాత ప్రభుత్వం మాకు తెరవడానికి అనుమతించినందుకు మేము సంతోషిస్తున్నాము. సందర్శించాలనుకునే భక్తులు` దర్శనం 'కోసం టైమ్ స్లాట్ పొందడానికి ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలని అంటున్నారు . దీనితో పాటు ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు కరోనా నెగిటివ్ రిపోర్ట్ కూడా చూపించాల్సి ఉంటుందని అంటున్నారు .

ఆలయాలు, ప్రార్ధనా స్థలాలను తెరవాలని మహా సర్కార్ నిర్ణయం
ఎనిమిది నుండి పది సంవత్సరాల వయస్సు గల పిల్లలను అనుమతించరని ఆలయ నిర్వహణ ప్రతినిధి తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 16, సోమవారం నుండి రాష్ట్రంలోని దేవాలయాలు మరియు ప్రార్థనా స్థలాలను తిరిగి తెరవాలని నిర్ణయించింది. అన్ లాక్ 5.0 మార్గదర్శకాలలో భాగంగా మతపరమైన ప్రదేశాలను తిరిగి తెరవడానికి మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలోని మత ప్రదేశాలను సందర్శించడానికి భక్తులకు అనుమతి ఇవ్వగా, వారు అన్ని కోవిడ్ -19 మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని పేర్కొంది.

ముంబై సిద్ధి వినాయక ఆలయం , హాజీ అలీ దర్గాలు ప్రారంభం .. కోవిడ్ నిబంధనలతో దర్శనాలు
ఈరోజు ఉదయం నుండి, చాలా మంది భక్తులు ముంబైలోని సిద్ధివినాయక్ ఆలయాన్ని సందర్శించారు. భక్తులు కఠినమైన సామాజిక దూరాన్ని అనుసరిస్తున్నారని , కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారని తెలుస్తుంది.ముంబైలోని ప్రసిద్ధ హాజీ అలీ దర్గా కూడా ఈ రోజు తిరిగి ప్రారంభించబడింది . అక్కడ కూడా కోవిడ్ నిబంధనలు అమలులో ఉన్నాయి. కఠినమైన సామాజిక దూర చర్యలు అమలులో ఉన్నాయి. మతపరమైన ప్రదేశాలను తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తరువాత మహీం దర్గా ముంబైలో కూడా తిరిగి ప్రారంభించబడింది. ఫేస్ మాస్క్ ధరించడం ప్రవేశానికి తప్పనిసరి కాగా శానిటైజేషన్ కోసం ఏర్పాట్లు చేశామని దర్గా నిర్వాహకులు పేర్కొన్నారు.

నాగపూర్ లోనూ తెరుచుకున్న ఆలయాలు
రాష్ట్రంలోని ఇతర ప్రదేశాల్లోని ఇతర దేవాలయాలు, మసీదులను కూడా భక్తులు సందర్శించారు. నాగ్‌పూర్‌లోని శ్రీ గణేష్ టెక్డి ఆలయంలో మాస్కులు ధరించిన భక్తులు, సామాజిక దూర చర్యలలో భాగంగా భక్తులు ఆలయంలో ఏర్పాటు చేసిన సర్కిల్‌లలో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయం రెండు నెలల మండల-మకరజ్యోతి సీజన్ కోసం ఆదివారం సాయంత్రం తిరిగి ప్రారంభించబడింది. కోవిడ్ -19 ప్రోటోకాల్స్ అమలులో ఉన్నాయి. ఈ రోజు నుండే యాత్రికులను ఆలయం లోపల అనుమతించవచ్చని తెలుస్తుంది. 62 రోజుల సుదీర్ఘ యాత్రికుల సీజన్ ప్రారంభమైన సందర్భంగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు తాంత్రి కందారు రాజీవరు సమక్షంలో గర్భగుడి తలుపులు తెరిచి దీపాలను వెలిగించారు.