వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బోగీలను వదిలిపోయిన శివగంగా ఎక్స్‌ప్రెస్ ఇంజిన్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి మరువాడీకి వెళుతున్న శివగంగా ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇంజిన్.. దానికి చెందిన బోగీల నుంచి విడిపోయి కొంత దూరం వరకు వెళ్లిపోయింది. దీంతో 6కుపైగా రైళ్లను నిలిపివేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ ఘటన జంగీగంజ్‌, అత్రౌలా రైల్వే స్టేషన్‌ల మధ్య చోటు చేసుకుంది.

సోమవారం ఉదయం 9:10 నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగిందని గ్యాన్‌పూర్‌ స్టేషన్‌ మాస్టర్‌ అశోక్‌ కుమార్‌ వర్మ తెలిపారు. రైలు తక్కువ వేగంతో ఉన్నప్పుడు బోగీల నుంచి ఇంజను విడివడిందని చెప్పారు.

Shiv-Ganga express engine decouples on Allahabad-Varanasi route in UP

దీంతో ప్రమాదం తప్పిందని లేదంటే పెద్ద ప్రమాదం జరిగేదన్నారు. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామంతో ఆ మార్గంలో నడవాల్సిన అరడజను రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేయాల్సి వచ్చిందని తెలిపారు.

ఆ తర్వాత మరో ఇంజన్‌ని తెప్పించి బోగీలకు కలిపి 10:34 నిమిషాలకు రైలును అక్కడి నుంచి గమ్యస్థానానికి పంపించినట్లు అశోక్ కుమార్ వర్మ చెప్పారు.

English summary
The Indian Railways train engine of Shiv-Ganga express from New Delhi to Maruadih today decoupled leaving the bogies behind between Jangiganj and Atraula railway stations on Allahabad-Varanasi section here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X