వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ గాంధీ శివభక్తుడు, కాంగ్రెస్ పార్టీ ప్రచారం, ఎన్నికల సందడి, భారీ కటౌట్లు !

|
Google Oneindia TeluguNews

భోపాల్: మధ్యప్రదేశ్ లో శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న సందర్బంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భోపాల్ లో రోడ్ షో నిర్వహించారు. సోమవారం సాయంత్రం భోపాల్ లో రాహుల్ గాంధీ 18 కిలోమీటర్ల మేర రోడ్ షో ప్రారంభించారు. 11 మంది హిందూ పూజరుల ఆశీర్వాదం తీసుకున్న తరువాత రాహుల్ గాంధీ రోడ్ షో, ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు.

రోడ్ షో సందర్బంగా రాహుల్ గాంధీ శివలింగం మీద నీళ్లు పోస్తున్న ఫోటోలతో భోపాల్ లో భారీ బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ శివభక్తుడు అంటూ ప్రాచారం చేశారు. రాహుల్ గాంధీతో పాటు మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ద్విగ్విజయ్ సింగ్ తో పాటు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ పోస్టర్లు, కటౌట్లు ఏర్పాటు చేశారు.

Shiv Bhakt Rahul Gandhi posters up in Bhopal in Madhya Pradesh

బీహెచ్ఈఎల్ దసరా గ్రౌండ్స్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. ఇటీవల రాహుల్ గాంధీ చేపట్టిన కైలాస మానససరోవరం యాత్ర నేపథ్యంలో ఆయన శివభక్తుడిగా చిత్రీకరిస్తూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు.

ఎన్నికలు సమీపించే సమయంలో రాహుల్ గాంధీ టెంపుల్ టూర్ ప్రారంభిస్తారని అనేక సార్లు బీజేపీ నాయకులు విమర్శలు చేశారు. బీజేపీ నాయకుల విమర్శలను తిప్పికొట్టడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా ప్రచారం చేస్తున్నారు.

English summary
Posters calling Rahul Gandhi a Shiv bhakt have gone up around Bhopal, Madhya Pradesh's capital, where the Congress president has embarked on a roadshow ahead of upcoming assembly elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X