వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మా.. తల్లీ... దేశాయ్ నువ్వు దేశాన్ని ఉద్దరించింది చాలు, షిరిడీ గుడిలోకి మేడమ్ బ్యాన్, ఫ్రీ పబ్లిసిటీ కోసం!

|
Google Oneindia TeluguNews

షిరిడి/ ముంబాయి/ మహరాష్ట్ర: సామాజిక కార్యకర్త అంటూ హిందూ ఆచారాలను తప్పు పడుతూ ఫ్రీ పబ్లిసిటి తెచ్చుకోవడానికి తహతహలాడే తృప్తీ దేశాయ్ కి ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ పుణ్యక్ష్రేతం షిరిడీ ఆలయంలోకి సాంప్రధాయ దుస్తుల్లో రావాలసి ఆలయ కమిటీ చేసిన విన్నపాన్ని రాద్దాంతం చేస్తున్న తృప్తీ దేశాయ్ కి షిరిడీ ఆలయంలోకి ప్రవేశించకుండా నిర్బంధం విధించారు.

నేను, నా మద్దతుదారులు షిరిడీ ఆలయంలోకి వచ్చి అక్కడ అధికారులు ఏర్పాటు చేసిన బోర్డులను నాశనం చేస్తామని బహిరంగంగా సవాలు చేసిన తృప్తీ దేశాయ్ కి షాక్ ఇచ్చారు. అమ్మా మహాతల్లి దేశాయ్ నువ్వు దేశాన్ని ఉద్దరిస్తున్నది చాలు, నీ ఇంట్లో నువ్వు ఉండు, ఇక్కడికి రావద్దు అంటూ తృప్తీ దేశాయ్ కి షిరిడీ ఆలయ ప్రవేశానికి రాకుండా నిర్బంధం విధించడంతో మేడమ్ దిమ్మతిరిగిపోయింది.

Liquor lady: పోలీసులను ఎగిరెగిరి తన్నిన శివగామి, రేయ్... నేను ఎవరో తెలుసా, బూతులు, అసలే సినిమా ఫీల్డ్!Liquor lady: పోలీసులను ఎగిరెగిరి తన్నిన శివగామి, రేయ్... నేను ఎవరో తెలుసా, బూతులు, అసలే సినిమా ఫీల్డ్!

సాంప్రధాయ దుస్తుల్లో రండి

సాంప్రధాయ దుస్తుల్లో రండి

ప్రముఖ పుణ్యక్షేత్రం షిరిడీకి దేశ విదేశాల నుంచి భక్తులు వెలుతుంటారు. ఇటీవల కాలంలో షిరిడీ ఆలయాను కొందరు చాలీచాలని దుస్తులు వేసుకుని వస్తున్నారని, వారు సాటి భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శలు ఎదురైనాయి. చాలా మంది భక్తులు మనవి, సూచన మేరకు ఆలయ కమిటీ నిర్వహకులు కమిటీ సభ్యులు, భక్తులతో చర్చించారు. షిరిడీ ఆలయానికి సాంప్రధాయ దుస్తుల్లో రావాలని షిరిడీ ఆలయం ముందు అధికారులు బోర్డులు పెట్టారు.

పనీపాట లేని తృప్తీ దేశాయ్

పనీపాట లేని తృప్తీ దేశాయ్

సామాజిక కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకున్న తృప్తీ దేశాయ్ దేశంలో ఎక్కడ ఏం జరిగినా నేను ఉన్నాను అంటూ పానకంలో పుడకలాగా పైకి లేస్తోంది. ముఖ్యంగా హిందూ దేవాలయాలు, హిందు సాంప్రధాయలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న తృప్తీ దేశాయ్ తీవ్రచర్చకు దారితీస్తోంది. ఇదే సయయంలో షిరిడీ ఆలయం బోర్డు నిర్వహకులు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ తృప్తీ దేశాయ్ ఎగిరెగిరిపడింది.

బోర్డులు పీకేస్తా..... నా సత్తా చూపిస్తా

బోర్డులు పీకేస్తా..... నా సత్తా చూపిస్తా

షిరిడీ ఆలయం ముందు ఏర్పాటు చేసిన బోర్డులను డిసెంబర్ 10వ తేదీన తాను, తన మద్దతుదారులు తొలగిస్తామని, మా సత్తా చూపిస్తామని సామాజిక కార్యకర్త తృప్తీ దేశాయ్ బహిరంగంగా సవాలు చేశారు. తృప్తీ దేశాయ్ తీరుపై పలు హిందూ సంఘ, సంస్థలు మండిపడ్డాయి. డిసెంబర్ 10వ తేదీన తృప్తీ దేశాయ్ ఆమె మద్దతుదారులు షిరిడీకి రాకుండా అడ్డుకోవాలని నిర్ణయించారు. ఈ వివాదం ముదిరిపోవడంతో షిరిడీ ఆలయ కమిటీ నిర్వహకులు అలర్ట్ అయ్యారు.

దేశాయ్ కి నోటీసులు జారీ, నిషేదం

దేశాయ్ కి నోటీసులు జారీ, నిషేదం

శాంతిభద్రతలకు భంగం కలగకుండా చూడటానికి సీఆర్ పీసీ సెక్షన్ 144 ప్రకారం తృప్తీ దేశాయ్ డిసెంబర్ 11వ తేదీ అర్దరాత్రి వరకు షిరిడీలో అడుగు పెట్టకుండా చూడటానికి ముందుగానే ఆమెకు నోటీసులు జారీ చేశారు. మ్యాజిస్ట్రేట్ గోవింద్ శింథే సామాజిక కార్యకర్త తృప్తీ దేశాయ్ కి నోటీసులు జారీ చేశారు. దేశాయ్ కి నోటీసులు జారీ చెయ్యడంతో తాత్కాలికంగా ఈ వివాదానికి చెక్ పడింది. ఈ దెబ్బతో మేడమ్ తృప్తీ దేశాయ్ దిమ్మతిరిగిపోయింది.

నువ్వు జిల్లాలోకే రాకూడదు

నువ్వు జిల్లాలోకే రాకూడదు

డిసెంబర్ 11వ తేదీ అర్దరాత్రి వరకు షిరిడీ ఆలయం ఉన్న మహారాష్ట్రలోని అహమ్మద్ నగర్ జిల్లాలో అడుగు పెట్టకూడదని సామాజిక కార్యకర్త తృప్తీ దేశాయ్ కి ఆదేశాలు జారీ చేశారు. తాము సాంప్రధాయ దుస్తుల్లోనే ఆలయానికి రావాలని భక్తులకు మనవి చేశామని, ఇలాగే రావాలి, ఇలాగే ఉండాలని నిర్బంధం విధించలేదని షిరిడీ ఆలయ కమిటీ సభ్యులు, దేవాలయం అధికారులు వివరణ ఇచ్చారు. మొత్తం మీద ఫ్రీ పబ్లిసిటీ కోసం నిత్యం తహతహలాడే సామాజిక కార్యకర్త తృప్తీ దేశాయ్ కి సరైన శాస్తి జరిగిందని కొన్ని హిందూ సంఘ, సంస్థలు అంటున్నాయి.

English summary
Shirdi: Social activist Trupti Desai has been barred from entering Maharashtra's temple town of Shirdi till December 11 after she threatened to remove boards put up by shrine officials asking devotees to dress in a "civilised" manner, an official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X